సచిన్ ఉద్విగ్నక్షణం: సోనియా టు అంజలి..ఏమన్నారు?

న్యూఢిల్లీ: మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండుల్కర్‌కు భారతరత్న పురస్కారం దక్కడంపై పలువురు ప్రముఖులు స్పందించారు. సచిన్‌కు ప్రధాని స్వయంగా ఫోన్ చేసి అభినందించారు. క్రికెట్ నుంచి రిటైర్ అయినప్పటికీ ఆటకు మరెన్నో ఏళ్లు తన సేవలు అందించాలని ఆకాంక్షించారు. సచిన్ యువతకు అత్యుత్త ప్రతీకల్లో ఒకరని, క్రీడాకాలుకు ఆదర్శప్రాయుడని మన్మోహన్ అన్నారు.

ఎపి రాష్ట్ర గవర్నర్ ఇఎస్‌ఎల్ నరసింహన్, ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి హర్షం వ్యక్తం చేశారు. కేంద్ర పర్యాటక శాఖ మంత్రి చిరంజీవి సంతోషాన్ని వ్యక్తం చేశారు.

సచిన్ టెండూల్కర్‌కు భారత రత్న అవార్డును ప్రకటించడంపై ప్రతిపక్ష నాయకుడు, టిడిపి అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు హర్షం ప్రకటించారు. యువతకు ఇది స్ఫూర్తి దాయకంగా నిలుస్తుందని అన్నారు. పిసిసి అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ, బిజెపి జాతీయ నాయకుడు బండారు దత్తాత్రేయ, ఆ పార్టీ రాష్ట్ర శాఖ అధ్యక్షుడు కిషన్ రెడ్డి హర్షం ప్రకటించారు.

ఏవరేమన్నారు?

క్రికెట్ చరిత్రలో ఇదే అతి పెద్ద మ్యాచ్. ఇంతకుముందు లేని, భవిష్యత్తులో రాని గొప్ప సందర్భానికి సాక్ష్యులుగా నిలిచాం. మా అందరికీ ఆదర్శంగా నిలిచిన సచిన్‌కు కృతజ్ఞతలు. క్రికెటర్‌గానే కాకు గొప్ప వ్యక్తిగా అతను మార్గదర్శకుడు. - ధోనీ

చాలా ఉద్వేగంగా ఉంది. - రాహుల్ ద్రావిడ్

సచిన్‌తో ఆడటం గొప్ప గౌరవంగా భావిస్తున్నాం. ఒక క్రికెట్ హీరోను ఎలా ఆరాదించాలో తెలుసుకోవడానికి భారత అభిమానులే ప్రమాణం. - డారెన్ సామి

పది వికెట్ల ప్రదర్శనను సచిన్‌కు అంకితం ఇస్తున్నా. - ప్రజ్ఞాన్ ఓఝా

సచిన్ వీడ్కోలు టెస్టులో గొప్పగా రాణించడం సంతోషం. ఇవి ఎప్పటికీ మరిచిపోలేని క్షణాలు. - రోహిత్ శర్మ

సచిన్ 1

సచిన్ 1

క్రికెట్‌లో ఎంతోమంది ఆటగాళ్లతో కలిసి భారీ భాగస్వామ్యాలు అందించిన సచిన్ ఉత్తమ భాగస్వామిగా తన భార్య అంజలేనని వ్యాఖ్యానించాడు.

సచిన్ 2

సచిన్ 2

కెరీర్ నుంచి నిష్క్రమిస్తున్న సమయంలో కన్నీళ్లు పెట్టుకున్న సచిన్‌ను చూసి కిక్కిరిసిపోయిన వాంఖడే స్టేడియంలో ఉద్విగ్న వాతావరణం చోటు చేసుకుంది.

సచిన్ 3

సచిన్ 3

వీడ్కోలు సభలో సచిన్ మాట్లాడుతూ తన భార్య అంజలే తనకు అత్యుత్తమ భాగస్వామి అని, ఆమె సహకారం లేకపోతే తాను క్రికెట్‌లోనేగాక, జీవితంలోనూ రాణించ వాడిని కానని అంటూ వాతావరణాన్ని తేలిక పరిచాడు.

