టాటా సన్స్ చైర్మన్‌గా నటరాజన్ చంద్రశేఖరన్
టాటా సన్స్ చైర్మన్ గా నటరాజన్ చంద్రశేఖరన్ (53)ను నియమించనున్నారన్న వార్త ప్రస్తుతం ఆసక్తిని రేకెత్తిస్తోంది.
న్యూఢిల్లీ: సైరన్ మిస్త్రీని బాధ్యతల నుంచి తొలగించిన తర్వాత టాటా చైర్మన్ పదవి ఖాళీగా ఉన్న సంగతి తెలిసిందే. ఆ స్థానాన్ని నటరాజన్ చంద్రశేఖరన్ (53)తో భర్తీ చేశారు.

గతేడాది అక్టోబర్ 24న మిస్త్రీని చైర్మన్ పదవి నుంచి తొలగించిన తర్వాత చంద్రశేఖరన్ ను టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ బోర్డు డైరెక్టర్ గా నియమించారు. ప్రస్తుతం టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ సీఈఓ మేనేజింగ్ డైరెక్టర్‌గా ఆయన కొనసాగుతున్నారు.
ఇదే విషయంపై చర్చించడానికి ఈరోజు సాయంత్రం 4గం.లకు బోర్డు డైరెక్టర్స్ సమావేశం కానున్నారు. చంద్రశేఖర్‌ను టాటా సన్స్ చైర్మన్ గా నియమించనున్నారన్న ఊహాగానాలపై రేపటి లోగా స్పష్టత వచ్చే అవకాశం ఉంది.












Click it and Unblock the Notifications