Teacher: అంగన్ వాడి టీచర్ మీద పగ, తుపాకితో కాల్పులు, తప్పించుకున్న మేడమ్, ఇద్దరి ప్రాణాలు ?
అంగన్ వాడీ టీచర్ మీద చాలాకాలం నుంచి గుర్రుగా ఉన్న వ్యక్తి ఆమెను అదే రోజు చంపేయాలని అనుకున్నాడు. అంగన్ వాడి టీచర్ మీద పగ పెంచుకున్న వ్యక్తి ఆవేశంతో తుపాకి చేతిలో పట్టుకుని ఊగిపోయాడు. మేడమ్ మిస్ అయ్యింది.
బెంగళూరు/చిక్కమగళూరు: అంగన్‌వాడీ టీచర్ ప్రతిరోజు అంగన్ వాడి కేంద్రానికి వెళ్లి పిల్లలకు పాటులు చెబుతూ వారిని చక్కగా చూుకుంటున్నది, ఎప్పటిలాగే అంగన్ వాడి టీచర్ స్కూల్ దగ్గరకు బయలుదేరింది. ఆ సమయంలో అదే ప్రాంతంలో నివాసం ుంటున్న ఓ వ్యక్తి అంగన్ వాడి టీచర్ తో వాగ్వాదానికి దిగాడు. అంగన్ వాడీ టీచర్ మీద చాలాకాలం నుంచి గుర్రుగా ఉన్న వ్యక్తి ఆమెను అదే రోజు చంపేయాలని అనుకున్నాడు. అయితే అంగన్ వాడి టీచర్ మీద పగ పెంచుకున్న వ్యక్తి ఆవేశంతో ఊగిపోయాడు.

తుపాకి గురి తప్పింది
అంగన్ వాడి టీచర్ మీద డబుల్ బ్యారెల్ గన్ తో కాల్పులు జరపడానికి ప్రయత్నించడంతో అది గురి తప్పి మరో ఇద్దరి ప్రాణాలను బలితీసుకోవడం కలకలం రేపింది. తుపాకి తూటాలు గురితప్పడంతో బైక్ లో వెలుతున్న ఇద్దరు అమాయకులు స్పాట్ లో చనిపోయారు. కర్ణాటకలోని చిక్కమగళూరు తాలూకా ఖాండ్య తాలుకాలోని బిదరే గ్రామంలో ఈ సంఘటన చోటుచేసుకుంది.

ఇద్దరి ప్రాణాలు పోయాయి
బీదర్ కు చెందిన ప్రవీణ్ (33), ప్రకాష్ (30) మృతి చెందిన యువకులు. అదే గ్రామానికి చెందిన రమేష్ కాల్చి చంపినట్లు ఆరోపణలు ఉన్నాయి. అతడు మానసిక వ్యాధిగ్రస్తుడని చెబుతున్నారు. నిందితుడు రమేష్ పిల్లలను గ్రామంలోని అంగన్‌వాడీకి తీసుకెళ్తుండగా మార్గమధ్యంలో అంగన్ వాడీ టీచర్ మమతాతో గొడవ జరిగింది.

బతికిపోయిన మేడమ్
ఆ సందర్బంలో రమేష్ సహనం కోల్పోయాడు. మమతాతో గొడవ తారాస్థాయికి చేరడంతో రమేష్ సమీపంలోని అతని ఇంటికి వెళ్లి డుబల్ బ్యారెల్ గన్ తెచ్చి అంగన్ వాడీ టీచర్ మమతా మీద కాల్చేందుకు ప్రయత్నించాడు. అయితే రమేష్ లక్ష్యం తప్పడం, అంగన్ వాడీ టీచర్ మమతా తప్పించుకోవడంతో అదే మార్గంలో బైక్ లో వెళ్తున్న ప్రవీణ్, ప్రకాష్ లపై డబుల్ బ్యారెల్ గన్ తూటాలు దూసుకుపోవడంతో ఇద్దరూ అక్కడికక్కడే మృతి చెందారు.

కేసు నుంచి తప్పించాలని డ్రామాలు ?
అంగన్ వాడి టీచర్ మీద కోపంతో తుపాకితో కాల్పులు జరిపి ఇద్దరి ప్రాణాలు పోవడానికి కారణం అయిన రమేష్ ను అరెస్టు చేసి విచారణ చేస్తున్నామని పోలీసులు తెలిపారు. అయితే అరెస్టు అయిన రమేష్ చాలాకాలంగా మానసిక అస్వస్థతతో బాధపడుతున్నాడని అతని కుటుంబ సభ్యులు అంటున్నారు. జంట హత్యల కేసు నుంచి రమేష్ ను తప్పించడానికి అతని కుటుంబ సభ్యులు నాటకాలు ఆడుతున్నారని స్తానికులు ఆరోపిస్తున్నారని, కేసు విచారణలో ఉందని పోలీసులు అంటున్నారు.
-
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
ఎన్టీఆర్ పాటకు స్టెప్పులేసిన సితార.. వైరల్ వీడియో -
నక్కతోక తొక్కిన "అస్సాం బ్యూటీ".. నందమూరి హీరోతో స్టెప్పులేసే ఛాన్స్ !! -
ఏపీలో స్థానిక సంస్థల పునర్విభజన- మారిపోతున్న ముఖచిత్రాలు -
PNGకి మారకపోతే LPG సిలెండర్ కట్..! కేంద్రం డెడ్ లైన్..! -
చమురు, గ్యాస్ పరిస్ధితి ఇదీ- అఖిలపక్ష భేటీలో తేల్చేసిన కేంద్రం..! -
నన్ను ఆ డైరెక్టర్ ఎక్కడెక్కడో పట్టుకున్నాడు.. కానీ అమ్మానాన్న సర్దుకుపోమన్నారు !! -
Iran: ట్రంప్ కు ఇరాన్ దిమ్మతిరిగే షాక్..! సీజ్ ఫైర్ కు కఠిన షరతులివే..! -
ఇంధన కొరత వేళ.. తెలంగాణ ఆర్టీసీ సంచలన నిర్ణయం -
‘దీదీ’ రాజీనామా.. ఎన్నికల వేళ మమత సంచలన నిర్ణయం! -
ఏపీలో తెలంగాణ సీఎం.. లోకేష్ బంపర్ ఆఫర్ -
అంతా అయిపోయింది- డొనాల్డ్ ట్రంప్












Click it and Unblock the Notifications