సచిన్ 4

సచిన్ 4

ఇంట్లో ఎప్పుడో ఏదో ఒకటి మాట్లాడడం తన అలవాటని, తన పిచ్చి మాటలను భరిస్తూ, దేశాలు పట్టుకు తిరుగుతున్నా సహిస్తూ, కుటుంబ బాధ్యతలను స్వీకరించిన ఆమె కంటే అత్యుత్తమ భాగస్వామి ఎవరుంటారని సచిన్ నవ్వులు చిందిస్తూ ప్రశ్నించాడు.

సచిన్ 5

సచిన్ 5

1990లో తాను అంజలిని తొలి సారి కలుసుకున్న విషయాన్ని గుర్తు చేసుకున్నాడు. క్రికెట్‌లేని సచిన్‌ను ఊహించలేమని అంజలి వ్యా ఖ్యానించింది.

సచిన్ 6

సచిన్ 6

క్రికెట్ ఊపిరిగా ఎదిగిన సచిన్ ఇప్పటికీ ఆటలో ఏకాగ్రతను కోల్పోలేదని అంజలి పేర్కొంది. అతని కెరీ ర్ ముగియడం బాధాకరమని చెప్పింది.

సచిన్ 7

సచిన్ 7

క్రికెటర్‌గానే గాక, ఒక మంచి వ్యక్తిగా కూడా సచిన్ ఉన్నత శిఖరాలను అధిరోహించాడని అంజలి తెలిపింది. ఎంతటి పేరు ప్ర ఖ్యాతులను ఆర్జించినప్పటికీ, అతను సాదాసీదా మని షిగా ఉంటాడని, ఆ నిరాడంబరమే అతనికి ప్రత్యేకతను సంపాదించిపెడుతున్నదని చెప్పింది.

సచిన్ 8

సచిన్ 8

ప్రపంచంలో అత్యంత మేటి క్రికెటర్‌గా కోట్లాదిమంది అభిమానుల నీరాజనాలు అందుకుంటున్న సచిన్ తెండూల్కర్ దేశ అత్యున్నత పౌర పురస్కారం భారతరత్న అవార్డుకు ఎంపికయ్యారు.

సచిన్ 9

సచిన్ 9

రాష్టప్రతి ప్రణబ్ ముఖర్జీ వీరిని ఈ అవార్డుకు ఎంపిక చేశారు. శుక్రవారం వెలువడిన ప్రకటనలో రాష్టప్రతి భవన్ అధికార ప్రతినిధి వేణు రాజమోని ఈ విషయాన్ని వెల్లడించారు.

సచిన్ 10

సచిన్ 10

ముంబయిలో వెస్టిండీస్‌తో జరిగిన రెండో టెస్టుతో అంతర్జాతీయ క్రికెట్ కెరీర్‌ను ముగించిన సచిన్ భారత రత్న అవార్డును అందుకోనున్న తొలి క్రీడాకారుడిగా చరిత్ర సృష్టించనున్నాడు.

సచిన్ 11

సచిన్ 11

దేశంలో రెండవ అత్యున్నత పౌర పురస్కారమైన ‘పద్మ విభూషణ' అవార్డులను సచిన్ టెండుల్కర్ (40) గతంలోనే అందుకున్నాడు.

సచిన్ 12

సచిన్ 12

ఇప్పుడు భారతరత్న అవార్డుకు ఎంపికవడంతో అత్యున్నత పౌర పురస్కారాన్ని అందుకున్న 41 మంది ప్రముఖుల సరసన చేరనున్నారు.

సచిన్ 13

సచిన్ 13

1954లో ఏర్పాటైన భారత రత్న అవార్డును వివిధ రంగాల్లో దేశానికి అత్యున్నత సేవలు అందించిన వారికి బహూకరిస్తున్న విషయం తెలిసిందే.

సచిన్ 14

సచిన్ 14

ఇంతకుముందు 2008లో పండిట్ భీమ్‌సేన్ జోషి ఈ అవార్డును అందుకున్నారు. సుమారు ఐదేళ్ల విరామం తర్వాత మళ్లీ ఈ అవార్డుకు ఇద్దరి పేర్లను ఎంపిక చేసినట్టు రాష్టప్రతి భవన్ ప్రకటించింది.

సచిన్ 15

సచిన్ 15

16 ఏళ్ల చిరు ప్రాయంలోనే బ్యాట్‌తో సత్తా చాటుకుని అంతర్జాతీయ క్రికెట్‌లో తిరుగులేని బ్యాట్స్‌మన్‌గా ఎన్నో రికార్డులు నెలకొల్పిన సచిన్ శనివారం ముంబయిలో 200వ టెస్టు మ్యాచ్ పూర్తిచేసి క్రికెట్ నుంచి వైదొలుగుతున్నట్టు ప్రకటించిన కొద్ది గంటలకే రాష్టప్రతి భవన్ నుంచి ఈ ప్రకటన వెలువడింది.

