Lady teacher: ట్యూషన్ కు వెళ్లిన అమ్మాయి, మేడమ్ షాపింగ్ కు, మసాజ్ అంటూ రేప్ చేసి !
అహమ్మదాబాద్/ గుజరాత్: లేడీ ట్యూషన్ టీచర్ భర్త కామాంధుడు అని తెలీకపోవడంతో చుట్టుపక్కల నివాసం ఉంటున్న వాళ్లు వారి పిల్లలను ఆ ఇంటికి ట్యూషన్ కు పంపిస్తున్నారు. మేడమ్, ఆంటీ, అంకుల్ అంటూ అమ్మాయిలు, అబ్బాయిలు ఆ ఇంటికి ట్యూషన్ కు వెళ్లి చదువుకుంటున్నారు. ఇదే సమయంలో ట్యూషన్ కు వస్తున్న అమ్మాయిల మీద లేడీ టీచర్ మొగుడి కన్నుపడింది. ట్యూషన్ చెప్పే భార్య బయట షాపింగ్ కు వెళ్లిన తరువాత ఎవరైనా అమ్మాయిలు ఇంటికి వస్తే మేడమ్ ఇప్పుడే వస్తుంది కుర్చోండి అంటూ వారిని దగ్గర కుర్చోబెట్టుకుంటున్న కామాంధుడు వారిని లైంగిక వేధింపులకు గురి చేశాడు. భార్య లేని సమయంలో 15 ఏళ్ల అమ్మాయి మీద పదేపదే అత్యాచారం చేసిన కామాంధుడిని పోలీసులు అరెస్టు చేసి బెండ్ తీస్తున్నారు.

లేడీ ట్యూషన్ టీచర్
గుజరాత్ లోని అహమ్మదాబాద్ లో నివాసం ఉంటున్న 41 ఏళ్ల వ్యక్తి భార్య ట్యూషన్ టీచర్ గా పని చేస్తోంది. లేడీ టీచర్ దగ్గర చదువుకుంటున్న పిల్లలు మంచి మార్కులు తెచ్చుకోవడంతో చుట్టుపక్కల నివాసం ఉంటున్న వాళ్ల కూడా వారి పిల్లలను ఆమె దగ్గర ట్యూషన్ కు పంపిస్తున్నారు. మా పిల్లలు ఆమె దగ్గర బాగా చదువుకుంటున్నారని ఇంతకాలం చుట్టుపక్కల వాళ్లు చాలా సంతోషంగా ఉంటున్నారు.

15 ఏళ్ల అమ్మాయి మీద కామాంధుడి కన్ను
లేడీ టీచర్ దగ్గర అదే ప్రాంతంలో నివాసం ఉంటున్న 9వ తరగతి అమ్మాయి ట్యూషన్ కు వెలుతోంది. ఓ సారి ఆ అమ్మాయి ట్యూషన్ టీచర్ ఇంటికి వెళ్లింది. ఆ సమయంలో ట్యూషన్ టీచర్ పని మీద బయటకు వెళ్లడంతో ఆమె భర్త మాత్రమే ఇంట్లో ఉన్నాడు. మీ మేడమ్ పని మీద బయటకు వెళ్లిందని, షాపింగ్ పూర్తి చేసుకుని త్వరగా ఇంటికి వచ్చేస్తుందని, నువ్వు ఇక్కడే ఉండాలని లేడీ టీచర్ భర్త ఆ అమ్మాయికి మాయమాటలు చెప్పాడు.

