భర్తకు విడాకులు, మేనేజర్ తో లేడీ టెక్కీ సహజీవనం, మధ్యలో మూడో బాయ్ ఫ్రెండ్ ఎంట్రీతో !
వివాహం చేసుకున్న మహిళ ఆమె భర్తతో కాపురం చేసింది. సాఫ్ట్ వేర్ కంపెనీలో ఉద్యోగం చేస్తున్న మహిళ ప్రతిరోజు ఇంటి నుంచి ఉద్యోగం చెయ్యడానికి వెళ్లింది. తరువాత మ్యాటర్ రివర్స్ కావడంతో భర్తతో విడాకులు తీసుకుని ఉద్యోగం చేసింది. అదే సమయంలో ఆ లేడీ ఓ కంపెనీ మేనేజర్ తో సహజీవనం చెయ్యడం మొదలుపెట్టింది. ఇది చాలదు అన్నట్లు మరో బాయ్ ఫ్రెండ్ తో ఎంజాయ్ చేస్తూ అర్దరాత్రి బెడ్ రూమ్ లో సహజీవనం చేస్తున్న ప్రియుడికి అడ్డంగా చిక్కిపోయింది.
తన కొడుకు ప్రియురాలు, ఆమె కొత్త బాయ్ ఫ్రెండ్ ప్రోద్బలంతో మా కొడుకు ఆత్మహత్య చేసుకున్నాడని యువకుడి తల్లిదండ్రులు బెంగళూరులోని పరప్పన అగ్రహార పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. అన్బరసన్ అనే యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు. అన్బరసన్ చాలా కాలంగా ఓ మహిళతో సహజీవనం చేస్తున్నాడని, అదే ఇంటిలో అతను ఆత్మహత్య చేసుకున్నాడని బెంగళూరు పోలీసు అధికారులు తెలిపారు.

సుచిత్రా (పేరు మార్చడం జరిగింది) అనే మహిళతో అన్బరసన్ చిక్కనగమంగళలోని ఓ ఇంట్లో ఆరు నెలలుగా అద్దెకు ఉంటున్నారు. అన్బరసన్, సుచిత్రా దంపతులు భార్యాభర్తలమని చెప్పి ఆ ప్రాంతంలో ఇంటిని అద్దెకు తీసుకుని నివాసం ఉంటున్నారు. సుచిత్రా ప్రముఖ ఐటీ కంపెనీలో మంచి ఉద్యోగం చేస్తోందని సమాచారం. అన్బరసన్ ఓ ప్రైవేట్ కంపెనీలో మేనేజర్‌గా ఉద్యోగం చేస్తున్నాడని అతని కుటుంబ సభ్యులు తెలిపారు. అన్బరసన్ ఉన్నతస్థాయి ఉద్యోగం చేస్తుండటంతో అతనికి మంచి జీతం వస్తోంది.
గతంలోనే సుచిత్రాకు వివాహం అయ్యింది. కొంతకాలం భర్తతో కాపురం చేసిన సుచిత్రా అప్పుడు ఉద్యోగం కూడా చేసేదని తెలిసింది. ఉద్యోగం చెయ్యడానికి ఉదయం ఇంటి నుంచి బయటకు వెలుతున్న సుచిత్రా మీద ఆమె భర్తకు అనుమానం వచ్చిందని తెలిసింది. ఇదే విషయంలో సుచిత్రా దంపతుల మధ్య గొడవలు ఎక్కువ అయ్యాయి. తరువాత సహనం నసించిన భర్త సుచిత్రా నుంచి విడాకులు తీసుకుని అతను బెంగళూరులోనే వేరుగా కాపురం ఉంటున్నాడని తెలిసింది.