సచిన్ 16

సచిన్ 16

క్రికెట్‌లో సచిన్ సాధించిన రికార్డులు అనితర సాధ్యమైనవని, క్రీడా ప్రపంచంలో భారత్‌కు అసలు సిసలైన రాయబారి సచినేనని రాష్టప్రతి భవన్ ఆ ప్రకటనలో కొనియాడగా, జాతీయ అంతర్జాతీయ స్థాయిల్లో సచిన్ దేశ ప్రతిష్టను ఇనుమడింపజేయడంతో పాటు ప్రతి రంగంలో యువతకు ఆదర్శనీయుడిగా నిలిచారని ప్రధాన మంత్రి కార్యాలయం (పిఎంఓ) తన ప్రకటనలో ప్రశంసించింది.

సచిన్ 17

సచిన్ 17

24 ఏళ్ల సుదీర్ఘ క్రీడా ప్రస్థానంలో 200 టెస్టులు ఆడి 15,921 పరుగులు సాధించిన సచిన్ 463 వనే్డల్లో 18,426 పరుగులు సాధించాడు. వనే్డల్లో డబుల్ సెంచరీ చేసిన తొలి బ్యాట్స్‌మన్‌గా, అంతర్జాతీయ క్రికెట్‌లో వంద సెంచరీలు సాధించిన మొదటి క్రికెటర్‌గా రికార్డులు నెలకొల్పాడు.

సచిన్ 18

సచిన్ 18

క్రికెట్‌కు ఎనలేని సేవలు అందించడంతో పాటు వివాదాలకు పూర్తి అతీతుడిగా పేరుపొందిన సచిన్‌కు భారత రత్న ఇవ్వాలన్న డిమాండ్ చాలాకాలంగా వినిపిస్తున్నది.

సచిన్ 19

సచిన్ 19

ఈ అవార్డుకు క్రీడాకారులను కూడా ఎంపిక చేయవచ్చని కేంద్రం నిర్ణయించిన తర్వాత సచిన్ పేరు ప్రముఖంగా వినిపించింది. హాకీ మాంత్రికుడు ధ్యాన్ చంద్ పేరును పలువురు ప్రస్తావించినప్పటికీ, సచిన్ పేరునే రాష్టప్రతి ఖరారు చేయడం గమనార్హం.

సచిన్ 20

సచిన్ 20

దేశ అత్యున్నత పౌర పురస్కారమైన భారతరత్నకు ఎంపికయిన తొలి క్రీడాకారుడిగా చరిత్ర సృష్టించిన టెండుల్కర్ ఈ అవార్డును తన తల్లి రజనికి అంకితమిచ్చారు.

సచిన్ 21

సచిన్ 21

ముంబయిలో వెస్టిండీస్‌తో ముంబయిలోని వాంఖడే స్టేడియంలో వెస్టిండీస్‌తో జరిగిన రెండో టెస్టుతో తన అంతర్జాతీయ క్రికెట్ కెరీర్‌కు గుడ్‌బై చెప్పిన టెండుల్కర్‌ను భారత రత్న అవార్డుకు ఎంపిక చేసారన్న ప్రకటన ఆ టెస్టు ముగిసిన కొద్దిసేపటికే వెలువడ్డం గమనార్హం.

సచిన్ 22

సచిన్ 22

టెండుల్కర్‌కు భారతరత్న అవార్డుతో సత్కరించాలన్న భారత ప్రభుత్వ నిర్ణయం పట్ల ప్రముఖ మాజీ చెస్ క్రీడాకారుడు దిబ్యేందు బరువా హర్షం వ్యక్తం చేస్తూ, అయిదు సార్లు ప్రపంచ చెస్ చాంపియన్‌షిప్‌ను గెలుచుకున్న విశ్వనాథన్ ఆనంద్ కూడా ఈ అవార్డుకు అన్నివిధాల అర్హుడని అన్నారు.

సచిన్ 23

సచిన్ 23

మూడు ఒలింపిక్ స్వర్ణ పతకాలు సాధించిన ధ్యాన్‌చంద్‌ను కూడా భారత రత్నతో సత్కరించాలని దిబ్యేందు బరువా అభిప్రాయపడ్డారు.

