స్కూల్ యూనిఫాం డబ్బులు ఇవ్వలేదని అమ్మాయిల బట్టలు తీయించి, చివరికి దారుణంగా!

బీహార్: స్కూల్ యూనిఫాంకు డబ్బులు చెల్లించలేదని విద్యార్థునులను అర్ధనగ్నంగా తయారు చేసిన ఘటన బీహార్ లో జరిగింది. నాలుగు రోజులు సమయం ఇస్తే స్కూల్ యూనిఫాం డబ్బలు ఇస్తామని కుటుంబ సభ్యులు చెప్పినా టీచర్, స్కూల్ యాజమాన్యం తమ పైత్యం చూపించారు.

బీహార్ లోని కోరియా పంచాయితీ పరిధిలోని సిక్రూలా లో బీఆర్ విద్యాసంస్థ ఉంది. ఈ విద్యాసంస్థలో పరిసర ప్రాంతాలకు చెందిన అనేక మంది విద్యార్థులు విద్యాభ్యాసం చేస్తున్నారు. ఇటీవల స్కూల్ లో విధ్యాసంవత్సరం మళ్లీ ప్రారంభం అయ్యింది.

Teacher takes of uniform of sisters for not paying fees in Bihar

ఈ విధ్యాసంస్థలొ చదువుతున్న అందరూ విద్యార్థులు స్కూలుకెళ్లారు. కొంత మంది విద్యార్థులు స్కూల్ లో యూనీఫాంకు డబ్బులు చెల్లించలేదు. స్కూల్ ప్రారంభం అయినా మీరు ఎందుకు యూనిఫాంకు డబ్బులు ఇవ్వలేదని స్కూల్ టీచర్లు ప్రశ్నించారు.

యూనిఫాం డబ్బులు చెల్లించడానికి కొంత సమయం కావాలని ఇద్దరు విద్యార్థునిల ( అక్కా, చెల్లి) కుటుంబ సభ్యులు మనవి చేశారు. అయితే ఓ టీచర్ దారుణంగా ప్రవర్తించారు. యూనీఫాం డబ్బులు చెల్లించకుంటే పిల్లలను ఇలాగే స్కూల్ కు పంపించాలని చెప్పి అర్థనగ్నంగా తయారు చేసి బయటకు పంపిచారు.

తల్లిదండ్రులు వేడుకుంటున్నా ఆ టీచర్ కనికరించకపోవడంతో వారి కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసిన పోలీసులు స్కూల్ ప్రిన్సిపల్, టీచర్ ను అరెస్టు చేశారు. ఈా విషంపై ఉన్నతస్థాయి దర్యాప్తు జరిపించాలని బీహార్ విద్యాశాఖ మంత్రి అశోక్ చౌదరీ ఆదేశాలు జారీ చేశారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+