బెదిరించి రేప్ చేశాడు
తన భార్య (ట్యూషన్ టీచర్) అంత త్వరగా ఇంటికి రాదని ముందుగానే తెలుసుకున్న కామాంధుడు ఇంట్లో ఉన్న 15 ఏళ్ల అమ్మాయిని బెదిరించి ఆమె మీద అత్యాచారం చేశాడు. నాలుగు గొడల మధ్య ఈ విషయం జరిగిపోయిందని, ఈ విషయం నువ్వు ఎవ్వరితో చెప్పకూడదని, నేను రహస్యంగా దాచిపెడుతానని, విషయం బయటకు తెలిస్తే నీకే మంచిది కాదని ఆ కామాంధుడు అమ్మాయిని బెదిరించాడు. తరువాత ఆ అమ్మాయిని బెదిరించి అత్యాచారం చేశాడని ఆరోపణలు ఉన్నాయి.

అమ్మాయికి కడుపు నొప్పి రావడంతో డౌట్
అమ్మాయి అనారోగ్యానికి గురి కావడం, పదేపదే కడుపునొప్పి ఎక్కువ కావడంతో ఆమె తల్లికి అనుమానం వచ్చింది. అమ్మాయి గర్బవతి అయ్యే చాన్స్ ఉందని అనుమానం రావడంతో ఆమెను తల్లి ఆసుపత్రికి పిలుచుకుని వెళ్లింది. ఇదే సమయంలో వైద్యులు కొన్ని మందులు వాడాలని బాధితురాలి తల్లికి సూచించారు.
Recommended Video

ఏప్పుడో జరిగితే ఇప్పుడు కేసు, ఏం జరిగింది ?
ఆసుపత్రికి వెళ్లే ముందే 2019లో తన మీద అత్యాచారం జరిగిందని ఆ అమ్మాయి తల్లికి చెప్పింది. నువ్వు ఇక ముందు ట్యూషన్ కు వెళ్లకూడదని, మీ మేడమ్ భర్తతో ఇక ముందు నువ్వు మాట్లాడకూడదని తల్లిదండ్రులు అమ్మాయికి అప్పుడే చెప్పారని తెలిసింది. ఇంతకాలం పరువు పోతుందని అమ్మాయి కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చెయ్యలేదు. అమ్మాయి అనారోగ్యానికి గురి కావడంతో రెండు సంవత్సరాల తరువాత కేసు పెట్టారని, ఫోక్సో చట్టం కింద కేసు నమోదు చేసి లేడీ ట్యూషన్ టీచర్ భర్తను అరెస్టు చేసి విచారణ చేస్తున్నామని అహమ్మదాబాద్ పోలీసు అధికారులు అంటున్నారు.
-
ఇకపై నెలకు రెండు సిలిండర్లే..కొత్త బుకింగ్ రూల్స్ -
ఏప్రిల్ ఒకటి నుంచి చికెన్ షాపులు బంద్ !! -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
ఎన్టీఆర్ పాటకు స్టెప్పులేసిన సితార.. వైరల్ వీడియో -
నక్కతోక తొక్కిన "అస్సాం బ్యూటీ".. నందమూరి హీరోతో స్టెప్పులేసే ఛాన్స్ !! -
ఏపీలో స్థానిక సంస్థల పునర్విభజన- మారిపోతున్న ముఖచిత్రాలు -
PNGకి మారకపోతే LPG సిలెండర్ కట్..! కేంద్రం డెడ్ లైన్..! -
చమురు, గ్యాస్ పరిస్ధితి ఇదీ- అఖిలపక్ష భేటీలో తేల్చేసిన కేంద్రం..! -
నన్ను ఆ డైరెక్టర్ ఎక్కడెక్కడో పట్టుకున్నాడు.. కానీ అమ్మానాన్న సర్దుకుపోమన్నారు !! -
Iran: ట్రంప్ కు ఇరాన్ దిమ్మతిరిగే షాక్..! సీజ్ ఫైర్ కు కఠిన షరతులివే..! -
ఇంధన కొరత వేళ.. తెలంగాణ ఆర్టీసీ సంచలన నిర్ణయం -
‘దీదీ’ రాజీనామా.. ఎన్నికల వేళ మమత సంచలన నిర్ణయం!












Click it and Unblock the Notifications