బెంగళూరు వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

Terrorists: పుట్టింది ఎక్కడ ?, పాస్ పోర్టు ఇచ్చింది ఐటీ హబ్ లో, ఎలాసాధ్యం ? జన్మరహస్యాలతో !

|
Google Oneindia TeluguNews

బెంగళూరు/మంగళూరు/బత్కల్: భారతదేశంలో పుట్టి ఇదే దేశాన్ని టార్గెట్ చేసుకుని అనేక నగరాల్లో విధ్వంసాలు సృష్టించిన బత్కల్ బ్రదర్స్ జన్మరహస్యాలు, పుట్టుపూర్వోత్తరాలు తెలుసుకోవడానికి ఐటీఎస్ అధికారులు రంగంలోకి దిగారు. ఎక్కడో పుట్టిన బత్కల్ బ్రదర్స్ కు ఐటీ హబ్ లో పాస్ పోర్టు ఎలా తీసుకున్నారు ?, ఉగ్రవాదులకు బర్త్ సర్టిఫికెట్, ఆధార్ కార్డు, ఓటరు ఐడీతో సహ ప్రభుత్వ గుర్తింపు కార్డులు ఎవరు ఇచ్చారు ? అంటూ ఏటీఎస్ అధికారులు పూర్తి ఆరా తీశారు. దేశంలోని అనేక నగరాలు వరుస బాంబు పేలుళ్లకు కారణం అయిన బత్కల్ బ్రదర్స్ బంధువులను ఎస్ఐటీ అధికారులు విచారణ చేసి వివరాలు బయటకు లాగారు. జర్మన్ బేకరితో పాటు బెంగళూరు చిన్నస్వామి స్టేడియం దగ్గర జరిగిన బాంబు పేలుళ్లతో పాటు భారత్ లో 8 చోట్లకు పైగా బత్కల్ బ్రదర్స్ వరుస బాంబు పేలుళ్లు సృష్టించారు.

llegal affair: ప్రియుడితో టెస్ట్ మ్యాచ్ ఆడుతున్న భార్య, స్పాట్ పెట్టి కెనాల్ లో వేసిన భర్త !llegal affair: ప్రియుడితో టెస్ట్ మ్యాచ్ ఆడుతున్న భార్య, స్పాట్ పెట్టి కెనాల్ లో వేసిన భర్త !

 జర్మన్ బేకరి బాంబు పేలుడు కేసులో ?

జర్మన్ బేకరి బాంబు పేలుడు కేసులో ?

మహారాష్ట్రలోని పూణేలోని బర్మన్ బేకరిలో 2010 బాంబు పేలుళ్లు జరిగాయి. పూణే జర్మన్ బేకరి బాంబు పేలుళ్ల కేసు విచారణ చేస్తున్న ఏటీఎస్ అధికారులు ఇండియన్ ముజాహుద్దీన్ ఉగ్రవాద సంస్థ నాయకులు రియాజ్ బత్కల్, యాసిన్ బత్కల్ సోదరుల జన్మరహస్యాలతో పాటు వారి పుట్టుపూర్వోత్తరాలు బయటకు లాగుతున్నారు.

 పూణే టూ బత్కల్

పూణే టూ బత్కల్

పూణేకి చెందిన ఇద్దరు సీనియర్ ఏటీఎస్ అధికారులతో పాటు మొత్తం ఐదు మంది అధికారులు కర్ణాటకలోని ఉత్తర కన్నడ జిల్లాలోని కారవారా చేరుకుని స్థానిక పోలీసు అధికారులతో భేటీ అయ్యారు. కర్ణాటక పోలీసులకు సమాచారం ఇచ్చిన తరువాత మహారాష్ట్ర ఏటీఎస్ అధికారులు తరువాత యాసీన్ బత్కల్, రియాజ్ బత్కల్ ఎంతో కాలం గుట్టుచప్పుడు కాకుండా జీవించిన బత్కల్ పట్టణం చేరుకున్నారు.

 ప్రభుత్వ రికార్డులు పరిశీలన

ప్రభుత్వ రికార్డులు పరిశీలన

బత్కల్ లో రెవెన్యూ శాఖ, పురసభ (మునిసిపాలిటి)తో పాటు ప్రభుత్వ కార్యాలయాల్లో బత్కల్ బ్రదర్స్ కు సంబంధించిన వివరాలు తెలుసుకోవడానికి రికార్డులు పరిశీలించారు. పూణే జర్మన్ బేకరిలో బాంబు పేలుళ్ల కేసుకు సంబంధించి అనేక అనుమానాలను నిర్దారించుకోవడానికి ప్రభుత్వ కార్యాలయాల్లో రికార్డులు పరిశీలించారు.

