పది పెళ్లిళ్లు ఆపిన ఒక్క ఫోన్‌కాల్‌!

ఒక్క ఫోన్‌కాల్‌.. పది మంది బాలికల జీవితాలను నిలిపింది. ఒక్క బాలిక తెగువ.. పది బాల్య వివాహాలను ఆపింది.

కేరళ: ఒక్క ఫోన్‌కాల్‌.. పది మంది బాలికల జీవితాలను నిలిపింది. ఒక్క బాలిక తెగువ.. పది బాల్య వివాహాలను ఆపింది. ఈ ఘటన కేరళలోని మలప్పురం జిల్లాలోని కరువరకుండు పంచాయతీలో చోటు చేసుకుంది.

చైల్డ్ లైన్ అధికారుల కథనం ప్రకారం ఈ ఘటన వివరాలు ఇలా ఉన్నాయి. ఓ అమ్మాయి చైల్డ్ లైన్ హెల్ప్ లైన్ కు ఫోన్ చేసి కరువరకుండు పంచాయతీలో రానున్న వేసవిలో జరగనున్న తన పెళ్లిని ఆపాలని అభ్యర్థించింది.

తాను చదువును కొనసాగించాలనుకుంటున్నానని, ఈ వివాహం జరిగితే చచ్చిపోతానని ఏడ్చింది. తనలాగే మరో పది మంది బాలికలకు కూడా వివాహాలు జరగబోతున్నాయనే సమాచారాన్ని అధికారులకు అందించింది. వారిలో ఇద్దరికి 15 ఏళ్లు కాగా, మిగిలిన బాలికల వయసు 16 ఏళ్లని తెలిపింది.

Ten child marriages prevented in Malappuram

దీంతో స్పందించిన చైల్డ్ లైన్ అధికారులు కరువరకుండులో విచారణ జరపగా నిజంగానే ఈ ఏడాది ఏప్రిల్, మే నెలల్లో పది మంది బాలికలకు వివాహాలు జరగబోతున్నట్లు తేలింది. ఈ బాలికల్లో చాలామంది వివాహాలు నెల క్రితం నిశ్చయం అయ్యాయి.

వీరిందరూ ఒకే మతానికి చెందిన వారని, అన్ని కుటుంబాలూ ఆర్థికంగా వెనుకబడినవేనని సమాచారం. ఈ నేపథ్యంలో ఇప్పుడు కాకుండా భవిష్యత్తులో ఆడపిల్లల పెళ్లిళ్లు చేయాల్సి వస్తే ఆ ఖర్చు భరించలేమని వారి తల్లిదండ్రులు భావిస్తున్నారట.

ఈ పెళ్లిళ్లను ఆయా పంచాయతీ వార్డు సభ్యులు, బాల్య వివాహాల నివారణ అధికారి కలిపి ఆపివేయించార. సదరు బాలికలతోపాటు వారి తల్లిదండ్రులను కూడా పిలిచి కౌన్సెలింగ్ ఇచ్చారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+