ఆహా.. ఎంత అందమైన అమ్మాయిలో..!ఎవ్వరికీ అనుమానం రాకుండా..! షాపింగ్ మాల్ లో ఆ వ్యాపారమా..??
Recommended Video
గుర్గావ్/హైదరాబాద్ : భయంలేని కోడిపెట్ట ఇల్లెక్కి గుడ్డు పెట్టిందంటే ఇదే..! గుట్టు చప్పుడు కాకుండా రహస్యంగా నిర్వహించుకోవాల్సిన వ్యాపారం పైన నిఘా ఉంటుందని భావించిన సదరు వ్యక్తి పబ్లిగ్గా ఆ దందా నిర్వహించేందుకు సాహసించాడు. పబ్లిగ్గా అంటే ఆశా మాషీగా కదు ఏకంగా షాపింగ్ మాల్ లోనే దుకాణం ఓపెన్ చేసేసాడు సదరు వ్యాపారి. నిత్యం రద్దీగీ ఉండే షాపింగ్ మాల్ లో ఐతే ఎవరు ఎందుకు ఎక్కడి వస్తున్నారో పసిగట్టడం కష్టమని భావించిన అతడు నేరుగా అక్కడే దందాకు రూపకల్పన చేసాడు. కాని అక్రమంగా నిర్వహిస్తున్న ఏదైనా ఎప్పుడో సారి పోలీసులకు చిక్కకుండా మానదు.

షాపింగ్ మాల్ లోనే దుకాణం..! స్పా పేరుతో మరో బిజినెస్..!!
అచ్చం ఇలాంటి సంఘటనే హర్యాణాలో చోటుచేసుకుంది. షాపింగ్ మాల్‌లో అనుమానం రాకుండా నిర్వహిస్తున్న ఓ సెక్స్ రాకెట్ బాగోతం అకస్మాత్తుగా బయటకు రావడంతో మాల్ లోని మిగతా షాప్ యజమానులు అవాక్కయ్యారు. హర్యానాలోని గురుగ్రామ్‌లోని షాపింగ్‌మాల్‌లో ఓ స్పా సెంటర్‌పై దాడి చేసిన పోలీసులు ఆ సెక్స్ రాకెట్ గుట్టు రట్టు చేసారు. ఇందులో 17మంది అమ్మాయిలు..విటులతో పాటు స్పా సెంటర్ మేనేజర్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. పాలమ్ విహార్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ ఘటన చోటు చేసుకుంది.

స్మార్ట్ గా ఉండే అమ్మాయిలు..! మరింత స్మార్ట్ గా వ్యాపారం..!!
ఇక పూర్తి వివరాల్లోకి వెళ్తే.. ఓ పేరొందిన షాపింగ్ మాల్ లో స్పా సెంటర్ పేరుతో సెక్స్ రాకెట్ నడుస్తుందని పోలీసులకు అజ్ఞాత వ్యక్తి సమాచారం అందించాడు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు ఆ ప్రాంతంలో పెట్రోలింగ్ నిర్వహించారు. దీంతో తమకొచ్చిన సమాచారం సరైనదే అని నిర్ణయించుకున్న పోలీసులు ఒక్కసారిగా స్పా సెంటర్‌పై దాడి చేశారు. పోలీసులు దాడి చేసి 7 మంది మహిళలను కస్టమర్లతో అభ్యంతరకరమైన స్థితిలో పట్టుకోగా, 9 మంది బాలికలు స్పా సెంటర్‌లో వేచి ఉన్నట్లు తెలిపారు. అక్కడున్న 17 మంది అమ్మాయిలతో పాటు, మేనేజర్ నిరంజన్ మరియు స్పా సెంటర్ ఆపరేటర్ అలోక్ ను అరెస్ట్ చేశారు.

