'కాంతార' వరాహరూపం పాటపై తాత్కాలిక నిషేధం; కేరళ హైకోర్టు షాక్!!
వరాహ రూపం సాంగ్ తో అందరి మనసులను ఆకట్టుకున్న కన్నడ హీరో రిషబ్ శెట్టి దర్శకుడుగా తెరకెక్కించిన కాంతార చిత్ర బృందానికి కేరళ హైకోర్టు షాక్ ఇచ్చింది.
కన్నడ యాక్షన్ థ్రిల్లర్ కాంతార సినిమాలోని వివాదాస్పదమైన వరాహ రూపం పాటను థియేటర్లలో ఓటిటీ మరియు డిజిటల్ స్ట్రీమింగ్ ప్లాట్ఫామ్ లలో ఉపయోగించటాన్ని నిషేధిస్తూ కేరళ హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. కాంతార సినిమా విడుదలై ప్రేక్షకాదరణ పొందిన ఇంతకాలం తర్వాత కేరళ హైకోర్టు కాంతార చిత్ర బృందానికి షాక్ ఇచ్చింది.

ఈ పాట విషయంలో చిత్ర బృందం కాపీరైట్ చట్టాన్ని ప్రాథమికంగా ఉల్లంఘించిందని కోర్టు పేర్కొంది. వరాహ రూపం పాట బాణీని తాము రూపొందించిన పాట నుండి కాపీ కొట్టారంటూ కేరళకు చెందిన తైకుడం బ్రిడ్జ్ అనే మ్యూజిక్ బ్యాండ్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. ఇక దీనిపై విచారణ చేపట్టిన హైకోర్టులో వారు రూపొందించిన నవరసం ట్రాక్ ను కాపీ కొట్టి వరాహ రూపం రూపొందించారని కోర్టు దృష్టికి తీసుకువెళ్లారు. అందుకు సంబంధించిన ఆధారాలను కూడా ఇచ్చారు.
దీంతో కాంతార సినిమా యూనిట్ కాపీరైట్ చట్టాన్ని ఉల్లంఘించిందని హైకోర్టు అభిప్రాయపడింది. కాపీరైట్ చట్టం 1957 నుండి సెక్షన్ 64 ప్రకారం కాపీరైట్ చేసిన పాటకు సంబంధించిన డేటాను స్వాధీనం చేసుకోవాలని పోలీసులను ఆదేశించింది. కాంతార చిత్రంలో ప్రేక్షకుల హృదయాలను కట్టిపడేసిన పాట వరాహ రూపం. ఇక ఈ పాటను సినిమాలోనూ, డిజిటల్ స్ట్రీమింగ్ ప్లాట్ ఫాం లలోనూ ప్రదర్శించకూడదని కేరళ హైకోర్టు నిషేధం విధించడంతో, ఇది చిత్ర యూనిట్ కు నిజంగా షాక్ అని చెప్పాలి.












Click it and Unblock the Notifications