హై అలర్ట్, బళ్లారి రెడ్డి బ్రదర్స్ ఫ్యామిలీలో టెన్షన్, శ్రీరాములు ఎంట్రీతో ?
బెంగళూరు/బళ్లారి: కర్ణాటకలోని 224 అసెంబ్లీ నియోజక వర్గాల్లో హై ఓల్టోజ్ నియోజక వర్గాల్లో బళ్లారి సిటీ, బళ్లారి గ్రామీణ అసెంబ్లీ నియోజక వర్గాలు ఉన్నాయి, బళ్లారి సిటీలో బీజేపీ అభ్యర్థి గాలి సోమశేఖర్ రెడ్డి, కేఆర్ పీ పార్టీ అభ్యర్థిగా గాలి లక్ష్మీ అరుణ మధ్య గట్టిపోటీ ఉంది. బళ్లారి గ్రామీణ నియోజక వర్గంలో మంత్రి బళ్లారి శ్రీరాములు, కాంగ్రెస్ పార్టీ సిట్టింగ్ ఎమ్మెల్యే నాగేంద్ర మధ్య గట్టిపోటీ ఉంది.
బళ్లారి సిటీతో పాటు బళ్లారి గ్రామీణ జిల్లాలో పోలీసులు హై అలర్ట్ ప్రకటించారు. బళ్లారి సిటీ, బళ్లారి గ్రామీణ నియోజక వర్గాల్లో ఒకే కులానికి చెందిన నాయకుల మధ్య పోటీ ఉంది, బళ్లారి సిటీలో మాజీ మంత్రి, మైనింగ్ కింగ్ గాలి జనార్దన్ రెడ్డి సతీమణి గాలి లక్ష్మీ అరుణ, బీజేపీ అభ్యర్థిగా గాలి సోమశేఖర్ రెడ్డి పోటీ చేశారు.

గాలి జనార్దన్ రెడ్డికి స్వయంగా తమ్ముడు అయిన బీజేపీ సిట్టింగ్ ఎమ్మెల్యే గాలి సోమశేఖర్ రెడ్డి మీద ఆయన సొంత వదిన గాలి లక్ష్మీ అరుణ పోటీ చెయ్యడంతో ఆ నియోజక వర్గం ప్రజలు ఎవరిని ఆదరిస్తారో కొన్ని గంటలు వేచి చూడాలి. బళ్లారిలో గాలి సోమశేఖర్ రెడ్డి, గాలి లక్ష్మీ అరుణల మధ్య పోటీ ఎక్కువగా ఉండటంతో మూడో వ్యక్తి ఏమైనా సీటు తన్నుకుని వెళ్లిపోతారా ? అనే విషయం కొన్ని గంటల్లో తేలిపోతుంది.
ఇక బళ్లారి గ్రామీణ నియోజక వర్గంలో పోటీ చేస్తున్న మంత్రి బళ్లారి శ్రీరాములు, కాంగ్రెస్ పార్టీ సిట్టింగ్ ఎమ్మెల్యే నాగేంద్ర మధ్య గట్టిపోటీ ఉంది. బళ్లారి శ్రీరాములు, నాగేంద్ర ఇద్దరూ వాల్మీకి కులానికి చెందిన వారే. అయితే వాల్మీకి కుల సంఘ పెద్దలు అందరూ మంత్రి బళ్లారి శ్రీరాములకు మద్దతు ప్రకటించడంతో ఆ నియోజక వర్గంలో హోరాహోరీగా పోటీ జరిగింది.

బళ్లారి గ్రామీణ నియోజక వర్గం నుంచి నాలుగుసార్లు ఎమ్మెల్యే అయిన బళ్లారి శ్రీరాములు గత లోక్ సభ ఎన్నికల్లో బళ్లారి గ్రామీణ నియోజక వర్గానికి దూరం అయ్యి బాదామి నియోజక వర్గం నుంచి సిద్దరామయ్య మీద పోటీ చేసి స్వల్ప మెజారిటీ తేడాతో ఓడిపోయారు. అయితే అదే అసెంబ్లీ ఎన్నికల్లో మోళకాల్కూరు నియెజక వర్గం నుంచి ఎమ్మెల్యేగా విజయం సాధించిన బళ్లారి శ్రీరాములు తరువాత మంత్రి అయ్యారు.
కూడ్లగి నుంచి రెండు సార్లు ఎమ్మెల్యే అయిన నాగేంద్ర గత అసెంబ్లీ ఎన్నికల్లో బళ్లారి గ్రామీణ నియోజక వర్గం నుంచి పోటీ చేసి ఎమ్మెల్యే అయ్యారు. సిట్టింగ్ స్థానం కాపాడుకోవాలని నాగేంద్ర అనేక ప్రయత్నాలు చేస్తుంటే, నాగేంద్రను ఇంటికి పంపించాలని బళ్లారి శ్రీరాములు వర్గం అన్ని ప్రయత్నాలు చేసింది. బళ్లారి గ్రామీణ నియోజక వర్గంలో ప్రధాని నరేంద్ర మోదీతో పాటు పవర్ నాయకులు బీజేపీకి మద్దతుగా ఎన్నికల ప్రచారం చేశారు. నాలుగు సార్లు ఎమ్మెల్యేగా, మంత్రిగా పని చేసిన బళ్లారి శ్రీరాములును ఆయన శిష్యుడు నాగేంద్ర ఓడించడం బళ్లారి జిల్లాలో హాట్ టాపిక్ అయ్యింది. బళ్లారి జిల్లాలో బీజేపీని వాష్ ఔట్ చేసిన కాంగ్రెస్ బీజేపీ నాయకులకు చుక్కలు చూపించింది.
-
మందు బాబులకు బిగ్ షాక్.. 2 రోజులు వైన్స్ బంద్.. -
దానం నాగేందర్‌కు బిగ్ షాక్.. అనర్హత వేటుపై అనూహ్య ట్విస్ట్..!! -
Jeevan Reddy: జీవన్ రెడ్డి రాజీనామాకు ముహుర్తం ఫిక్స్-కార్యకర్తలకు లేఖ-ఏ పార్టీలోకి ? -
ఏప్రిల్ రెండో వారంలో తెలంగాణాకు ప్రధాని మోదీ.. బీజేపీ బిగ్ ప్లాన్ ఇదే! -
40 ఏళ్లలో లేని అతిపెద్ద పసిడి పతనం. 1983 సీన్ రిపీట్! -
పాతాళానికి బంగారం ధరలు- రంజాన్ పండగ వేళ -
తమిళనాడులో ఆ పార్టీదే అధికారం: విజయ్ రాకతో మారిన ఈక్వేషన్లు -
రేషన్ లబ్దిదారులకు కేంద్రం గుడ్ న్యూస్- మూడు నెలల కోటా ఒకేసారి పంపిణీ -
బంగారం ధరల అంచనాలు తలకిందులు -
మేషరాశి, సింహరాశి, వృశ్చిక రాశి, ధనుస్సు రాశులకు ఏప్రిల్ నెలలో రాజయోగం -
బంగాళాఖాతంపై ఆవర్తనం- ఏపీలోని ఈ జిల్లాల్లో భారీ వర్షాలు -
తులారాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది వీరికి తిరుగేలేదు.. ఈ విషయంలో జాగ్రత్త!












Click it and Unblock the Notifications