Techie: మైండ్ బ్లాక్, 15 రోజుల్లో రెండో పెళ్లి చేసుకున్న టెక్కీ భార్య, ఏం జరిగింది స్వామి ?
చెన్నై/తేన్ కాశి: యువతి, యువకుడి పరిచయం ప్రేమగా మారింది. పెళ్లి చేసుకుని జీవితాంతం సుఖంగా ఉండాలని ప్రేమికులు అనుకున్నారు. పెళ్లి చేసుకుందామని అనుకున్న ప్రేమికులు పెళ్లికి ముందే హ్యాపీగా విహారయాత్రలు తిరుగుతూ ఎంజాయ్ చేశారు. ప్రేమికుల విషయం చాలాకాలం పాటు సీక్రేట్ గా ఉన్నా తరువాత మ్యాటర్ లీక్ అయ్యింది. టెక్కీ ప్రియుడిని పెళ్లి చేసుకున్న ప్రియురాలు కొన్ని రోజుల్లోనే మరో యువకుడిని పెళ్లి చేసుకున్న వీడియో బయటకు రావడం కలకలం రేపింది.

టెక్కీ లవ్ స్టోరీ
తమిళనాడులోని తేన్ కాశి జిల్లా కొట్టాకుళం ప్రాంతానికి చెందిన మరియప్పన్ తేన్ కాశీలో వ్యవసాయం చేస్తున్నాడు. మరియప్పన్ కుమారుడు వినీత్ విదేశాల్లో చెన్నైసాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌గా పనిచేశాడు. ప్రస్తుతం వినీత్ చెన్నైలోని ప్రముఖ కంపెనీలో టెక్కీగా ఉద్యోగం చేస్తున్నాడు. వినీత్, గుజరాత్ కు చెందిన కృతిక పటేల్ అనే అమ్మాయి ప్రేమించుకుంటున్నారు.

రెండు ఫ్యామిలీల్లో నో చెప్పారు
కృతిక పటేల్, వినీత్ ప్రేమకు ఇంట్లో వారిద్దరూ అభ్యంతరం వ్యక్తం చేయడంతో గత ఏడాది డిసెంబర్ 27న ఇరు వైపుల తల్లిదండ్రుల వ్యతిరేకతను సైతం లెక్కచేయకుండా నాగర్‌కోయిల్ లో కృతిక పటేల్, వినీత్ రిజిస్టర్ మ్యారేజ్ చేసుకున్నారు. కృతిక పటేల్, వినీత్ ఇద్దరూ తమ కొత్త జీవితాలను కొనసాగిసాగించారు. వారం రోజుల పాటు కొత్త దంపతులు కృతిక పటేల్, వినీత్ హ్యాపీగా ఉన్నారు

కొత్త పెళ్లికూతురు కిడ్నాప్
వారం రోజుల క్రితం కృతిక పటేల్ భర్త వినీత్‌పై దాడి చేసి కృతికను బలవంతంగా ఎత్తుకెళ్లిన వీడియో సోషల్ మీడియాలో విడుదల కావడంతో అందరూ షాక్ అయ్యారు. ఈ కేసుకు సంబంధిత ఫిర్యాదులో కృతిక తల్లిదండ్రులతో సహా నలుగురిని అరెస్టు చేసి జైలులో పెట్టారు. భార్యను నేను సొంతం చేసుకోవాలని టెక్కీ వినీత్ అనేక ప్రయత్నాలు చేశాడు.

భార్యకు రెండో పెళ్లి వీడియో చూసి షాక్
ఈ నేపధ్యంలో వినీత్ తలపై పిడుగు పడినట్లు అయ్యింది. వినీత్ భార్య కృతిక పటేల్ మరొకరిని పెళ్లి చేసుకున్న వీడియో ఒకటి విడుదలైంది. అలాగే మైత్రిక్ పటేల్‌తో తన పెళ్లి జరిగిపోయిందని, తాను చాలా క్షేమంగా, సంతోషంగా ఉన్నానని, తనను ఎవరూ డిస్టర్బ్ చేయవద్దని కృతిక పటేల్ ఓ వీడియోను విడుదల చెయ్యడంతో ఆమె టెక్కీ మొగుడు వినీత్ హడలిపోయాడు.

కేసు పెట్టిన భర్త
తన భార్య వేరొకరితో పెళ్లి చేసుకుందని తెలుసుకున్న వినీత్ షాక్ అయ్యాడు. తన భార్య ఆమె పూర్తి అంగీకారంతో తనను వివాహం చేసుకుందని, ఆమె తల్లిదండ్రులు మరో పెళ్లి చేసుకోవాలని బెదిరించి కృతికతో నకిలీ వీడియోను రికార్డ్ చేశారని వినీత్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. అలాగే తన భార్య పోస్ట్ చేసిన వీడియో నకిలీది అని, ఆహె మీద నాకు చాలా నమ్మకం ఉందని, తన భార్యను తనకు అప్పగించాలని టెక్కీ వినీత్ పోలీసులకు మనవి చేశాడు. పోలీసులు కేసు విచారణ చేస్తున్నారు.
-
మూడు పండుగలకు రెగ్యులర్ గా మూడు ఉచిత సిలిండర్ల పంపిణీ + రూ.2,000 -
Tamil Nadu Polls: సర్వేల షాక్ తో విజయ్ బిగ్ టర్న్..! తుది దశలో తాజా ప్లాన్..! -
ఎన్నికల వేళ విజయ్ సమర్థతను తేల్చేసిన పవన్..!! -
ఇలా చేస్తే అమరావతి గొడవ క్లోజ్..! మావిగన్ వేళ చంద్రబాబుకు సాయిరెడ్డి ఐడియా..! -
Amaravati: సాయిరెడ్డి సలహాపై స్పందించిన టీడీపీ..! బహిరంగ లేఖ..! -
ఆర్టీసీ బస్సు ఛార్జీల్లో మార్పులు, కొత్త రేట్లు ఇలా..!! -
అలిపిరి నుంచిప్రత్యేకంగా 11 లేన్ల రహదారి- టోల్ గేట్ సమూల పునరుద్ధరణ? -
పసిడికి భారీ డిమాండ్: కుప్పలు తెప్పలుగా -
రైతులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్, పథకాలు ఇక నుంచి..!! -
సమ్మర్ లో ఈ హిల్ స్టేషన్ కు వెళ్తే.. మళ్లీ తిరిగి రావాలనిపించదు..! -
US Blockade: అమెరికాకు బిగ్ షాక్..! తేలిపోయిన హార్ముజ్ దిగ్బంధం..! -
జగన్, షర్మిల సహా వారికి చంద్రబాబు లేఖ - కీలక విజ్ఞప్తి..!!












Click it and Unblock the Notifications