బెంగళూరు వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

Bengaluru: లష్కర్ ఉగ్రవాదులతో లింక్ ! చదివింది 10వ తరగతి, ఐటీ హబ్ లో ఏం చేస్తున్నాడంటే ?, లింక్ !

|
Google Oneindia TeluguNews

బెంగళూరు/న్యూఢిల్లీ: ఉగ్రవాదులతో సంబంధాలు పెట్టుకుని గుట్టుచప్పుడు కాకుండా నివాసం ఉంటున్న అనుమానిత ఉగ్రవాదిని ఐటీ హబ్ లో అరెస్టు చేశారు. అక్తర్ హుస్సేన్ లష్కర్ అనే ఉగ్రవాదిని బెంగళూరు సీసీబీ పోలీసులు అరెస్టు చేశారు. అసోంకు చెందిన అక్తర్ హుస్సేన్ లష్కర్ (24) అనే అనుమానిత ఉగ్రవాది బెంగళూరులోని తిలక్ నగర్ లో మకాం వేసి కొందరు యువకులకు బ్రేన్ వాష్ చేసి ఉగ్రవాదం వైపు ఆకర్షితులను చేస్తున్నాడని పోలీసులు అంటున్నారు. అక్తర్ హుస్సేన్ లష్కర్ సోషల్ మీడియాలో యాక్టీవ్ గా ఉంటూ అంతర్జాతీయ ఉగ్రవాదులతో సంబంధాలు పెట్టుకున్నాడని ఐబీ అధికారులు సమాచారం ఇచ్చారని తెలిసింది. అక్తర్ హుస్సేన లష్కర్ ను సీసీబీ పోలీసులు రహస్య ప్రాంతంలో విచారణ చేస్తున్నారు. అంతర్జాతీయ ఉగ్రవాదులతో సంబంధాలు పెట్టుకున్న ఉగ్రవాది అరెస్టు కావడంతో తిలక్ నగర్ తో సహ బెంగళూరు ప్రజలు హడలిపోయారు.

Illegal affair: అక్కా, తమ్ముడు అని ప్రచారం, బెడ్ రూమ్ లో ఏం చేస్తున్నారంటే, చంపేసి డ్రామాలు, క్లైమాక్స్ లో !Illegal affair: అక్కా, తమ్ముడు అని ప్రచారం, బెడ్ రూమ్ లో ఏం చేస్తున్నారంటే, చంపేసి డ్రామాలు, క్లైమాక్స్ లో !

బెంగళూరులో మకాం

బెంగళూరులో మకాం

బెంగళూరు నగరంలోని జయనగర సమీపంలోని తిలక్ నగర్ లో అక్తర్ హుస్సేన్ లష్కర్ అలియాస్ అక్తర్ అలియాస్ హుస్సేన్ (24) అనే యువకుడు నివాసం ఉంటున్నాడు. అక్తర్ హుస్సేన్ లష్కర్ అంతర్జాతీయ ఉగ్రవాదులతో సంబంధాలు పెట్టుకున్నాడని సమాచారం అందండంతో సోమవారం వేకువ జామున బెంగళూరు సీసీబీ పోలీసులు అతని ఇంటి మీద దాడి చేసి అరెస్టు చేశారు.

10వ తరగతి చదివి ఏం చేస్తున్నాడు ?

10వ తరగతి చదివి ఏం చేస్తున్నాడు ?

అక్తర్ హుస్సేన్ 10వ తరగతి చదివాడని పోలీసుల ప్రాథమిక విచారణలో వెలుగు చూసింది. రెండు సంవత్సరాల క్రితం బెంగళూరు చేరుకున్న అక్తర్ హుస్సేన్ లష్కర్ పలు ప్రాంతాల్లో నివాసం ఉండి చివరికి తిలక్ నగర్ చేరుకున్నాడని బెంగళూరు సీసీబీ పోలీసులు తెలిపారు.

యువకులకు బ్రేన్ వాష్

యువకులకు బ్రేన్ వాష్


అక్తర్ హుస్సేన్ లష్కర్ అనే ఉగ్రవాదిని బెంగళూరు సీసీబీ పోలీసులు అరెస్టు చేశారు. అసోంకు చెందిన అక్తర్ హుస్సేన్ లష్కర్ అనే అనుమానిత ఉగ్రవాది బెంగళూరులోని తిలక్ నగర్ లో మకాం వేసి కొందరు యువకులకు బ్రేన్ వాష్ చేసి ఉగ్రవాదం వైపు ఆకర్షితులను చేస్తున్నాడని పోలీసులు అంటున్నారు.

ఐబీ పక్కా సమాచారం

ఐబీ పక్కా సమాచారం

అక్తర్ హుస్సేన్ లష్కర్ సోషల్ మీడియాలో యాక్టీవ్ గా ఉంటూ అంతర్జాతీయ ఉగ్రవాదులతో సంబంధాలు పెట్టుకున్నాడని ఐబీ అధికారులు సమాచారం ఇచ్చారని తెలిసింది. అక్తర్ హుస్సేన లష్కర్ ను సీసీబీ పోలీసులు రహస్య ప్రాంతంలో విచారణ చేస్తున్నారు. అంతర్జాతీయ ఉగ్రవాదులతో సంబంధాలు పెట్టుకున్న ఉగ్రవాది అరెస్టు కావడంతో తిలక్ నగర్ తో సహ బెంగళూరు ప్రజలు హడలిపోయారు.

 పిన్ టూ పిన్ లాగేస్తున్నారు

పిన్ టూ పిన్ లాగేస్తున్నారు

అక్తర్ హుస్సేన్ లష్కర్ బెంగళూరులో మకాం వేసి ఇంతకాలం ఎవరెవరిని కలిశాడు ?, అతనితో ఎంతమందికి లింక్ ఉంది, పాక్ తో సహ అంతర్జాతీయ ఉగ్రవాదులు ఎంతమందితో ఇతనికి లింక్ ఉంది ? అంటూ బెంగళూరు సీసీబీ పోలీసులు పిన్ టూ పిన్ బయటకు లాగుతున్నారు. అక్తర్ హుస్సేన్ లష్కర్ మీద ఇప్పటికే తిలక్ నగర్ పోలీస్టేషన్ లో కేసు నమోదు అయ్యింది. అక్తర్ హుస్సేన్ లష్కర్ గురించి త్వరలో పూర్తి సమాచారం ఇస్తామని పోలీసులు అంటున్నారు. ప్రస్తుతం ఎక్కువ సమాచారం ఇవ్వడానికి పోలీసు అధికారులు నిరాకరిస్తున్నారు.

English summary
Terrorist: CCB police has arrested a suspected terrorist from the city's Tilak Nagar area in Bengaluru. The suspected Lashkar terrorist, identified as Akthar Hussain, is based in Assam.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X