NEET: నీట్ పరీక్షపై హీరో విజయ్ సంచలన వ్యాఖ్యలు..!

నీట్ 2024 నిర్వహణ తీరుపై దేశవ్యాప్తంగా ఆందోళనలు కొనసాగుతోన్నాయి. నీట్ పేపర్ లీక్ అయిన్నట్లు ఆరోపణలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే బీహార్ ప్రభుత్వం ఏర్పాటు చేసిన సెట్ నీట్ పేపర్ లీక్ అయినట్లు నిర్ధారించింది. ఇందుకు సంబంధించి నిందితులను కూడా అరెస్ట్ చేసింది. మరోవైపు నీట్ పరీక్ష నిర్వహణ, నీట్ పేపర్ లీక్ పై సుప్రీం కోర్టులో పిటిషన్లు దాఖలు అయ్యాయి. వీటిపై సుప్రీం విచారణ చేస్తోంది. కేంద్ర ప్రభుత్వ తీరును వ్యతిరేకిస్తూ దేశవ్యాప్తంగా జులై 4న విద్యాసంస్థల బంద్ కు విద్యార్థి సంఘాలు పిలుపునిచ్చాయి.

నీట్ వ్యవహారంపై తమిళ సూపర్ స్టార్, తమిళకి వెట్రి కజగం పార్టీ వ్యవస్థాపకుడు విజయ్ స్పందించారు. ఇక నుంచి నీట్ పరీక్షను రద్దు చేయాలంటూ డిమాండ్ చేశారు. అందుకు సంబంధించి పరీక్ష రద్దు కోసం స్టాలిన్ ప్రభుత్వం శాసనసభలో చేసిన తీర్మానానికి మద్దుతు ప్రకటించారు. నీట్ పరీక్షలో అవకతవకలతో సామన్య విద్యార్థులు చెప్పరాని ఇక్కట్లు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఒక్క తమిళనాడులోనే కాకుడా దేశంలో ఎక్కడా నీట్ పరీక్షను రద్దు చేయాలని విజయ్ కేంద్రాన్ని కోరాడు.

Tamil superstar founder of Tamilaki Vetri Kazhagam party demanded cancellation of NEET exam

నీట్‌ 2024 పరీక్షలో గ్రేస్‌ మార్కులు పొందిన అభ్యర్థులకు మళ్లీ పరీక్షలు నిర్వహించారు. ఈ ఫలితాలను సోమవారం జాతీయ టెస్టింగ్‌ ఏజెన్సీ (ఎన్‌టీఏ) సోమవారం విడుదల చేసిన సంగతి తెలిసిందే. అలాగే నీట్‌ యూజీ 2024 అభ్యర్థులందరి ర్యాంకులను సవరించినట్లు పేర్కొంది. మొత్తం 1,563 మందికి మళ్లీ పరీక్ష నిర్వహించగా.. 813 మంది మాత్రమే హాజరయ్యారని ఎన్టీఏ తెలిపింది. గ్రేస్‌ మార్కులు కలపడంతో 720 మార్కులు పొంది మొదటి ర్యాంకు సాధించిన ఆరుగురు అభ్యర్థుల్లో అయిదుగురు మళ్లీ నిర్వహించిన పరీక్షకు హాజరు అయ్యారు. వారిలో ఏ ఒక్కరూ 720 మార్కులు సాధించలేక పోయారు.

ప్రధాని నరేంద్ర మోదీకి ప్రతిపక్ష నేత రాహుల్‌ గాంధీ నీట్ పరీక్షపై లేఖ రాశారు. నీట్‌ వ్యవహారంపై లోక్‌సభలో చర్చ జరిగేలా చూడాలని కోరారు.నీట్ వ్యవహరం పై ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ మంగళవారం స్పందించారు. నీట్‌ పేపర్‌ లీకేజీపై దర్యాప్తు వేగంగా కొనసాగుతోందన్నారు. లక్షలాది విద్యార్ధుల కష్టాన్ని వృథా కాననివ్వమని పేర్కొన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+