మాజీ డీసీఎం నామినేషన్ ర్యాలీలో రాళ్ల వర్షం, లేడీ పోలీసులు, ఏం జరిగిందంటే ?

బెంగళూరు/తుమకూరు: కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులు నామినేషన్లు వెయ్యడానికి ఈనెల 20వ తేదీన చివరి తేదీ. ఈనెల 20వ తేదీ గురువారం అమావస్య కావడంతో బుధవారం చాలా మంది నాయకులు నామినేషన్లు వేశారు. మాజీ ఉప ముఖ్యమంత్రి నామినేషన్ వేసే సమయంలో కొందరు రాళ్లు దాడి చెయ్యడంతో మహిళా పోలీసులతో పాటు అనేక మందికి గాయాలైనాయి.

కర్ణాటక మాజీ ఉప ముఖ్యమంత్రి, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు డాక్టర్ జీ. పరమేశ్వర్ తుమకూరు జిల్లాలోని కోరగెరె నియోజక వర్గం నుంచి అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేస్తున్నారు. బుధవారం డాక్టర్ జీ పరమేశ్వర్ ఆయన అనుచరులు, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలతో భారీ ర్యాలీ నిర్వహించారు. కోరటగెరె పట్టణంలో డాక్టర్ జీ. పరమేశ్వర్ ర్యాలీలో వేలాది మంది కాంగ్రెస్ పార్టీ కార్యర్తలు పాల్గొన్నారు.

G Parameshwar nomination

తరువాత కోరగెరె తాలుకా కార్యాలయం చేరుకున్న డాక్టర్ జీ. పరమేశ్వర్ నామినేషన్ వెయ్యడానికి కార్యాలయం లోపలికి వెళ్లారు. ఆ సందర్బంలో కొందరు గుర్తు తెలియని వ్యక్తులు కొరగెరె తాలుకా కార్యాలయం మీద రాళ్ల వర్షం కురిపించారు. ఆ సందర్బంలో అక్కడే ఉన్న మహిళా పోలీసులతో పాటు చాలా మంది ప్రజల మీద రాళ్లు పడి వారికి గాయాలైనాయి.

నామినేషన్ వేసిన తరువాత బయటకు వచ్చిన డాక్టర్ జీ. పరమేశ్వర్ మీడియాతో మాట్లాడుతూ తాను నామినేషన్ వెయ్యడానికి కార్యాలయం లోపలికి వెళ్లిన తరువాత కొందరు రాళ్ల దాడి చేశారని తెలిసిందని, ఎవరు రాళ్ల దాడి చేశారు అని తనకు కచ్చితంగా తెలీదని, పోలీసు అధికారుల నుంచి వివరాలు సేకరిస్తున్నానని అన్నారు.

G Parameshwar nomination

చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడిన వారి మీద కఠిన చర్యలు తీసుకోవాలని తాను పోలీసు అధికారులకు మనవి చేశానని మాజీ ఉప ముఖ్యమంత్రి డాక్టర్ జీ. పరమేశ్వర్ అన్నారు. ఈ అసెంబ్లీ ఎన్నికల్లో బసవరాజ్ బోమ్మయ్ ప్రభుత్వం కచ్చితంగా ఇంటికి పోతుందని, కర్ణాటకలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వస్తుందని డాక్టర్ జీ పరమేశ్వర్ జోస్యం చెప్పారు. నామినేషన్ సమయంలో రాళ్ల దాడి చేసిన వారి కోసం గాలిస్తున్నామని, సీసీటీవీ కెమెరాలు పరిశీలిస్తున్నామని పోలీసు అధికారులు తెలిపారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+