తమిళ రాజకీయాల్లో సంచలనం..విజయ్‌కు ఆ పార్టీ ఫుల్ సపోర్టు

తమిళనాడు రాజకీయాలు ప్రస్తుతం వేగంగా మారుతున్న సమీకరణాలతో ఉత్కంఠ రేపుతున్నాయి. ముఖ్యంగా, అన్నాడీఎంకే అధినేత ఎడప్పాడి పళనిస్వామి బహిరంగ సభలో చోటుచేసుకున్న అనూహ్య పరిణామాలు, పొత్తుల గురించిన ఊహాగానాలకు మరింత బలం చేకూరుస్తున్నాయి.

కుమారపాలెంలో జరిగిన అన్నాడీఎంకే ప్రచార సభ ఇప్పుడు రాష్ట్రంలో హాట్ టాపిక్‌గా మారింది. ఈ సభలో ఆ పార్టీ కార్యకర్తలతో పాటు, ప్రముఖ నటుడు విజయ్ స్థాపించిన పార్టీ అయిన తమిళగ వెట్రి కజగం (TVK) జెండాలు కూడా కనిపించడం సంచలనం సృష్టించింది. ఒకవైపు అన్నాడీఎంకే జెండాలు రెపరెపలాడుతుంటే, వాటి పక్కనే టీవీకే జెండాలు కూడా కనిపించాయి. ఈ పరిణామంపై పళనిస్వామి స్పందించిన తీరు మరింత ఆసక్తిని పెంచింది.

Tamil Nadu Political Twist Vijay s TVK Flags Spotted at EPS Rally Is the AIADMK-TVK Alliance Confirmed

సభలో మాట్లాడిన పళనిస్వామి, డీఎంకే ప్రభుత్వం (DMK) పై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ముఖ్యమంత్రి స్టాలిన్‌ను టార్గెట్ చేస్తూ, రాబోయే ఎన్నికల కోసం డీఎంకేపై యుద్ధానికి రెడీ అంటూ పరోక్షంగా శంఖం ఊదారు.

అంతేకాదు, సభలో కనిపిస్తున్న టీవీకే జెండాలను చూపిస్తూ... ఈసారి మన గెలుపు ఊహించని విధంగా ఉంటుంది. గెలుపు మనదే అని ప్రకటించారు. ఈ వ్యాఖ్యలు అన్నాడీఎంకే , టీవీకే మధ్య పొత్తు కుదిరే అవకాశం ఉందని పరోక్షంగా సంకేతాలు ఇచ్చినట్టేనని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.

అన్నాడీఎంకేకు ప్రజల్లో బలం ఉన్నా, బలమైన యువ నాయకుడి మద్దతు అవసరం.నటుడు విజయ్‌కు తమిళ యువతలో ఉన్న ఫాలోయింగ్, టీవీకేకు ఉన్న ప్రజాదరణ అన్నాడీఎంకేకు కలిసి వచ్చే అంశాలుగా రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.

మొత్తం మీద, అన్నాడీఎంకే-విజయ్ టీవీకే పొత్తు వార్తలపై రాష్ట్రంలో ప్రచారం ఊపందుకుంది. పళనిస్వామి వ్యాఖ్యలు ఈ పొత్తు దాదాపు ఖాయమైందనే చర్చకు దారితీశాయి. రాబోయే ఎన్నికల్లో డీఎంకేను ఓడించేందుకు ఈ రెండు శక్తులు ఏకమవుతాయా? అన్నది ఇప్పుడు తమిళ రాజకీయాల్లో ప్రధాన చర్చనీయాంశంగా మారింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+