తెహెల్కా కేసు: తరుణ్ తేజ్‌పాల్‌పై రేప్ అభియోగం
పానాజీ: మహిళా ఉద్యోగినిపై అత్యాచారం చేశాడని తెహెల్కా మాజీ చీఫ్ తరుణ్ తేజ్‌పాల్‌పై గోవా పోలీసులు అభియోగం మోపారు. సోమవారం ఈ మేరకు వారు చార్జిషీట్ దాఖలు చేశారు. ఆయనపై నిరుడు నవంబర్ 22వ తేదీన ఎఫ్ఐఆర్ నమోదైంది.
గోవాలోని హోటల్ లిఫ్ట్‌లో మహిళా ఉద్యోగిపై తరుణ్ తేజ్‌పాల్ అత్యాచారానికి పాల్పడినట్లు ఆరోపణలు వచ్చాయి. 2013 నవంబర్‌లో తెహెల్కా థింక్ ఫెస్ట్ కార్యక్రమం సందర్భంగా ఈ సంఘటన చోటు చేసుకుంది.

తేజ్‌పాల్‌పై దాఖలు చేసిన చార్జిషీట్ 2,846 పేజీలు ఉంది. అందులో 132 పేజీలు ప్రధాన చార్జిషీట్ కాగా, 30 పేజీలు సాక్షులకు సంబంధించినవి. అనుబంధాలతో కలిపి మొత్తం 2,846 పేజీల చార్జిషీట్‌ను పోలీసులు దాఖలు చేశారు.
పోలీసులు 152 మంది సాక్షు వాంగ్మూలాలను నమోదు చేశారు. వారిలో దర్యాప్తు అధికారి సునీత సావంత్ వాంగ్మూలం కూడా ఉంది. బాధితురాలు అత్యాచారానికి, లైంగిక వేధింపులకు గురైందని, హోటల్‌లోని లిఫ్ట్‌లో ఆమె గౌరవానికి భంగం వాటిల్లిందని నిరూపించడానికి తమ వద్ద తగిన ఆధారాలున్నాయని పోలీసులు చార్జిషీట్‌లో తెలిపారు.
-
భారత్ కు పాక్ వార్నింగ్: ఇళ్లల్లోకి చొరబడి చంపుతాం.. -
పదో తరగతి పరీక్షల్లో పొరపాట్లు, ఆ రెండు సబ్జెక్టుల్లో మార్కుల యాడింగ్..ఇలా..!! -
కేంద్రం బ్రహ్మాస్త్రం: రూ. 2.5 లక్షల కోట్ల భారీ పథకం -
అల్లు అర్జున్-అట్లీ మూవీ టైటిల్ లీక్?.. నెట్టింట రచ్చ! -
చుక్కలు చూపుతున్న పసిడి రేట్లు -
ఎవరైనా ఇలా చేస్తే అమరావతి చట్టబద్ధత రద్దవుతుంది: బాంబు పేల్చిన సాయిరెడ్డి -
ఇరాన్ కు సపోర్ట్ చేస్తావా..? పాకిస్థాన్ ను కోలుకోలేని దెబ్బ కొట్టిన యూఏఈ.. -
తిరుమల, అలిపిరిల్లో చిరుతలను గుర్తించడానికి టీటీడీ కొత్త టెక్నాలజీ -
No Stock: ధర చూస్తే గుండె గుభేల్! డ్రైవర్ల కన్నీటి గాథ! -
గ్యాస్ కష్టాలకు చెక్, ఇలా చేస్తే వెంటనే మీ ముందుకే సిలిండర్..!! -
అయ్యో.. విజయ్ ఎలక్షన్ ర్యాలీలో అపశ్రుతి.. -
అమరావతితో కూడిన ఏపీ కొత్త మ్యాప్ వచ్చేసింది.. తేడాలు సుస్పష్టం !!












Click it and Unblock the Notifications