girlfriend: అర్దరాత్రి ప్రియురాలిని బయటకు పిలిచి గొంతు చీల్చి చంపేశాడు, ఒక్క మగాడు చాలడా ?

తిరువనంతపురం/కొచ్చి: యువతి, యువకుడు ప్రేమించుకున్నారు. ఇద్దరూ వేర్వేరు ప్రాంతాల్లో నివాసం ఉంటున్నారు. ప్రియురాలు మైనర్. ప్రియుడు ఎప్పుడు పిలిచినా ఆ యువతి అతని దగ్గరకు వెళ్లి మాట్లాడుతోంది. ఇటీవల ప్రియురాలు మరో యువకుడితో చనువుగా ఉందని ప్రియుడు అనుమానం పెంచుకున్నాడు. ప్రియురాలు ఊరిలోనే ఆ యువకుడు నివాసం ఉండటంతో ప్రియుడు ఇంకా రగిలిపోయాడు. అర్దరాత్రి మాట్లాడాలని ప్రియుడు అతని ప్రియురాలికి ఫోన్ చేశాడు. చప్పుడు కాకుండా ప్రియురాలు ఇంటి నుంచి బయటకు వచ్చింది. నీకు ఒక్క మగాడు చాలడా ? అంటూ రెచ్చిపోయిన ప్రియుడు అతని ప్రియురాలి గొంతు పూర్తిగా కోసి పరారైనాడు.

ప్రియుడిని నమ్మి అర్దరాత్రి బయటకు వచ్చింది

ప్రియుడిని నమ్మి అర్దరాత్రి బయటకు వచ్చింది

కేరళ రాజధాని తిరువనంతపురం సమీపంలోని వర్కాల ప్రాంతంలో ఓ యువతి దారుణ హత్యకు గురైయ్యింది. 17 ఏళ్ల బాలికను ఆమె ప్రియుడు గోవు హత్య చేశాడు. బాయ్‌ఫ్రెండ్ గోవు బాధితురాలిని తెల్లవారుజామున 2 గంటలకు తన ఇంటి నుండి బయటకు రావాలని ఫోన్ చేసి చెప్పాడు. ఇంటి నుంచి బయటకు వచ్చిన ప్రియురాలి గొంతును కత్తితో కోసేశాడు. యువతిని దారుణంగా హత్య చేసిన కొన్ని గంటల్లోనే నిందితుడు గోవును పోలీసులు అరెస్ట్ చేశారు.

వేరే ప్రాంతంలో నివాసం ఉంటున్న ప్రియుడు

వేరే ప్రాంతంలో నివాసం ఉంటున్న ప్రియుడు

తిరువనంతపురం జిల్లా పల్లికల్ ప్రాంతంలో గోపు అనే నిందితుడు, వర్కాల ప్రాంతంలోని వడస్సేరికోణంకు చెందిన సంగీత అనే యువతి ప్రేమించుకున్నారు. గోవు, సంగీత ఇద్దరూ వేర్వేరు ప్రాంతాల్లో నివాసం ఉంటున్నారు. ప్రియురాలు సంగీత మైనర్. ప్రియుడు గోవు ఎప్పుడు పిలిచినా సంగీత అతని దగ్గరకు వెళ్లి మాట్లాడుతోంది.

పెళ్లికి ముందే టార్చర్

పెళ్లికి ముందే టార్చర్

ఇటీవల సంగీత వర్కాలలో నివాసం ఉంటున్న మరో యువకుడితో చనువుగా ఉందని ఆమె ప్రియుడు గోవు అనుమానం పెంచుకున్నాడు. ప్రియురాలు సంగీత ఊరిలోనే ఆ యువకుడు నివాసం ఉండటంతో గోవు ఇంకా రగిలిపోయాడు. నువ్వు ఆ యువకుడితో ఎందుకు మాట్లాడుతున్నావు, నీకు వాడికి ఏమిటి సంబంధం అంటూ గోవు అతని ప్రియురాలు సంగీతను చితకబాదుతున్నాడు. పెళ్లికి ముందే ప్రియుడు గోవు అనుమానం పెంచుకుని కొడుతున్నాడని సంగీత ఇటీవల అతనికి దూరం కావడానికి ప్రయత్నించింది.

అర్దరాత్రి ఇంటి బయట ?

అర్దరాత్రి ఇంటి బయట ?

తన ప్రియురాలు సంగీత తనకు దూరం అయ్యి మరో ప్రియుడికి దగ్గర అవుతుందని గోవు ఆవేశంతో ఊగిపోయాడు. మంగళవారం రాత్రి సంగీతకు ఫోన్ చేసిన గోవు అర్దరాత్రి నువ్వు ఇంటి నుంచి బయటకు రావాలని చెప్పాడు. రాత్రి 2 గంటల సమయంలో సంగీత ఇంటి నుంచి బయటకు వచ్చింది. ఆ సందర్బంలో ప్రియురాలు సంగీతను చితకబాదేశాడు. తరువాత సంగీత, గోవుల మద్య వాగ్వివాదం జరిగింది. తరువాత రెచ్చిపోయిన గోవు అతని ప్రియురాలు సంగీతను గొంతు కోసేశాడు.

ప్రియురాలి ప్రాణం పోయింది

ప్రియురాలి ప్రాణం పోయింది

గొంతు తెగిపోవడంతో సంగీత గట్టిగా కేకలు వేసింది. సంగీత కుటుంబ సభ్యులు మరియు ఇరుగుపొరుగు వారు ఆమె అరుపులతో మేల్కొన్ని బయటకు వచ్చారు. అందరూ రావడంతో గోపు సంఘటన స్థలం నుండి పారిపోయాడు. రక్తపు మడుగులో పడి ఉన్న సంగీతను స్థానికులు ఆస్పత్రికి తరలించారు. సంగీత ప్రాణాలు కాపాడలేకపోయామని వైద్యులు చెప్పారు. హత్యా చేసిన గోవు కత్తి, మొబైల్‌ ఫోన్‌ ఘటనా స్థలంలో వదిలేసి వెళ్లాడని పోలీసులు అన్నారు. సంగీత గొంతు కోసిన గోవు పారిపోవడాన్ని చూసి పోలీసులకు సమాచారం అందించారు. సంగీత వేరే యువకుడితో తిరుగుతూ తనను మోసం చేసిందని, అందుకే చంపేశానని గోవు చెప్పాడని పోలీసులు అన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+