టమాట ధరకు రెక్కలు: తమిళనాడు ప్రభుత్వం కీలక నిర్ణయం
నిత్యావసర సరుకుల ధరలు ఏమో కానీ.. కూరగాయల ధరలు కూడా మండిపోతున్నాయి. ముఖ్యంగా టమాట గురించి అయితే చెప్పక్కర్లేదు. పెట్రోల్ కంటే ఫాస్టుగా పరిగెడుతోంది టమాటాల ధర పెరుగుతుంది. దీంతో వంటల్లో టమాటా జాడే కనిపించడం లేదు. చెన్నైలో కిలో టమాటా రూ.150 వరకు విక్రయిస్తున్నారు. దీంతో జనాలు టమటావైపు చూడటం లేదు. టమాటా ధరలను కట్టడి చేయటానికి సీఎం ఎంకె స్టాలిన కీలక నిర్ణయం తీసుకున్నారు.

టమాట ధరకు రెక్కలు
టమాట ధరల కట్టడికి స్టాలిన్ ప్రభుత్వం విస్తృత చర్యలు చేపట్టింది. సహకార శాఖ పరిధిలోని గల దుకాణాల్లో కిలో రూ. 79కి అమ్మేలా చర్యలు చేపట్టారు. వర్షాలు..పెరిగిన పెట్రోల్ ధరలతో..ట్రాన్స్ పోర్టు చార్జీలు కూడా పెరిగాయి. వర్షాల వల్ల టమాటాల పంట దెబ్బతింది. దిగుమతికూడా తగ్గడంతో టమాట ధరలకు రెక్కలు వచ్చినట్లైంది. కొన్ని రోజుల క్రితం వరకు కిలో టమాట రూ.10 నుంచి 20 అమ్మితే హఠాత్తుగా ఒకేసారి రూ.100కు చేరుకుంది. అలా రూ.100 కూడా దాటేసింది.

కిలో టమటా రూ.130 నుంచి రూ.150
చెన్నైలో కిలో టమాటా కిలో రూ. 130 నుంచి రూ. 150 వరకు పలుకుతోంది. ధరలు మరింత పెరగొచ్చనే సంకేతాలతో మహారాష్ట్ర నుంచి టమాటాలను దిగుమతి చేసుకుంటున్నారు. సహకారశాఖ పరిధిలో తోట పచ్చధనం దుకాణాల ద్వారా బుధవారం నుంచి కిలో రూ. 79కి విక్రయాలు ప్రారంభించింది. చెన్నైలో 40, ఇతర ప్రాంతాల్లోని మరో 65 దుకాణాల్లో విక్రయాలు సాగుతున్నాయి. ప్రతిరోజు 15 మెట్రిక్ టన్నుల టమోటాలను సేకరిస్తున్నామని రాష్ట్ర సహకార శాఖ ప్రకటించింది.

తక్కువ ధరకే విక్రయం
ప్రజలకు తక్కువ ధరకు టమాటా సరఫరా చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. అందుకే టమోటాలను సేకరించి కొని వాటిని ప్రజలకు తక్కువ ధరకే ఇస్తున్నామని తెలిపారు. నిన్న ఒక్కరోజు మధ్యాహ్నం వరకు..8 మెట్రిక్ టన్నుల టమోటాలు విక్రయించామని సహకార శాఖ మంత్రి ఐ పెరియసామి తెలిపారు. ప్రభుత్వమే స్వయంగా టమాటాలు అమ్మటంతో మార్కెట్ లో కూడా ధరలు దిగి వచ్చాయి. బహిరంగ మార్కెట్‌లో కిలో టమాట రూ. 140 ఉండగా..ప్రభుత్వం తీసుకున్న ఈ చర్యతో ఒక్కరోజులోనే దాదాపు రూ.కిలోకు 90-100కు దిగి వచ్చింది.

కర్ణాటక, ఏపీ
ఇతర కూరగాయల ధరలు కూడా తగ్గాయి. ఇలా ప్రభుత్వం ఈ టమాటాల అమ్మకం కొంతకాలం పాటు కొనసాగిస్తే మొత్తం ధరలు దిగివస్తాయని అంటున్నారు. కర్ణాటకలోని రెండు ప్రాంతాలు మరియు ఆంధ్రప్రదేశ్‌లోని మూడు ప్రాంతాల నుండి టమోటాలు లభిస్తాయని కోయంబేడు హోల్‌సేల్ వెజిటబుల్ సలహాదారు చెప్పారు.
-
US Visa: స్లాట్లు ఓపెన్. కానీ ప్రయాణం సేఫ్ కాదు! -
పాకిస్థాన్ కు ఎగిరి గంతేసే వార్త.. ఒకేసారి రూ. 41,500 కోట్లు సాయం అందింది..!! -
బెంగళూరుకు వందేభారత్ స్లీపర్, రైల్వే మంత్రి ప్రకటన- రూట్, హాల్టింగ్..!! -
కలియుగ వైకుంఠంలో అద్భుతం; తిరుమల చరిత్రలో తొలిసారి.. -
మ్యాచ్ గెలిచినా.. ఆనందం లేకపాయె -
దళపతితో చేతులు కలిపిన దీదీ, ఇండియా కూటమిలో ప్రకంపనలు -
జన్మ నక్షత్రం మృగశిర, ఆరుద్ర ఉన్నవారి మే నెల జాతక ఫలం -
ఎంత సీఎం అయినా.. !! -
DA సున్నా?: ఫిట్మెంట్ ఫ్యాక్టర్ పీక్స్! శాలరీ హైక్ రిపోర్ట్ -
సీనియర్ ఎన్టీఆర్కు బాగా ఇష్టమైన చిరంజీవి సినిమా -
తెలుగు రాష్ట్రాలకు కేంద్రం భారీ వరం, ఇక కొత్త రూపు..!! -
Vaibhav Suryavanshi: వైభవ్ సూర్యవంశీ సంపాదన, ఆస్తుల విలువ ఎంతో తెలుసా..!!












Click it and Unblock the Notifications