భర్త నుంచి విడాకులు తీసుకున్న సుచిత్రాకు తరువాత అన్బరసన్ పరిచయం అయ్యాడు. రానురాను అన్బరసన్, సుచిత్రా శారీరక సంబందం పెట్టుకుని దగ్గర అయ్యారని తెలిసింది. గత ఆరు నెలలుగా అన్బరసన్‌తో సుచిత్రా సహజీవనం చేస్తోంది. అయితే రెండు నెలల క్రితం సంతోష్ అనే వ్యక్తితో సుచిత్రాకు పరిచయం అయ్యింది. అన్బరసన్ తో సహజీవనం చేస్తున్న సుచిత్రా కొంతకాలం క్రితం పరిచయం అయిన సంతోష్ తో అక్రమ సంబంధం పెట్టుకుని అతనితో ఎంజాయ్ చేస్తోంది. సుచిత్రా, సంతోష్ ల అక్రమ సంబందం విషయం తెలుసుకున్న అన్బరసన్ నీ పద్దతి మార్చుకోవాలని ఆమెకు గట్టిగా చెప్పాడని తెలిసింది..
సహజీవనం చేస్తున్న అన్బరసన్ వార్నింగ్ ఇచ్చినా సుచిత్రా ఏమాత్రం పట్టించుకోకుండా అక్రమ సంబంధం పెట్టుకున్న సంతోష్ తో తిరుగుతూ ఎంజాయ్ చేస్తూ వచ్చింది. కొన్ని రోజుల క్రితం ప్రియుడు సంతోష్ ను నేరుగా ఇంటికి పిలుచుకుని వెళ్లిన సుచిత్రా బెడ్ రూమ్ లో అతనితో రొమాన్స్ చెయ్యడం మొదలుపెట్టింది. అదే రోజురాత్రి ఇంట్లో సంతోష్ తో సుచిత్రా రోమాన్స్ చేస్తూ ఉండగా ఊరు నుంచి అనుకోకుండా వచ్చేసిన అన్బరసన్ ఆమెను రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నాడు.

ఆ సమయంలో ఇలా చేయవద్దని సుచిత్రాకు మరోసారి నచ్చ చెప్పాడని సమాచారం. ఇంత జరిగినా సుచిత్రా ఆమె పద్దతి మార్చుకోకుండా ఆమె పాత పంథా కొనసాగించి ప్రియుడు సంతోష్ తో తిరగడం మొదలుపెట్టాడని తెలిసింది. సహజీవనం చేస్తున్న సుచిత్రా తనను మోసం చేసిందని ఆవేదనతో అన్బరసన్ ఆత్మహత్య చేసుకున్నాడని అతని తల్లిదండ్రులు ఆరోపించారు.
అన్బరసన్ ఆత్మహత్య కేసుకు సంబంధించి మొదట యూడీఆర్ కేసు నమోదైంది.కొన్ని రోజుల క్రితం అన్బరసన్, సుచిత్రా మాట్లాడుకుంటున్న ఆడియో కాల్ అన్బరసన్ తల్లిదండ్రులకు చిక్కింది. ఈ ఆడియో కాల్ ఆధారంగానే తమ కొడుకు అన్బరసన్ ను ఆత్మహత్యకు ప్రేరేపించారని ఆరోపిస్తూ అన్బరసన్ తల్లిదండ్రులు సుచిత్రా, సంతోష్‌లపై బెంగళూరులోని పరప్పన అగ్రహార పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. ఈ మేరకు పరప్ప అగ్రహార పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు చేసి విచారణ చేస్తున్నారు.
-
IPL 2026: ముంబై ఇండియన్స్ కొంపముంచిన బుడ్డోడు! -
చెన్నై సూపర్ కింగ్స్ కు భారీ ఉపశమనం- పులి వచ్చింది -
ఓటీటీలోకి తెలుగు బోల్డ్ మూవీ.. అర్జున్ రెడ్డికి మించి.. ఆ రోజు నుంచే స్ట్రీమింగ్ -
today rashiphalalu: నేడు ముఖ్య గ్రహాల గోచారంతో వీరి పంట పండుతుంది.. మీరున్నారా? -
తమిళనాడు, కేరళ, బెంగాల్, అసోంలో గెలుపెవరిది ? సీఓటర్ తాజా సర్వే..! -
'హ్యాపీ బర్త్ డే బావా'.. ఎన్టీఆర్ ఎమోషనల్ పోస్ట్.. బన్ని షాకింగ్ రిప్లై.. -
Tamil Nadu Survey: తమిళనాడు విజేతను తేల్చేసిన ఏబీపీ సర్వే-ఎవరికెన్ని సీట్లంటే..? -
రైతు భరోసా రెండు, మూడో విడత నిధుల జమ షెడ్యూల్ ఫిక్స్- ఎవరికి ఎప్పుడు..!! -
అల్లు అర్జున్.. ఇండియన్ స్క్రీన్ పై ఎప్పుడూ చూడని రోల్: గగుర్పాటు -
కేబినెట్ భేటీలో ప్రధాని మోదీ సంచలన నిర్ణయాలు ఇవే.. -
అమరావతికి కేంద్రం మరో భారీ గుడ్ న్యూస్, ఈ సారి ఏకంగా..!! -
కిల్లర్ మిల్లర్.. గాయాన్ని సైతం లెక్కచేయని మొండిధైర్యం












Click it and Unblock the Notifications