ప్రకటనకు ప్రధాని రెడీ: టీ బిల్లు ఆమోదం లాంఛనమే

న్యూఢిల్లీ: సవరణలు ప్రతిపాదిస్తామంటూ బుధవారం మెలిక పెట్టిన బిజెపి తెలంగాణ బిల్లును రాజ్యసభలో ఆమోదించడానికి సిద్ధపడినట్లు తెలుస్తోంది. సీమాంధ్రకు పది వేల కోట్ల రూపాయల ప్యాకేజీని బడ్జెట్‌లో పెట్టాలంటూ, మరిన్ని సవరణలను బిల్లుకు తేవాలంటూ బిజెపి నేతలు అరుణ్ జైట్లీ, ఎం వెంకయ్య నాయుడు బుధవారం పట్టుబట్టారు. దీంతో రాజ్యసభలో బుధవారంనాడు ప్రభుత్వం బిల్లును ప్రతిపాదించలేదు.

బిల్లుకు రాజ్యసభలో ఆమోదం తెలిపే విషయంపై బిజెపి గురువారంనాడు వెనక్కి తగ్గినట్లు తెలుస్తోంది. సవరణలను ప్రతిపాదించకుండానే ఆమోదం తెలిపేందుకు సిద్ధపడినట్లు గురువారం ఉదయం వార్తలు వచ్చాయి. సీమాంధ్రకు ప్రత్యేక ప్యాకేజీపై ప్రధాని డాక్టర్ మన్మోహన్ సింగ్ ప్రకటన చేయనున్నట్లు తెలుస్తోంది. ప్రధాని ప్రకటన చేయడానికి అంగీకరించడంతో బిల్లుకు ఆమోదం తెలపడానికి బిజెపి సిద్ధపడినట్లు వార్తలు వస్తున్నాయి.

Rajyasabha

సీమాంధ్రకు ప్రత్యేక ప్రతిపత్తి కల్పించాలంటూ కాంగ్రెసు అధ్యక్షురాలు సోనియా గాంధీ ప్రధాని మన్మోహన్ సింగ్‌ను కోరారు. ఐదేళ్ల పాటు ఈ ప్రత్యేక హోదా కొనసాగడం వల్ల సీమాంధ్రకు పెద్ద యెత్తున నిధులు అందుతాయి. ప్రత్యేక ప్రతిపత్తి కల్పనకు ప్రభుత్వం ముందుకు రావడంతో బిజెపి బిల్లును ఆమోదించడానికి అంగీకరించినట్లు తెలుస్తోంది.

కాగా, గురువారం ఉదయం కేంద్ర మంత్రివర్గం సమావేశమైంది. రాజ్యసభలో తెలంగాణ బిల్లును ఆమోదింపజేసుకునే విషయంపై, ముఖ్యమంత్రి పదవికి కిరణ్ కుమార్ రెడ్డి రాజీనామా వల్ల రాష్ట్రంలో తలెత్తిన పరిస్థితిపై కేంద్ర మంత్రి వర్గం చర్చించారు.

బిల్లుపైనే చర్చ..

తెలంగాణ బిల్లును రాజ్యసభలో ప్రవేశపెట్టడం మీదనే మంత్రి వర్గ సమావేశంలో చర్చించినట్లు పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కమల్ నాథ్ మీడియా ప్రతినిధులతో చెప్పారు. కిరణ్ కుమార్ రెడ్డి రాజీనామా వల్ల తలెత్తిన పరిణామాలపై, తీసుకోవాల్సిన చర్యలపై గురువారం సాయంత్రం మంత్రి వర్గం సమావేశమయ్యే అవకాశం ఉంది. గవర్నర్ నుంచి నివేదిక అందకపోవడంతో ఆ అంశాన్ని పక్కన పెట్టినట్లు తెలుస్తోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+