ఆదాయం ఎంతపని చేసింది, మూడో అంతస్తు నుంచి భార్యను ఎత్తి కిందేశాడు, రాత్రి అక్కడ?
మద్యం మత్తులో ఉన్న భర్త చేతిలో ఓ అమాయక మహిళ బలి అయింది. మద్యం తాగి ఇంటికి వచ్చిన భర్తను అతని భార్య కొట్టింది. అంతకుముందే పీకలదాక మద్యం తాగి ఇంటికి వచ్చిన భర్త మీద అతని భార్య దాడి చెయ్యడంతో అతని కోపం రెట్టింపు అయ్యింది. ఆ కోపంతో భార్యను మూడో అంతస్తులో నుంచి ఎత్తి కిందకు పడేశాడు. మూడో అంతస్తు నుంచి కింద పడిపోయిన భార్యను వెంటనే ఆస్పత్రికి తరలించినా ఆమె ప్రాణాలతో బయటపడలేదు.
ఈ దారుణ ఘటన ఉత్తరప్రదేశ్‌లోని గోవింద్‌పూర్‌లో చోటుచేసుకుంది.గోవిందపురలో ప్రముఖ రద్దీ ప్రాంతంలో పార్కింగ్ కాంట్రాక్టర్ గా ఉన్న వికాస్ కుమార్ అలియాస్ వికాస్ మద్యానికి బానిసయ్యాడు. విపరీతమైన ఆదాయం వస్తుండటంతో వికాస్ ప్రతిరోజూ మద్యం తాగి ఇంటికి వచ్చేవాడు. భర్త వికాస్ మద్యానికి బానిస కావడంతో రోజు అతని భార్య ప్రియా (పేరు మార్చడం జరిగింది)కు అతనితో గొడవ పడేది.

ఇదే విషయంలో వికాస్, ప్రియా దంపతుల మధ్య నిత్యం గొడవలు జరిగేవని బంధువులు, వారి ఇంటి పక్కన నివాసం ఉంటున్న వాళ్లు, చుట్టుపక్కల వాళ్లు అంటున్నారు. మద్యం మత్తులో ఉన్న వికాస్ తీరుతో అతని భార్య ప్రియా ఓపిక నశించింది. రాత్రి మద్యం మత్తులో వికాస్ మూడో అంతస్తులోని అతని ఇంటికి వెళ్లాడు. మద్యం తాగి ఇంటికి వచ్చిన వికాస్ ను అతని భార్య ప్రియా ప్రశ్నించింది. అంతేకాదు మద్యం మత్తులో చిందులు వేస్తున్న భర్త వికాస్ ను అతని భార్య ప్రియా చితకబాదేసింది. భార్య ప్రియా తిడుతున్న మాటలకు తాగుబోతు భర్త వికాస్ కు కోపం పెరిగింది.
ఇంకోసారి నువ్వు మద్యం తాగితే అసలు ఇంటికే రాకూడదని ప్రియా ఆమె భర్త వికాస్ కు తేల్చిచెప్పింది. అప్పటికే మద్యం మత్తు నాశాలానికి ఎక్కిపోవడంతో నా ఇంటికి నన్నే రావద్దని చెబుతావా అంటూ రెచ్చిపోయిన వికాస్ మూడో అంతస్తు వరండాలో ఉన్న భార్యను చితకబాదేశాడు. వరండాలోంచి భార్య ప్రియాను బయటకు లాగిన వికాస్ ఆమెను మూడో అంతస్తులో నుంచి ఎత్తి కింద పడేశాడు.
మూడో అంతస్తు నుంచి కింద పడటంతో ప్రియా తీవ్ర గాయాలపాలైంది. వెంటనే స్థానికులు ప్రియాను ఆసుపత్రికి తరలించడానికి ప్రయత్నించారు. వికాస్ కూడా అతని భార్యను ఆస్పత్రికి తరలించేందుకు సహకరించాడు.
ఆసుపత్రికి చేరుకున్న ప్రియాను వైద్యులు పరీక్షించి ఆమె మృతి చెందినట్లు నిర్ధారించారు. ఆస్పత్రి సిబ్బంది పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు వచ్చేలోపే వికాస్ పరారయ్యాడు. పోలీసులు గాలించి నిందితుడు వికాస్ ను అదుపులోకి తీసుకున్నారు. తాగుబోతు వికాస్ కు మద్యం మత్తు దిగిపోవడంతో అతన్ని పోలీసులు జైలుకు పంపించారు.












Click it and Unblock the Notifications