 పుట్టింది ఎక్కడ ? పాస్ పోర్టు ఇచ్చింది ఎక్కడ

పుట్టింది ఎక్కడ ? పాస్ పోర్టు ఇచ్చింది ఎక్కడ

యాసిన్ బత్కల్, రియాస్ బత్కల్ సోదరులు. వీరి తల్లిదండ్రులు జన్మస్థలం బత్కల్ అయినా రియాజ్ బత్కల్, యాసిన్ బత్కల్ పుట్టింది, పెరిగింది మాత్రం ముంబాయిలోనే అని ఏటీఎస్ అధికారులు అంటున్నారు. ముంబాయిలో పుట్టి పెరిగిన రియాజ్ బత్కల్, యాసిన్ బత్కల్ కొంత కాలం బత్కల్ లో నివాసం ఉన్నారు. అయితే ముంబాయిలో పుట్టిన యాసిన్ బత్కల్, రియాజ్ బత్కల్ కర్ణాటక రాజధాని బెంగళూరులో పాస్ పోర్టు తీసుకున్నారని ఏటీఎస్ అధికారుల దగ్గర సమాచారం ఉంది.

 ఎలా సాధ్యం అయ్యింది ?

ఎలా సాధ్యం అయ్యింది ?

మహారాష్ట్రలోని ముంబాయిలో పుట్టిన రియాజ్, యాసిన్ బత్కల్ కర్ణాటక రాజధాని అయిన ఐటీ హబ్ బెంగళూరులో ఎలా పాస్ పోర్టు తీసుకున్నారు ?, ఒక రాష్ట్రంలో పుట్టి పెరిగిన వాళ్లకు మరో రాష్ట్రంలో పాస్ పోర్టు ఎలా ఇచ్చారు? వీరికి సహకరించిన వారు ఎవరు ?, ప్రభుత్వ గుర్తింపు కార్డులు వీళ్లకు ఎవరు ఇచ్చారు ?, బత్కల్ లో ఉగ్రవాద సోదరులకు పూర్తిగా సహకరించిన వాళ్లు ఎవరు ? అంటూ పూణే ఏటీఎస్ అధికారులు కూపీలాగారు.

 అసలు ప్రభుత్వ కార్యాలయాల్లో ఏం జరిగింది ?

అసలు ప్రభుత్వ కార్యాలయాల్లో ఏం జరిగింది ?

బత్కల్ పురసభ (మునిసిపాలిటి), తహసిల్దార్ కార్యాలయం, రెవెన్యూ శాఖా, ఫుడ్ కార్పోరేషన్ కార్యాలయం, మిని విధానసౌద, ఎన్నికల అధికారుల కార్యాలయం, డీఎస్పీ కార్యాలయాలతో పాటు ప్రభుత్వ కార్యాలయాల్లో బత్కల్ బ్రదర్స్ గురించి వివరాలు సేకరించారు. బత్కల్ బ్రదర్స్ కు ఓటర్ ఐడీ కార్డు, ఆధార్ కార్డుతో పాటు బర్త్ సర్టిఫికెట్ తదితర ప్రభుత్వ గుర్తింపు కార్డుల విషయంలో సీక్రెట్ గా సమాచారం తెలుసుకున్న ఎస్ఐటీ అధికారులు ఈ ఉగ్రవాదుల జన్మరహస్యం గురించి పూర్తి సమాచారం సేకరించారని సమచారం.

Recommended Video

భారత్ లో చొరబాటుకు పాక్ యత్నం..పాక్ డ్రోన్ ను ధ్వంసం చేసిన భారత ఆర్మీ!! | Oneindia Telugu
 ఉగ్రవాదుల అరాచకాలు ఇవే

ఉగ్రవాదుల అరాచకాలు ఇవే

భారత్ లో పుట్టి పెరిగిన రియాజ్ బత్కల్, యాసిన్ బత్కల్ ఇండియన్ ముజాహుద్దీన్ అనే ఉగ్రవాద సంస్థను ప్రారంభించి పుట్టిన గడ్డకే ద్రోహం చేశారు. భారత్ లో రియాజ్ బత్కల్, యాసిన్ బత్కల్ సోదరులు సృష్టించిన విధ్వంసాల గురించి ఇంకా విచారణ జరుగుతూనే ఉంది.

*. 2008 దేశ రాజధాని ఢిల్లీలో వరుస బాంబు పేలుళ్లు.

*. 2008 జైపూర్ లో వరుస బాంబు పేలుళ్లు.

*. 2008 అహమ్మదాబాద్ లో వరుస బాంబు పేలుళ్లు.

*. 2010 పూణేలో జర్మన్ బేకరిలో బాంబు పేలుళ్లు.

*. 2010 బెంగళూరులోని చిన్నస్వామి క్రికెట్ స్టేడియం దగ్గర వరుస బాంబు పేలుళ్లు.

*. 2010 జామియా మసీదు దగ్గర బాంబు పేలుళ్లు.

*. 2010 శీతల్ ఘాట్ దగ్గర బాంబు పేలుళ్లు.

*. 2011 ముంబాయిలో వరుస బాంబు పేలుళ్లు.

భారతదేశంలోని అనేక నగరాల్లో వరుస బాంబు పేలుళ్లు విధ్వంసాలు సృష్టించిన రియాజ్ బత్కల్, యాసిన్ బత్కల్ సోదరులు బత్కల్ బ్రదర్స్ గా పోలీసు రికార్డులకు ఎక్కారు.

English summary
Terrorists: Pune anti terrorism squad (ATS) officials visited Bhatkal, Uttara Kannada district to collect information on Bhatkal brother's. Bhatkal brothers were involved in various terrorist acts in India, including the blasts at German Bakery in Pune.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X