కూతురితో అక్రమ సంబందం, బ్రేక్ వేస్తున్న ఆంటీని రివాల్వర్ తో కాల్చి చంపి వాట్సాప్ లో వీడియోలు !
కూతురితో అక్రమ సంబందం పెట్టుకున్న వ్యక్తి ఆమెతో ఎంజాయ్ చేస్తున్నాడు. కూతురి అక్రమ సంబందం పెట్టుకున్న విషయం ఆమె తల్లికి తెలిసిపోయింది. అక్రమ సంబందం వదిలేయాలని, మనం పద్దతిగా బతుకుతున్నామని, నువ్వు అక్రమ సంబంధం పెట్టుకున్న వ్యక్తి వేరే మతం వాడని అక్రమ సంబంధం పెట్టుకున్న కూతురికి ఆమె తల్లి కొంతకాలం నుంచి బుద్దిమాటలు చెబుతోంది. ఇదే విషయంలో గొడవలు జరుగుతున్నాయి.
తన కూతురి అక్రమ సంబంధాన్ని వ్యతిరేకించినందుకు ఓ నేరస్థుడు ఆమె తల్లి ఇంట్లోకి ప్రవేశించి ఆమెను కాల్చి చంపిన షాకింగ్ సంఘటన దేశ రాజధాని ఢిల్లీలో చోటుచేసుకుంది.

ఢిల్లీలోని జహంగీర్‌పురి ప్రాంతంలో ఓ మహిళను కాల్చి చంపేశాడు. వేరే మతానికి చెందిన నిందితుడు హత్యకు గురైన మహిళ కుమార్తెతో అక్రమ సంబంధం పెట్టుకున్నాడని పోలీసులు అధికారులు తెలిపారు. దీనికి మహిళ అభ్యంతరం చెప్పడంతో నిందితుడు ఆమె ఇంట్లోకి ప్రవేశించి కాల్పులు జరిపాడు.
గాయపడిన మహిళను ఆమె కుటుంబ సభ్యులు వెంటనే ఢిల్లీ నగరంలోని బాబు జగ్జీవన్‌రామ్ ఆస్పత్రికి తరలించారు. చికిత్స అందక ఆమె మృతి చెందినట్లు వైద్యులు ప్రకటించారు. హత్యకు ముందు నిందితుడు తన వాట్సాప్ స్టేటస్‌లో పిస్టల్‌తో మహిళను కాల్చిన వీడియోను పోస్ట్ చేసినట్లు సమాచారం.
వాట్సాప్ స్టేటస్‌లో పోస్ట్ చేసిన వీడియోలో నిందితుడు పిస్టల్‌తో ఊపుతూ కనిపించాడు. అంతేకాదు మరో స్టేటస్‌లో పిస్టల్‌తో పాటు కాట్రిడ్జ్‌లు ఉంచిన వీడియోను పోస్ట్ చేశాడు.
నిందితుడు తన స్నేహితుడితో కలిసి మహిళ ఇంటికి వచ్చాడని ఆమె కుటుంబ సభ్యులు పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో తెలిపారు. ఆ తర్వాత మహిళపై కాల్పులు జరిపాడు. మహిళ కుమార్తెను నిందితుడు వేధిస్తున్నాడని కుటుంబ సభ్యులు పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు.

తన కుమార్తెను లైంగికంగా వేధించడాన్ని ఆ మహిళ అభ్యంతరం చెప్పడంతో ఆగ్రహించిన నిందితుడు పిస్టల్‌తో కాల్చాడు.
మహిళపై కాల్పులు జరిపిన అనంతరం నిందితుడు అతని సహచరుడితో కలిసి ఇంటి నుంచి పారిపోయాడు. ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు ప్రారంభించారు.
మహిళను హత్య చేసిన
నిందితులను పట్టుకునేందుకు పోలీసులు ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేశారు. నిందితుడిని, అతనికి సహకరించిన అతని స్నేహితుడిని త్వరలోనే పట్టుకుంటామని ఢిల్లీ పోలీసు అధికారులు తెలిపారు.












Click it and Unblock the Notifications