ఈ ఏడాది భారత్ కు కొత్త శత్రుదేశం ? గతం మర్చిపోయి రివర్స్..!
అంతర్జాతీయ వ్యవహారాల్లో, ముఖ్యంగా పొరుగుదేశాల విషయంలో తాజాగా భారత్ అనుసరిస్తున్న వైఖరి కారణంగా శత్రువులు పెరిగిపోతున్నారు. గతంలో అమెరికా వంటి దేశాలతో సుదీర్ఘ కాలం సత్సంబంధాలు కొనసాగించిన భారత్.. ఈ ఏడాది మాత్రం ట్రంప్ అధికారంలోకి వచ్చాక వాటిని కొనసాగించడంలో విఫలమైంది. దీని వెనుక ఎన్నో కారణాలు ఉన్నప్పటికీ ఇప్పుడు అమెరికాలో భారతీయులకు చుక్కలు కనిపిస్తున్నాయి. అదే సమయంలో పొరుగుదేశాల్లో మరో కొత్త శత్రువు తయారైంది.
భారత్ కు పొరుగుదేశాలైన చైనా, పాకిస్తాన్ ఇప్పటికే ఏకమై శత్రుత్వం కొనసాగిస్తున్నాయి. అదే సమయంలో ఈ ఏడాది అంతర్గంతంగా చోటు చేసుకున్న పరిణామాలపై మరో పొరుగుదేశం బంగ్లాదేశ్ సైతం భారత్ కు శత్రువుగా తయారైంది. ముఖ్యంగా బంగ్లాదేశ్ లో షేక్ హసీనా ప్రభుత్వాన్ని యువత కుప్పకూల్చిన తర్వాత చోటు చేసుకున్న పరిణామాల్లో ఆమెకు భారత్ ఆశ్రయం కల్పించింది. అలాగే ఆమెకు మరణశిక్ష పడ్డాక అప్పగించాలని కోరినా భారత్ అంగీకరించలేదు. దీంతో భారత్-బంగ్లాదేశ్ సంబంధాలు దెబ్బతిన్నాయి.

మరోవైపు బంగ్లాదేశ్ లో తాజాగా హిందువులపై అకారణంగా జరుగుతున్న దాడులు సైతం ఇరుదేశాల సంబంధాలకు ఇబ్బందికరంగా మారాయి. ఇప్పటికే బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనాకు ఆశ్రయం ఇస్తున్న భారత్ పై ఆ దేశానికి పీకలదాకా కోపం ఉంది. ఇప్పుడు అక్కడ హిందువులపై దాడులు జరుగుతున్నా ఏమీ అనలేని పరిస్దితుల్లో కేంద్రం స్వదేశంలో తీవ్ర ఒత్తిడి ఎదుర్కొంటోంది. అలాగని పూర్తిగా వదిలేయలేని పరిస్దితులు నెలకొన్నాయి. ఇవాళ నిన్న రాత్రి మరో హిందువుపై అల్లరి మూకలు దాడి చేసి చంపేయడం భారత్ ను కలవరపెడుతోంది. ఇప్పటికే ఈ హత్యలపై స్వదేశంలో హిందూ సంఘాల నిరసనలు వెల్లువెత్తుతున్నాయి.

అలా ఈ ఏడాది భారత్ కు చైనా, పాకిస్తాన్ తర్వాత పొరుగున మరో శత్రువు తోడైంది. ఒకప్పుడు పాకిస్తాన్ పై యుద్దం చేసి మరీ బంగ్లాదేశ్ కు స్వాతంత్రం ప్రసాదించిన చరిత్ర మర్చిపోయి అక్కడి నేతలు ఇప్పుడు భారత్ పై కత్తులు నూరుతున్నారు. అలాగని బంగ్లాదేశ్ పై దాడికి ప్రయత్నిస్తే చైనా, పాకిస్తాన్ మద్దతుగా నిలుస్తాయి. అప్పుడు ఈ ముగ్గురూ కలిసి భారత్ ను ఇబ్బందిపెట్టడం ఖాయం. అందుకే భారత్ ఈ వ్యవహారాన్ని చాలా సున్నితంగా డీల్ చేస్తోంది. వచ్చే ఏడాది బంగ్లాదేశ్ లో ఎన్నికలు జరిగి కొత్త ప్రభుత్వం ఏర్పడితే ఈ ఇబ్బందుల నుంచి భారత్ కు కాస్త ఉపశమనం లభించే అవకాశం ఉంది.












Click it and Unblock the Notifications