అమెజాన్ మేనేజర్ ను నడిరోడ్డులో కాల్చిపారేశారు. బంధువు సీరియస్, మ్యాటర్ !
న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో ఇటీవల నేరాల సంఖ్య పెరుగుతోంది. ఆన్‌లైన్ మార్కెటింగ్ సంస్థ అమెజాన్‌లో మేనేజర్‌గా పనిచేస్తున్న యువకుడిని దుండగులు నడిరోడ్డులో కాల్చి చంపారు. బైక్‌పై వచ్చిన ఐదుగురు దుండగులు 36 ఏళ్ల హర్‌ప్రీత్ గిల్‌ను హత్య చేసి పరారు కావడం కలకలం రేపింది.
ఢిల్లీలోని భజన్‌పూర్ ప్రాంతంలోని సుభాష్ విహార్ సమీపంలో తన బంధువుతో కలిసి బైక్‌పై వెళుతుండగా ఐదుగురు దుండగులు అమేజాన్ మేనేజర్ హర్‌ప్రీత్‌పై కాల్పులు జరిపారు. కాల్పుల కారణంగా హర్‌ప్రీత్ తలకు బుల్లెట్ తగిలి అక్కడికక్కడే మృతి చెందాడు. హర్ ప్రీత్ తో పాటు ఉన్న అతని బంధువును కూడా కాల్చడంతో అతని కుడి చెవికి గాయమైందని పోలీసు అధికారులు తెలిపారు.

అమెజాన్‌లో మేనేజర్‌గా పనిచేస్తున్న హర్ ప్రీత్ కు గోవింద్ సింగ్ అనే బంధువు ఉన్నాడు. భజన్‌పూర్ నివాసి మరియు ఆ ప్రాంతంలో హంగ్రీ మోమోస్ అనే అల్పాహార రెస్టారెంట్‌ను గోవింద్ సింగ్ నడుపుతున్నాడు. ప్రస్తుతం గోవింద్ సింగ్ ఢిల్లీలోని ఎల్‌ఎన్‌జేపీ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడని పోలీసు అధికారులు తెలిపారు.
అమేజాన్ మేనేజర్ హర్ ప్రీత్ ను హత్య చేసిన అనంతరం నిందితులందరూ అదృశ్యమయ్యారని, వారి కోసం సీసీటీవీలను పరిశీలించి గాలిస్తున్నామని పోలీసు అధికారులు తెలిపారు. ఈ సంఘటన గురించి హర్‌ప్రీత్ అంకుల్ అక్షయ్ స్థానిక మీడియాతో మాట్లాడారు. హర్‌ప్రీత్ తలపై దుండుగులు కాల్చులు జరిపారని ఆయన అన్నారు.
ఈ ఘటన ఎందుకు జరిగిందో మాకు తెలియదని, తమకు ఎవరిపైనా పగ లేదని, సీసీటీవీ ఫుటేజీని పరిశీలించి నిందితులను పట్టుకోవాలని తాను పోలీసు అధికారులను కోరుతున్నానన్నారు.
సంఘటన గురించి, డీసీపీ జాయ్ ఎన్ టిర్కీ మాట్లాడుతూ ప్రాథమిక విచారణ ప్రకారం హర్‌ప్రీత్, గోవింద్ బైక్‌పై వెళుతుండగా ఐదుగురు దుండగులువారిమీద దాడి చేశారని అన్నారు.

వాగ్వివాదం తర్వాత కాల్పులు జరిగాయి. హర్‌ప్రీత్ తలలోకి బలమైన తాలల గాయమై అక్కడికక్కడే మృతి చెందగా, అతని బంధువు గోవింద్‌కు కూడా కుడి చెవి దగ్గర కాల్చి చికిత్స అందిస్తున్నారు. అతని పరిస్థితి నిలకడగా ఉందని, కొందరు అనుమానితుల అరెస్టుకు ఉచ్చు బిగించాం. ఐదు నుంచి ఆరుగురితో కూడిన మాయ గ్యాంగ్‌పై అనుమానం ఉందన్నారు.
-
ఏపీలో ఇంటర్ ఫలితాల విడుదలపై బోర్డు తాజా నిర్ణయం, మార్కుల్లో ఈ సారి కొత్తగా..!! -
IPL 2026: కొంపముంచిన బుడ్డోడు.. రాజస్థాన్‌ను చిత్తు చేసిన SRH! -
నిర్మాతలకు స్టార్ హీరోయిన్ బంపరాఫర్! -
West Bengal Survey: బీజేపీ అంతర్గత సర్వేలో షాకింగ్- ఎన్ని సీట్లో తెలుసా ? -
మూడు పండుగలకు రెగ్యులర్ గా మూడు ఉచిత సిలిండర్ల పంపిణీ + రూ.2,000 -
Tamil Nadu Polls: సర్వేల షాక్ తో విజయ్ బిగ్ టర్న్..! తుది దశలో తాజా ప్లాన్..! -
ఎన్నికల వేళ విజయ్ సమర్థతను తేల్చేసిన పవన్..!! -
ఇలా చేస్తే అమరావతి గొడవ క్లోజ్..! మావిగన్ వేళ చంద్రబాబుకు సాయిరెడ్డి ఐడియా..! -
Amaravati: సాయిరెడ్డి సలహాపై స్పందించిన టీడీపీ..! బహిరంగ లేఖ..! -
ఆర్టీసీ బస్సు ఛార్జీల్లో మార్పులు, కొత్త రేట్లు ఇలా..!! -
అలిపిరి నుంచిప్రత్యేకంగా 11 లేన్ల రహదారి- టోల్ గేట్ సమూల పునరుద్ధరణ? -
పసిడికి భారీ డిమాండ్: కుప్పలు తెప్పలుగా












Click it and Unblock the Notifications