తేవార్ జయంతి, అన్నాడీఎంకేలో రెండు గ్రూపులు: బ్యాంకు అధికారులకు తలనొప్పి, కలెక్టర్ ఎంట్రీ !

Posted By:
Subscribe to Oneindia Telugu

చెన్నై: తమిళనాడులో ఘనంగా నిర్వహించే తేవార్ జయంతి వేడుకలు ఈ సంవత్సరం అన్నాడీఎంకే పార్టీ నిర్వహకులు ఘనంగా నిర్వహించడానికి ఏర్పాట్లు చేస్తున్నారు. ప్రతి సంవత్సరం అక్టోబర్ 28వ తేదీ నుంచి అక్టోబర్ 30వ తేదీ వరకు తేవార్ గురు పూజ నిర్వహిస్తారు.

ప్రతి సంవత్సరం తేవార్ వర్గం నాయకుడు పసుంపొన్ ముత్తురామలింగం తేవార్ జయంతి వేడుకలు జయలలిత దగ్గర ఉండి నిర్వహించేవారు. తేవార్ విగ్రహానికి జయలలిత బంగారు కవచం చేయించారు. రూ. 4.5 కోట్ల విలువైన 13 కేజీల తేవార్ విగ్రహానికి 2014లో జయలలిత బంగారు కవచం చేయించారు.

Tamil Nadu Posumpon Muthuramalingam Thevar Jayanthi

ఆ బంగారు కవచం మదురైలోని బ్యాంక్ ఆఫ్ ఇండియా లాకర్ లో భద్రపరిచారు. గత సంవత్సరం జయలలిత అనారోగ్యంతో అపోలో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న సమయంలో పన్నీర్ సెల్వం, తేవార్ ట్రస్టీ గాంధీ మీనల్ మదురైలోని బ్యాంక్ ఆఫ్ ఇండియా బ్రాంచ్ కు వెళ్లి తేవార్ బంగారు కవచం బయటకు తీసుకు వచ్చి ప్రత్యేక పూజలు నిర్వహించారు.

తరువాత కట్టుదిట్టమైన భద్రతతో తేవార్ బంగారు కవచం మళ్లీ బ్యాంక్ ఆఫ్ ఇండియాకు తరలించారు. ఇప్పుడు అన్నాడీఎంకే పార్టీ రెండుగా చీలిపోవడంతో ఏ వర్గానికి తేవార్ బంగారు కవచం ఇవ్వాలో అర్థం కాక బ్యాంకు అధికారులు తలలు పట్టుకున్నారు. రెండు వర్గాలకు ఇవ్వకుండా మదురై జిల్లా కలెక్టర్ వీరరాఘవన్ కు తేవార్ బంగారు కవచం అప్పగించాలని శుక్రవారం బ్యాంక్ ఆఫ్ ఇండియా అధికారులు నిర్ణయించారు.

ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
AIADMK, the Madurai branch of the Bank of India has declined to hand over to the ruling dispensation a golden armour donated by former chief minister J Jayalalithaa

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి