వింటర్ లో తమిళనాడు టూర్.. ఒక్కసారైనా చూడాల్సిన ప్రదేశాలు ఇవే..

తమిళనాడులో ఎన్నో పర్యాటక, చారిత్రక ప్రాంతాలు ఉన్నాయి. తమిళ ప్రాంతానికి వేల సంవత్సరాల చరిత్ర కలిగి ఉంది. తమిళనాడులో ఊటీ, కొడైకెనాల్, ఏర్కాడ్, వల్పరై లాంటి కొండ ప్రాంతాలకు నిత్యం టూరిస్టులు అధిక సంఖ్యలో వస్తుంటారు. ఊటీ అందాలతో పాటు అక్కడే నీలగిరి రైలు, బొటానికల్ గార్డెన్స్ కనువిందు చేస్తాయి. అలాగే కొడైకెనాల్ లో లేక్స్, జలపాతాలకు ప్రసిద్ధి చెందింది. ఇక ఏర్కాడ్, వల్పరై ప్రాంతాలు ప్రకృతి ప్రేమికులకు ఎక్కడా దొరకని అనుభూతిని ఇస్తాయి.

అయితే తమిళనాడులోని పలు పర్యాటక ప్రాంతాలను శీతాకాలంలో సందర్శిస్తే ఆ కిక్కే వేరు అని పర్యాటకులు చెబుతున్నారు. వింటర్ సీజన్ లో ఒక్కసారైనా వీటిని చూడాలని అంటున్నారు. వాటిలో ఏర్కాడ్ ఒకటి. తమిళనాడులోని ఏర్కాడ్ లో ఏర్కాడ్ సరస్సు, కాఫీ తోటలు, లేడీ సీట్ వ్యూ పాయింట్.. తదితర ప్రాంతాలు ఆహ్లాదాన్ని అందిస్తాయి. ఇక్కడి కాఫీ తోటలు చాలా ప్రశాంతతను కలిగిస్తాయి.

అలాగే దట్టమైన పొగమంచుతో కప్పబడిన మరో ప్రాంతం వాల్పరై.. పొగమంచుతో కప్పబడిన ఇక్కడి పర్వత ప్రాంతాలు, టీ, కాఫీ తోటలు, ఒంపులు తిరిగే రోడ్డు మార్గాలు శీతాకాలంలో అయితే స్వర్గధామంగా కనిపిస్తాయి. వింటర్ లో వాల్పరై ప్రాంతాన్ని ఒక్కసారైనా చూడాలని పర్యాటకులు అనుకుంటూ ఉంటారు. ఇక ఊటీ బెస్ట్ టూరిస్ట్ ప్రాంతంగా పేరుగాంచింది. అన్ని కాలాల్లో ఇక్కడి వాతావరణం చల్లగా ఉంటుంది. దాంతో పర్యటకులు అధిక సంఖ్యలో ఈ ఊటీ అందాలను చూసేందుకు తరలివస్తుంటారు. ఇక వర్షాకాలంలో అయితే ఈ ప్రాంతం గురించి మాటల్లో చెప్పలేని అనుభూతిని ఇస్తుంది. ఊటీ ప్రాంతంలో నీలగిరి పర్వత రైల్వే ఓ ప్రధాన ఆకర్షణగా నిలుస్తుంది.

ఇక ఆ తర్వాత తమిళనాడులోని కొల్లి కొండలు ప్రధాన ఆకర్షణ కలిగిన ప్రాంతంగా ఉంది. ఇక్కడ 70 కు పైగా హెయిర్ పిన్ ఒంపులు, దట్టమైన పొగమంచుతో కూడిన రోడ్లు చాలా సుందరంగా ఉంటాయి. అలాగే ఇక్కడ ఉన్న అగా గంగా నది ఓ ప్రధాన ఆకర్షణగా నిలుస్తోంది. అలాగే కొడైకెనాల్ హిల్ స్టేషన్ కు చలికాలంలో చాలామంది పర్యటకులు వస్తుంటారు. ఇక్కడి పొగమంచుతో నిండిన కొండలు అద్భుతంగా ఉంటాయి.

Tamil Nadu s Delightful Hill Escapes Ooty Kodaikanal Yercaud Valparai Kolli Hills amp amp Hogenakkal Falls

అలాగే తమిళనాడులోని హోగెనక్కల్ జలపాతం అందాలు చూడాలంటే రెండు కళ్లు సరిపోవు. దీన్ని తమిళనాడు నయాగరా జలపాతం అని పిలుస్తుంటారు. ఇక్కడే కుట్రాలం జలపాతం కూడా ఉంటుంది. ఇక్కడి ప్రాంతాన్ని సహజసిద్ధమైన స్పా అని పేరు. ఇక్కడి జలపాతంలో స్నానం చేయడం చాలా ఆహ్లాదకరంగా ఉంటుంది. ఇక్కడి చల్లని వాతావరణాన్ని ఆస్వాదించవచ్చు. అలాగే అగస్తియార్ జలపాతం కూడా ఉంటుంది. ఇక్కడే వన్యప్రాణులను కూడా చూడొచ్చు. ఇక్కడి జలపాతం ఓ అందమైన దృశ్యంగా ఉంటుంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+