Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

దేశభక్తిని చాటుకున్న జంట .. పుట్టిన బిడ్డకు 'మిరాజ్' అని నామకరణం

రాజస్థాన్ కు చెందిన ఒక జంట దేశం పై తమకున్న భక్తిని చాటుకుంది. పుల్వామా ఉగ్రదాడులకు ప్రతీకార దాడిగా సర్జికల్ స్ట్రైక్ చేసి భారత్ సత్తా చాటుకుంది. ఈ సర్జికల్ స్ట్రైక్ సక్సెస్ కావడానికి మిరాజ్ 2000 యుద్ధ విమానం కీలక భూమిక పోషించింది. భారతదేశ చరిత్రలో, భారత రక్షణ వ్యవస్థలో తన పాత్రను చిరస్థాయిగా చాటుకుంది మిరాజ్.అటువంటి మిరాజ్ కు గౌరవాన్ని ఇచ్చే నిర్ణయం తీసుకుంది. ప్రతి నిత్యం ఆ పేరు పలికేలా చేసింది.

పాక్‌ ఆక్రమిత కశ్మీర్‌లోని జైషే ఉగ్రవాద శిబిరాలపై మొత్తం 12 మిరాజ్‌-2000 యుద్ధ విమానాలు మూకుమ్మడిగా దాడి చేసిన సంగతి తెలిసిందే. సర్జికల్ స్ట్రైక్ 2.0 సక్సెస్ చేసిన మిరాజ్‌ పేరు అప్పటినుండి మారుమోగుతూ ఉంది.

మిరాజ్ యుద్ధ విమానాలు దాడి చేసిన సమయానికి రాజస్థాన్‌లోని అజ్మీర్‌కు చెందిన మహావీర్‌ సింగ్‌, సోనం సింగ్‌ దంపతులకు పండంటి మగబిడ్డ జన్మించాడు. దీంతో మిరాజ్‌ యుద్ధ విమానాల దాడి నేపథ్యంలో ఆ బిడ్డకు మిరాజ్‌ రాథోడ్‌ సింగ్‌ అని నామకరణం చేసి తమ దేశభక్తిని చాటుకున్నారు తల్లిదండ్రులు. అంతేకాకుండా తమ బిడ్డను ఆర్మీలోనే చేర్పిస్తామని తండ్రి ఎస్ఎస్‌ రాథోడ్‌ తెలిపాడు. నవశిశువుకు మిరాజ్ అని పేరుపెట్టడం సంతోషంగా ఉందని ఆనందాన్ని వ్యక్తంచేశాడు. ఇక ఈ ఫోటోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్నాయి.

The couple who express their patriotism ..The newly born baby is named Mirage

పుల్వామా ఉగ్రదాడి తరువాత అనూహ్యంగా దేశవ్యాప్తంగా ప్రతీకారం తీర్చుకోవాలన్న మాట వినిపించింది. 40 మంది భారత సైన్యాన్ని పొట్టనపెట్టుకున్న ఉగ్రవాదులను తుదముట్టించాలని యావత్ భారతదేశం కాంక్షించింది. ఉగ్రవాదాన్ని అంతం చేయడానికి వైమానిక దళం లో ఉన్న మిరాజ్ 2000 గగనతలంలో దూసుకుపోయింది. వెయ్యి కిలోల బాంబులను ఉగ్రవాద స్థావరాలపై వేసి జైషే మహమ్మద్ ఉగ్రవాదులను భారీ సంఖ్యలోనే అంతమొందించింది. భారతదేశానికి గతంలో కార్గిల్ వార్ లోనూ , ప్రస్తుతం సర్జికల్ స్ట్రైక్ లో నూ తన సేవలను అందించి భారత పతాకానికి సగర్వంగా సెల్యూట్ చేసింది. అటువంటి జెట్ ఫైటర్ పేరు తమ చిన్నారులకు పెట్టడం భారత ప్రజలు ఇచ్చే సరైన గౌరవం. సెల్యూట్ టూ మిరాజ్ .

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+