5000mAh బ్యాటరీ, 64MP కెమెరాతో క్యామాన్ కొత్త ఫోన్లు
టెక్నో మొబైల్స్ క్యామాన్ సిరీస్ (Tecno Camon Series)లో మరో మూడు కొత్త ఫోన్లు వచ్చాయి. టెక్నో క్యామాన్ 20 (Tecno Camon 20), క్యామాన్ 20 ప్రో 5జీ (Camon 20 Pro 5G), క్యామాన్ 20 ప్రీమియర్ 5జీ (Camon 20 Premier 5G) పేరుతో వస్తున్న ఈ ఫోన్లలో మీడియా టెక్ ప్రాసెసర్ ఉంది. అలాగే అమోలెడ్ స్క్రీన్ అమర్చారు.
టెక్నో క్యామాన్ 20, 20 ప్రో 5జీ ధర: ఇండియాలో టెక్నో క్యామాన్ 20 ధర రూ.14,999. 8GB ర్యామ్ + 256GB స్టోరేజ్ వేరియంట్ అందుబాటులో ఉంది. నేటినుంచే అమ్మకాలు ప్రారంభమయ్యాయి. సెరినిటీ బ్లూ, ప్రీడాన్ బ్లాక్, గ్లేషియర్ గ్లో రంగుల్లో లభిస్తోంది. టెక్నో క్యామాన్ 20 ప్రో 5జీలో రెండు వేరియంట్లు ఉన్నాయి.

8GB + 128GB ధర రూ.19,999 కాగా 8GB + 256GB ధర రూ.21,999. జూన్ రెండో వారం నుంచి ఇవి విక్రయానికి రానున్నాయి. 20 ప్రీమియర్ ఫోన్ జూన్ చివరికి అందుబాటులోకి వస్తుందని కంపెనీ తెలిపింది. ఇతర వివరాలేవీ వెల్లడించలేదు.
టెక్నో క్యామాన్ 20, 20 ప్రో 5జీ స్పెసిఫికేషన్లు: ఈ రెండు ఫోన్ల ఫీచర్లు దాదాపు ఒకేరకంగా ఉన్నాయి. రెండింటిలోనూ 6.67 అంగుళాల హెచ్‌డీ+ అమోలెడ్ స్క్రీన్ అమర్చారు. అయితే, ప్రో మోడల్‌లో రీఫ్రెష్ రేట్ 120Hzగా ఇస్తున్నారు. ఆండ్రాయిడ్ ఆధారిత HiOS 13.0 out of the box ఓఎస్‌తో వస్తున్నాయి.
20లో 12nm మీడియా టెక్ హీలియో జీ85 ప్రాసెసర్‌ను, ప్రో మోడల్ 6nm మీడియాటెక్ డైమెన్సిటీ 8050 ప్రాసెసర్‌ను కలిగివున్నాయి. 64ఎంపీ ప్రైమరీ కెమెరా, సెల్ఫీల కోసం 32 ఎంపీ కెమెరా ఏర్పాటు చేశారు. 4జీ, వైఫై, బ్లూటూత్ 5, జీపీఎస్, యూఎస్‌బీ టైప్-సి పోర్ట్ ఉన్నాయి. క్యామాన్ 20 ప్రో 5జీని సపోర్ట్ చేస్తుంది. రెండు ఫోన్లలోనూ 5,000mAh బ్యాటరీలను అమర్చారు. క్యామాన్ 20ని 18వాట్ చార్జర్‌తో ఇస్తున్నారు.












Click it and Unblock the Notifications