వివిధ రాష్ట్రాల నుంచి యంగ్ గల్స్..! అనుమానం రాకుండా షాపింగ్ మాల్ లోనే అన్నీ..!!
అయితే ఆ సమయంలో మరో పార్టనర్ గౌరవ్ ఖరే అనే వ్యక్తి అక్కడ లేకపోవడంతో అతని కోసం పోలీసులు గాలిస్తున్నారు. వ్యభిచారం నిర్వహించేందుకు, పలు ప్రాంతాలకు చెందిన అమ్మాయిల్ని ఇక్కడకు తీసుకొస్తున్నట్లు పోలీసుల విచారణలో తెలిసింది. అరెస్టు చేసిన యువతులు ఢిల్లీ, తమిళనాడు, మిజోరం, మణిపూర్, పశ్చిమ బెంగాల్, రాజస్థాన్, తెలంగాణకు చెందినవారిగా గుర్తించారు. వీరంతా ఢిల్లీ, గురగ్రామ్‌లోనే అద్దెకు ఇల్లు తీసుకుని నివసిస్తున్నట్లు సమాచారం. ఇంతవరకూ బాగానే ఉన్నా నిత్యం రద్దీగా ఉండే షాపింగ్ మాల్ లో వ్యభిచారం నిర్వహించాలని ఆలోచన రావడం, దాన్ని ఆచరణలో పెట్టడం నిర్వాహకుల తెలివితేటలకు నిదర్శనాలని స్థానికులు గుసగుసలాడుకుంటున్నట్టు సమాచారం. ఇలాంటి వ్యాపారాలు చేసే వారి పట్ల అప్రమత్తంగా ఉండాలని పోలీసులు సూచిస్తున్నారు.

అప్రమత్తంగా ఉండాలంటున్న పోలీసులు..! కేటుగాళ్లకు అమ్మాయిలు చిక్కొద్దని సూచన..!!
రద్దీగా ఉండే షాపింగ్ మాల్స్ లో షాపులు కొనుక్కోవడం లేదా లీజుకు తీసుకోవడం చాలా సులభమని, అద్దెలు ఎక్కువగా వస్తుండంతో యజమానులు కూడా ఎలాంటి వ్యాపారం నిర్వహిస్తారో అంతగా పట్టించుకోరని పోలీసులు చెప్పుకొస్తున్నారు. షాపులు అద్దెకు తీసుకునేముందు ఒక వ్యాపారం పేరు చెప్పి షాపులో దిగిన తర్వాత ఇలాంటి అసాంఘీక కార్యక్రమాలకు కొందరు పాల్పడతారని హర్యాణా పోలీసులు అంటున్నారు. ఇలాంటి వారి పట్ల అప్రమత్తంగా ఉండక పోతే సాధారణ జనావాసాల్లో కూడా ఇలాంటి వ్యాపారాలు నిర్వహించి సామాన్యులకు ఇబ్బందులు కలిగిస్తారని స్పష్టం చేస్తున్నారు. ఇక ముందైనా ఇలాంటి కేటుగాళ్ల పట్ల జాగ్రత్తగా వ్యవహరించాలని, అనుమానం కలిగితే వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలని సూచిస్తున్నారు. ముఖ్యంగా యుక్త వయసులో ఉన్న ఆడ పిల్లలు ఒకటికి రెండు సార్లు ఆలోచించి ఇలాంటి స్పా సెంటర్లకు వెళ్తే శ్రేయస్కరమని పోలీసులు చెప్తున్నారు.
-
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
విజయ్‌కు షాకిచ్చిన సర్వే!: ఆ పార్టీకి 180+ సీట్లు -
"నాకు అమ్మా నాన్న లేరు సార్ మీరే నాకు అమ్మా నాన్న.. పాస్ చేయండి సార్" -
తెలంగాణ ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్-అసెంబ్లీలో ప్రకటన..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
చైనా బంగారు కవచం.. ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో ప్రకంపనలు! -
ఆ భూములు ఇక వారికే, నిషేధం ఎత్తివేత - ప్రభుత్వం సంచలన ఉత్తర్వులు..!! -
అమెరికాలో విమాన ప్రమాదం: రన్ వే పై అడ్డంగా -
కొంపలు అంటుకున్నాయ్: 4 నెలల కనిష్టానికి బంగారం ధరలు












Click it and Unblock the Notifications