నిరుద్యోగులకు శుభవార్త: ఈ ఏడాది 20 లక్షల ఉద్యోగాలు!
నిరుద్యోగులకు శుభవార్త. లక్షలాది ఉద్యోగాలు రాబోతున్నాయి. టెలికాం రంగం ఈ ఏడాది 20 లక్షల ఉద్యోగాలను సృష్టిస్తోంది.
న్యూఢిల్లీ: నిరుద్యోగులకు శుభవార్త. లక్షలాది ఉద్యోగాలు రాబోతున్నాయి. టెలికాం రంగం ఈ ఏడాది 20 లక్షల ఉద్యోగాలను సృష్టిస్తోంది. కొత్త సర్వీస్ ప్రొవైడర్లు రావడం, డేటా విస్తరించడం వల్ల కొత్త ఉద్యోగావకాశాలు రానున్నాయి.
మేక్ ఇన్ ఇండియా, మొబైల్ ఎకానమీ వంటి కార్యక్రమాలు కూడా ఈ రంగంలో కొత్త ఊపు రావడానికి దోహదపడుతున్నాయి. టెలికాం సెక్టర్ స్కిల్ కౌన్సిల్, టీమ్ లీజ్ సంయుక్తంగా రూపొందించిన నివేదిక ఈ వివరాలను వెల్లడించింది.
2017 సంవత్సరంలో టెలికాం రంగంలో రెండు మిలియన్ల కొత్త ఉద్యోగాలు రానున్నాయని టెలికాం రంగ స్కిల్ కౌన్సిల్‌తో కలిసి టీమ్ లీజ్ నిర్వహించిన అధ్యయనంలో తేలింది.

కొత్త ఉద్యోగాలు ఊపందుకోనున్నాయని, మొబైల్ హ్యాండ్‌సెట్‌లను తయారు చేసేవారు (1.76మిలియన్లు), అందుకు అనుగుణంగా సేవలను అందించేందుకు సర్వీస్ ప్రొవైడర్లు (0.37మిలియన్లు) కావాల్సి ఉంటుందని పేర్కొంది.
ఇక 5జీ టెక్నాలజీ అందుబాటులోకి రానున్న నేపథ్యంలో భవిష్యత్తులో మౌలికరంగంలో కూడా అవకాశాలు వస్తాయని వెల్లడైంది. 2020-21 నాటికి మౌలికరంగంలో 0.92 మిలియన్ల ఉద్యోగాలు అవసరమవుతాయని, మొత్తంగా చూస్తే ఈ రంగంలో వర్కర్ల సంఖ్య 2021 నాటికి 8.7 మిలియన్లకు చేరనుందని పేర్కొంది.
తక్కువ ధరలకు మొబైల్ హ్యాండ్‌సెట్‌లను అందించే లక్ష్యంతో తయారీదారులు దీనిపై దృష్టి సారిస్తారని, ఇందుకు సర్వీస్ ప్రొవైడర్లు మెరుగైన నెట్‌వర్క్ అందించాల్సి ఉంటుందని, మరోపక్క పెద్ద నోట్ల రద్దు డిజిటల్ వ్యాలెట్లకు మరింత ఊతమిస్తోందని, దీంతో నూతన అవకాశాలకు బాటలు పడనున్నాయని టీమ్ లీజ్ సర్వీసెస్ సీనియర్ ఉపాధ్యక్షులు నీతి శర్మ తెలిపారు.
అయితే ఈ రంగంలో నిపుణుల కొరత వేధించే అవకాశముందని కూడా ఈ నివేదిక తెలిపారు. ఇంటర్నెట్ టెక్నాలజీ, మొబిలిటీ సొల్యూషన్స్, టెలికాం ఇన్‌ఫ్రాస్ట్రక్చర్, నెట్‌వర్క్ ఆర్కిటెక్చర్, సేల్స్, తదితర విభాగాల్లో నిపుణుల అవసరం పెరగబోతోంది.
నెట్‌వర్క్ ఇంజినీర్లు, ఇన్‌ఫ్రా, సైబర్ సెక్యూరిటీ ప్రొఫెషనల్స్, అప్లికేషన్ డెవలపర్స్, సిస్టమ్ ఇంజినీర్లు, ఐ-డాస్ ఇంజినీర్లు, ఇన్‌షాప్ సేల్స్ ఎగ్జిక్యూటివ్‌లు, హ్యాండ్‌సెట్ మాన్యుఫ్యాక్చరింగ్ టెక్నీషియన్లు, కాల్ సెంటర్ ఎగ్జిక్యూటివ్‌లు, బ్యాక్ ఆఫీస్, అడ్మినిస్ట్రేషన్, రిపేర్ ఎగ్జిక్యూటివ్‌లు, తదితర విభాగాల్లో 2017లోనే మంచి ఉద్యోగావకాశాలు అందుబాటులోకి వస్తాయని ఈ నివేదిక వివరించింది.
-
పెళ్లికి రెడీ అయిన యంగ్ కపుల్.. -
తమిళనాడు, బెంగాల్, అసోం, కేరళలో గెలిచేది వీళ్లే? ఆత్మసాక్షి సర్వేలో..! -
లబ్దిదారులకు రెండు ఉచిత వంటగ్యాస్ సిలిండర్లు, రూ. 2,500 రీఛార్జ్ రేషన్ కార్డ్ -
బంగారం ధరల్లో వరస్ట్ డౌన్ ఫాల్- 2008 తర్వాత -
40 దేశాల్లో.. అండర్ వరల్డ్ డాన్‌గా జూనియర్ ఎన్టీఆర్ విశ్వరూపం -
కోట్లకు పడగెత్తిన విజయ్ రైట్ హ్యాండ్ -
సిమెంట్- స్టీల్ ధరలు భారీగా పెంపు, ఇక నుంచి..!? -
ఏపీ ప్రభుత్వం మరో ఎన్నికల హామీ అమలు, రేపే ప్రారంభం..!! -
తిరుపతిలో ఎయిర్ పోర్టును తలదన్నేలా..!! -
ఏపీ ప్రజలకు డిసెంబర్ లోగా మరో బహుమానం.. ఫిక్స్ చేసిన సీఎం చంద్రబాబు -
బిగ్ షాక్: ఏప్రిల్ 1 నుంచి పెరగనున్న పెట్రోల్, డీజిల్ ధరలు.. -
రాహుల్ గాంధీతో డేటింగ్ కోరిక తీరలేదు - బాలీవుడ్ స్టార్












Click it and Unblock the Notifications