సచిన్ 24

సచిన్ 24

'సచిన్ లేని క్రికెట్‌ను నేను ఊహించగలను. కానీ, క్రికెట్‌లేని సచిన్‌ను మాత్రం ఊహించలేను. ఎక్కడున్నా, ఎప్పుడైనా... క్రికెట్ నుంచి సచిన్ దూరమయిందే లేదు. మేం విహార యాత్రల్లో ఉన్నప్పటికీ... రాబోయే సిరీస్ గురించి మథనం సాగుతూనే ఉంటుంది.' అని అంజలి ఓ ఇంటర్వ్యూలో అన్నారు.

సచిన్ 25

సచిన్ 25

క్రికెట్‌లో ఎంతోమంది ఆటగాళ్లతో కలిసి భారీ భాగస్వామ్యాలు అందించిన సచిన్ ఉత్తమ భాగస్వామిగా తన భార్య అంజలేనని వ్యాఖ్యానించాడు.

సచిన్ టెండుల్కర్ కెరీర్ మహోజ్వలం. - బ్రెట్ లీ

సచిన్‌కు వందనం. నువ్వు లేకుండా క్రికెట్‌ను ఊహించలేం. - హర్భజన్ సింగ్

సచిన్ ఆడిన ప్రతి నిమిషం అమూల్యం. ఉద్వేగంగా కెరీర్ ముగించాడు. - మంజ్రేకర్

సచిన్‌కు ఘనమైన వీడ్కోలు లభించింది. సొంత అభిమానుల మధ్య సంతృప్తికరంగా గుడ్ బై చెప్పాడు. దక్షిణాఫ్రికాలో రిటైర్ అయితే ఈ స్థాయిలో స్పందన ఉండేది కాదేమో. కానీ నా చివరి మ్యాచ్ ఈడెన్ గార్డెన్స్‌లో ఆడే అవకాశం లభించలేదు. వివిఎస్ లక్ష్మణ్‌‍కు అదే పరిస్థితి. - గంగూలీ

అద్భుతమైన కెరీరా. నీ రిటైర్మెంట్ తర్వాత కూడా ఇదే స్ఫూర్తి కొనసాగించు. - రోజర్ ఫెదరర్.

కళ్లు చెమ్మగిల్లాయి. గొంతు పొడి బారిపోయింది. గుడ్ బై సచిన్. - ఆకాశ్ చోప్రా

సచిన్ రిటైర్మెంట్ ప్రకటించిన నాటి నుండే ఉద్వేగాన్ని ఆపుకోలేకపోయా. దాన్ని మాటల్లో చెప్పలేను. - సెహ్వాగ్

దగ్గర దారుల్లో పయనించకుండా కూడా విజయం సాధించవచ్చునని సచిన్ నిరూపించాడు. - గవాస్కర్.

సచిన్‌ను ఏ దేశానికైనా రాయబారిని చేసినా, ఐరాసలో భారత ప్రతినిధిని చేసినా గొప్పగా రాణిస్తాడు. - వివిఎస్ లక్ష్మణ్.

అతనో గొప్ప యూత్ ఐకాన్. క్రీడాకారులందరికీ రోల్ మోడల్. - సోనియా గాంధీ

సచిన్ క్రీడాకారులకు స్ఫూర్తిగా నిలిచాడు. అతను సాధించిన విజయాలు, నెలకొల్పిన రికార్డులు యువ ఆటగాళ్లకు ప్రేరణ. సచిన్ ప్రపంచ క్రికెట్లో తనదైన చెరగని ముద్ర వేశాడు. ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి

సచిన్ నెలకొల్పిన రికార్డులు యువతకు ప్రేరణగా నిలుస్తాయి. అలాంటి క్రికెటర్‌కు భారతరత్న పురస్కారాన్ని ప్రకటించడం హర్షనీయం. - టిడిపి అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు

సచిన్ లేని క్రికెట్‌ను ఊహించగలను. కానీ క్రికెట్ లేని సచిన్‌ను ఊహించలేని. ఎక్కడున్నా, ఎప్పుడైనా.. క్రికెట్ నుంచి సచిన్ దూరమయిందే లేదు. విహారయాత్రలో ఉన్నా రాబోయే సిరీస్ గురించే ఆలోచిస్తారు. - సచిన్ సతీమణి అంజలి

సచిన్ స్ఫూర్తి ప్రదాత. అందరికీ ఆదర్శం. సచిన్ భారతరత్నకు అర్హుడు. బిసిసిఐ

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+