విజయ్ తో పొత్తు ఆఫర్ పై కాంగ్రెస్-బూస్ట్, హార్లిక్స్ పంచ్ లు..!
తమిళనాడులో అసెంబ్లీ ఎన్నికల వేళ రాజకీయాలు వేడెక్కుతున్నాయి. ఇప్పటికే అధికార డీఎంకే కూటమికి పోటీగా అన్నాడీఎంకే-బీజేపీ కూటమి ఎన్నికలకు సిద్దమవుతోంది. అయితే వీరిద్దరికీ పోటీగా మారిన హీరో విజయ్ పార్టీ టీవీకేను తమవైపు తిప్పుకునేందుకు ఇరు కూటములూ చేసిన ప్రయత్నాలు విఫలమయ్యాయి. దీంతో ఒంటరిగా బరిలోకి దిగేందుకు వ్యూహాలు సిద్దం చేసుకుంటున్న టీవీకేను కాంగ్రెస్ (congress) ఇంకా పొత్తుల కోసం కెలుకుతూనే ఉంది.
ఈ నేపథ్యంలో టీవీకే పార్టీ అధినేత విజయ్ తండ్రి చంద్రశేఖర్ కాంగ్రెస్ పార్టీకే తమతో పొత్తుపెట్టుకోవాలని ఆఫర్ ఇచ్చారు.
కాంగ్రెస్ కు ఒక చరిత్ర, వారసత్వం ఉందని, విజయ్ వారికి మద్దతు ఇవ్వడానికి, వారి పాత వైభవాన్ని తిరిగి పొందడానికి సిద్ధంగా ఉన్నాడని ఆయన తెలిపారు. ఇప్పుడు ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవాలా వద్దా అనే నిర్ణయం కాంగ్రెస్ పైనే ఉందన్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ రాజకీయ ఉనికి కోసం పోరాడుతోందని ఈ సందర్బంగా ఆయన గుర్తుచేశారు.

దీనిపై తమిళనాడు కాంగ్రెస్ ఘాటుగా స్పందించింది. పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కె.సెల్వపెరుంతగై విజయ్ తండ్రి ఇచ్చిన పొత్తు ఆఫర్‌ను తోసిపుచ్చారు. విజయ్ నుండి తమ కేడర్‌కు ఎలాంటి 'బూస్ట్' అవసరం లేదని ప్రకటించారు. తమ క్యాడర్‌ను చూస్తే వారికి ఇప్పటికే బూస్ట్ లభించిందని తెలుస్తుందన్నారు. అలాగే తమ నాయకుడు రాహుల్ గాంధీ వారికి అవసరమైన 'బూస్ట్, హార్లిక్స్, బోర్న్‌విటా' ఇస్తున్నారంటూ పంచ్ లు విసిరారు.

మరోవైపు డీఎంకే నాలుగోసారి రాష్ట్రంలో గెలిచి తమతో అధికారం పంచుకునేందుకు అంగీకరించకపోతే కూటమికి గుడ్ బై చెప్పేసేందుకు కాంగ్రెస్ సిద్దమవుతోంది. ఇప్పటివరకూ స్టాలిన్ తమ మిత్రపక్షాలకు అధికారం పంచేందుకు నిరాకరించారు. కానీ ఈసారి కూడా అధికారంలో భాగస్వామ్యం ఇవ్వకపోతే కాంగ్రెస్ కీలక నిర్ణయం తీసుకోవాలని భావిస్తోంది. ఇప్పటికే గత రెండు పార్లమెంట్ ఎన్నికల్లో చూస్తే 2024లో పోటీ చేసిన 9 సీట్లు, 2021లో 18 సీట్లు గెల్చుకున్న కాంగ్రెస్ ఈసారి స్టాలిన్ తగ్గకపోతే రూటుమార్చినా ఆశ్చర్యం లేదంటున్నారు.












Click it and Unblock the Notifications