బళ్లారి శ్రీరాములు, భార్య ఒకే చోట పోటీ, భర్తకు బీజేపీ టిక్కెట్, భార్య ఇండిపెండెంట్, ఒకే ఇంట్లో ?
కర్ణాటకలో రెండో దశలో జరగనున్న బళ్లారి లోక్‌సభ సార్వత్రిక ఎన్నికలకు నామినేషన్ పత్రాల సమర్పణ గడువు ముగిసింది. నామినేషన్ పత్రాల సమర్పణ తొలిరోజున బీజేపీ అభ్యర్థి బి. శ్రీరాములు, తరువాత శ్రీరాములు భార్య భాగ్యలక్ష్మి స్వతంత్ర అభ్యర్థిగా నామినేషన్ పత్రాలు సమర్పించి అందరినీ ఆశ్చర్యపరిచారు. తన నామినేషన్ తిరస్కరణకు గురవుతుందనే భయంతో శ్రీరాములు ఇన్ని రోజులు టెన్షన్ గా ఉన్నారు.
బీజేపీ హైకమాండ్ టిక్కెట్ ఇచ్చినా ఎన్నికల అధికారులు తన నామినేషన్ పత్రాలు తిరస్కరిస్తారని మాజీ మంత్రి బళ్లారి శ్రీరాములు భయపడిపోయారు. అందుకే ముందుజాగ్రత్త చర్యగా ఆయన భార్య భాగ్యలక్ష్మి స్వతంత్ర అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేశారు. ఇప్పుడు శ్రీరాములు, శ్రీరాములు భార్య భాగ్యలక్ష్మిల నామినేషన్ పత్రాలను ఎన్నికల అధికారుల దగ్గర ఆమోదం పొందాయి. తన భర్త నామినేషన్‌ను ఆమోదిస్తే భాగ్యలక్ష్మి తన నామినేషన్‌ను వెనక్కి తీసుకోవచ్చని తెలిపింది.

అయితే నామినేషన్ పత్రాలు ఉప సంహరణ రోజు ఏం జరుగుతుందో వేచి చూడాలి అంటున్నారు బళ్లారి జిల్లా ప్రజలు. లోక్‌సభ సార్వత్రిక ఎన్నికలకు వందలాది మంది నామినేషన్లు వేశారు. బళ్లారి లోక్‌సభ నియోజకవర్గానికి సంబంధించి 11 మంది అభ్యర్థుల నామినేషన్ పత్రాల పరిశీలనలో అమోదించారు. 11 మంది అభ్యర్థుల నామినేషన్ పత్రాలను చివరి రోజుల ఆమోదించారు. ఈ వివరాలను బళ్లారి జిల్లా ఎన్నికల అధికారి ప్రశాంత్ కుమార్ మిశ్రా తెలిపారు.
బళ్లారి నగర కలెక్టరేట్‌లోని ఎన్నికల అధికారి కార్యాలయంలో జిల్లా ఎన్నికల అధికారి, జిల్లా కలెక్టర్ ప్రశాంత్‌కుమార్ మిశ్రా నామినేషన్ పత్రాలను క్షుణ్ణంగా పరిశీలించారు. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఇ.తుకారాం, బహుజన సమాజ్ పార్టీ అభ్యర్థి వాల్మీకి కృష్ణప్ప, బీజేపీ అభ్యర్థి బి. శ్రీరాములు, శ్రీరాములు భార్య భాగ్యలక్ష్మితో పాటు మొత్తం 11 మంది నామినేషన్ పత్రాలను ఆమోదించామని జిల్లా కలెక్టర్ ప్రశాంత్ కుమార్ మిశ్రా తెలిపారు.
జాతీయ, రాష్ట్ర రాజకీయ పార్టీల నామినేషన్ పత్రాలు క్రమబద్ధంగా ఉన్నాయని వివరించారు. ఇవే కాకుండా కర్ణాటక రాష్ట్ర సమితి పార్టీ అభ్యర్థి సి. చెన్నవీర, సోషలిస్ట్ యూనిటీ సెంటర్ ఆఫ్ ఇండియా (కమ్యూనిస్ట్) పార్టీ అభ్యర్థి ఎ. దేవదాస్, ప్రహార్ జనశక్తి పార్టీ అభ్యర్థి మంజప్ప, నవభారత్ సేన అభ్యర్థి జి. స్వామి వారి నామినేషన్ పత్రాలు సక్రమంగా ఉన్నాయి. మొత్తం మీద నామినేషన్ పత్రాల ఉపసంహరణ చివరి రోజుల మాజీ మంత్రి బళ్లారి శ్రీరాములు భార్య భాగ్యలక్ష్మి నామినేషన్ పత్రాలు ఉపసంహరిస్తారా ?, లేదంటే పోటీలో ఉంటారా ? అనే విషయం వేచి చూడాలని బళ్లారి జిల్లా ప్రజలు అంటున్నారు.
-
బెస్ట్ వెయిట్ లాస్ జ్యూస్.. రోజూ తాగితే పొట్ట వద్దన్నా పోతుంది..!! -
తెలుగు ఇండస్ట్రీ హిట్ హిందీ రీమేక్‌లో శ్రీలీల.. ట్రోలింగ్ చూస్తే ఏడుపే !! -
ఇంటిమేట్ సీన్లలో నన్ను వాడుకున్నారు.. కట్ చెప్పినా వినలేదు: స్టార్ హీరోయిన్ -
అక్కినేని అఖిల్ సంచలన నిర్ణయం.. వైరల్ అవుతున్న ఎమోషనల్ పోస్ట్..! -
2028 అమెరికా అధ్యక్షుడు ఆయనే.. భారత్ కు గుడ్ న్యూస్..!! -
రోజూ ఉదయాన్నే ఖాళీ కడుపుతో ఈ నీళ్లు తాగితే చాలు- లివర్, కిడ్నీలు క్లీన్..!! -
జన్మ నక్షత్రం మఖ, పుబ్బ, ఉత్తర ఉన్నవారి ఏప్రిల్ నెల జాతక ఫలం -
SRH కొంప మునిగిందక్కడే- RCB కి టర్నింగ్ పాయింట్ -
IPL 2026: చరిత్ర సృష్టించిన ముంబై ఇండియన్స్.. 14 ఏళ్ల తర్వాత బోణీ! -
Vijay Assets: విజయ్ ఆస్తులు తెలిస్తే షాక్- నామినేషన్లో వెల్లడి..! -
అక్కడ మెగాస్టార్.. ఇక్కడ విజయ్: అంతే గానీ ఓట్లు రాలవ్: ప్రముఖ నటుడు రియాక్షన్ -
బాలయ్యతో సినిమా చేయనంటున్న స్టార్ హీరోయిన్..?












Click it and Unblock the Notifications