గన్‌తో కాల్చుకుని బిల్డర్ ఆత్మహత్య, 18 పేజీల నోట్

ముంబై: ఆర్ధిక సమస్యలతో సతమతమవుతున్న థానేకు చెందిన ఓ ప్రముఖ బిల్డర్ తన లైసెన్స్ రివాల్వర్‌తో కాల్చుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. పోలీసుల కథనం ప్రకారం కాస్మోస్ గ్రూప్ చైర్ పర్సన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ సూరజ్ రమేష్ పర్మార్(46) తన వ్యక్తిగత .32 క్యాలిబర్ రివాల్వర్‌తో కాల్చుకుని బుధవారం మధ్యాహ్నం మృతి చెందాడు.

ముంబైలో ప్రముఖ ప్రాంతాలైన దాదర్, బివండీ, విరార్‌లతో పాటు లేక్ సిటీలో ఈ సంస్థ తన ప్రాజెక్టులను నిర్మించింది. అయితే బుధవారం ఈ సంఘటన జరిగినప్పుడు కొత్త ప్రాజెక్ట్‌కు కాసర్వాదవులీ నిర్మించిన బంగళాలో చనిపోయి పడి ఉన్నాడు. ఆయన మెడకు కుడి భాగాన బుల్లెట్ దూసుకుపోయిన గాయం ఉంది.

Thane builder shoots self, leaves 18-page note

గన్‌షాట్ విని విల్లాకు సమీపంలో పని చేస్తున్న ఉద్యోగులు పర్మార్‌ వద్దకు వచ్చారు. వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. దీంతో సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు పర్మార్‌‌ను హుటాహుటిన సమీపంలోని జూపిటర్ ఆసుపత్రికి తరలించారు.

అప్పటికే ఆయన మృతి చెందినట్లు వైద్యులు ప్రకటించారు. తన ఆఫీసుకు బయట పార్క్ చేసి ఉన్న సిడాన్ కారులో 18 పేజీల సూసైడ్ నోట్‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. కొత్తగా చేపట్టిన ప్రాజెక్టులకు సంబంధించి అనుమతులు మంజూరు చేసే విషయంలో అధికారుల జాప్యం, రుణాలు చెల్లింపులు సకాలంలో జరగకపోవడం వంటి కారణాలే ఆత్మహత్యకు పాల్పడినట్లు సమాచారం.

మహారాష్ట్ర చాంబర్ ఆఫ్ హౌసింగ్ ఇండస్ట్రీ(ఎంసీహెచ్ఐ), థానేకు ఆయన అధ్యక్షుడిగా కూడా ఆయన ఉన్నారు. పర్మార్‌కు భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+