బర్త్ డే పార్టీ, వీడియో గ్రాఫర్ ను రివాల్వర్ కాల్చి చంపేసిన అమ్మాయి తండ్రి, ఎక్కడ గురిపెట్టాడంటే ?
చిన్నచిన్న విషయాలకు హత్యలు జరగడం సర్వ సాధారణం అయ్యింది. ఓ వ్యక్తి అతని కూతుర్ని ప్రాణానికి ప్రాణంగా చూసుకుంటున్నాడు. బర్త్ డే పార్టీ సందర్భంగా వీడియో షూట్ చేస్తుండగా బ్యాటరీ అయిపోయి వీడియో రికార్గింగ్ ఆగిపోయింది. ఆ సమయంలో ఆవేశానికి లోనైన బర్త్ డే బేబి తండ్రి వీడియోగ్రాఫర్ ను రివాల్వర్ తో కాల్చి చంపిన ఘటన బీహార్ లో చోటుచేసుకుంది.
వీడియోగ్రాఫర్ సుశీల్ కుమార్ సాహ్ని అలియాస్ సుశీల్ (22) అనే యువకుడు హత్యకు గురైనాడని పోలీసు అధికారులు తెలిపారు. కూతురు బర్త్ డే పార్టీలో రాకేష్ సాహ్ని అనే వ్యక్తి వీడియో గ్రాఫర్ సుశీల్ కుమార్ నోటిలో రివాల్వర్ పెట్టి కాల్పులు జరిపాడు. ఈ ఘటన బీహార్‌లోని దర్బంగా జిల్లా మఖ్‌నాహా గ్రామంలో అర్థరాత్రి జరిగిందని పోలీసు అధికారులు అంటున్నారు. ముఖ్ నాహా గ్రామానికి చెందిన రాకేష్ సాహ్ని అనే వ్యక్తి అతను నివాసం ఉంటున్న సొంత గ్రామంలో వీడియోగ్రాఫర్‌గా పనిచేస్తున్న సుశీల్ కుమార్‌ను హత్య చేశాడని పోలీసులు తెలిపారు.

ఆ సమయంలో రాకేష్ కు తెలిసిన కొందరు వీఐపీలు బర్త్ డే పార్టీలో ఉన్నారని తెలిసింది. దీంతో కోపోద్రిక్తుడైన రాకేష్ సహనం కోల్పోయి వీడియో గ్రాఫర్ సుశీల్ కుమార్‌ను అనరాని మాటలతో దూషించడమే కాకుండా అతన్ని చితకబాదేశాడని తెలిసింది. చివరకు సహనం కోల్పోయిన రాకేష్ వెంటనే జోబులో ఉన్న రివాల్వర్ తీసుకుని వీడియో గ్రాఫర్ సుశీల్ కుమార్ నోటి లో పెట్టి కాల్చేశాడు.సుశీల్‌ను వెంటనే దర్భంగా మెడికల్ కాలేజీ అండ్ హాస్పిటల్‌లో చేర్చారు,

అయితే అతను చికిత్స పొందుతున్న సుశీల్ కుమార్ చికిత్స విఫలమై మరణించాడని బీహార్ పోలీసు అధికారులు తెలిపారు. దీంతో ఆగ్రహించిన గ్రామస్తులు లెహ్రైసరాయ్ ప్రధాన రహదారిని దిగ్బంధించి నిందితుడు రాకేష్ ను అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు. దీంతో ఈ ప్రాంతంలో రెండు కిలోమీటర్ల పొడవునా వాహనాలు నిలిచిపోయి గంటల తరబడి ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. నిందితుడు రాకేష్ ను అరెస్టు చేసే వరకు సుశీల్ కుమార్ అంత్యక్రియలు జరపమని ఆందోళన కారులు పట్టుబట్టారు.
ఇరువైపులా కిలోమీటరు మేర వాహనాలు బారులు తీరడంతో ప్రజలు నానా ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఆ సమయంలో బేణిపూర్ సీనియర్ పోలీసు అధికారి సుమిత్ కుమార్ సంఘటనా స్థలానికి చేరుకుని ఆందోళనకారులను శాంతింపజేసి ట్రాఫిక్‌ను క్లియర్ చేశారు. వీడియో గ్రాఫర్ సుశీల్ కుమార్ ను రివాల్వర్ తో కాల్చి చంపేసిన రాకేష్ ప్రముఖ రాజకీయ నాయకుడి ముఖ్య అనుచరుడు అని, అతను ఓ పార్టీలో కీలక నాయకుడు అని స్థానిక మీడియా తెలిపింది.












Click it and Unblock the Notifications