girlfriend: నా బాయ్ ఫ్రెండ్, ఫ్రెండ్స్ కిడ్నాప్ చేసి గ్యాంగ్ రేప్ చేశారు, ప్రియురాలితో మైండ్ బ్లాక్ ?
రాత్రి తన ప్రియుడితో పాటు మరో నలుగురు యువకులు వచ్చిన తనను కారులో కిడ్నాప్ చేసి నిర్జన ప్రదేశంలోకి తీసుకెళ్లి తన మీద సామూహిక అత్యాచారం చేశారని ప్రియురాలు కేసు పెట్టింది. పోలీసుల విచారణలో దిమ్మతిరిగిపోయే విషయాలు బయటకు వచ్
చెన్నై/ కాంచీపురం: యువతి, యువకుడు ప్రేమించుకున్నారు. కుటుంబ సభ్యులకు దూరంగా ఉంటున్న యువతి చదువుకుంది. చదువు పూర్తి అయిన తరువాత యువతి ఉద్యోగం చేస్తోంది. ఉద్యోగం చేస్తున్న యువతి, మరో యువకుడు ప్రేమించుకున్నారు. ఉద్యోగం పూర్తి అయిన తరువాత కంపెనీలో నుంచి బయటకు వస్తున్న యువతి ఆమె ప్రియుడితో కలిసి హ్యాపీగా తిరిగింది. ప్రియుడిని పెళ్లి చేసుకోవాలని ప్రియురాలు డిసైడ్ అయ్యింది. రాత్రి తన ప్రియుడితో పాటు మరో నలుగురు యువకులు వచ్చిన తనను కారులో కిడ్నాప్ చేసి నిర్జన ప్రదేశంలోకి తీసుకెళ్లి తన మీద సామూహిక అత్యాచారం చేశారని ప్రియురాలు కేసు పెట్టింది. పోలీసులు యువతిని వైద్యపరీక్షలకు తరలించారు. పోలీసుల విచారణలో దిమ్మతిరిగిపోయే విషయాలు బయటకు వచ్చాయి.

హలో పోలీసు కంట్రోల్ రూమ్ ?
తమిళనాడులోని కాంచీపురం జిల్లాలోని సాలవాకం సమీపంలోని మంబక్కాం ప్రాంతం నుంచి పోలీసు కంట్రోల్ రూమ్ కు ఓ యువతి ఫోన్ చేసింది. అర్దరాత్రి 2 గంటల సమయంలో నలుగురు వ్యక్తులు వచ్చి తలుపులు తియ్యాలని చెప్పారని, తాను తలుపులు తీసిన వెంటనే తనను బెదిరించి కారులో కిడ్నాప్ చేశారని, తరువాత నిర్జన ప్రదేశంలోని ఎత్తుకెళ్లి తన మీద నలుగురు యువకులు గ్యాంగ్ రేప్ చేశారని ఆ యువతి బోరన విలపిపించింది. విషయం తెలుసుకున్న పోలీసులు యువతి చెప్పిన అడ్రస్ దగ్గరకు పరుగు తీశారు.

ప్రైవేట్ కంపెనీ ఉద్యోగి
కాంచీపురం పోలీసులు ఆ యువతిని రక్షించి చికిత్స నిమిత్తం చెంగల్‌పట్టు ప్రభుత్వాసుపత్రికి తరలించారు. యువతికి మెరుగైన చికిత్స అందించాలని అక్కడి డాక్టర్లకు పోలీసులు మనవి చేశారు. తరువాత పోలీసులు ఆ యువతిని విచారించారు. తాను పెరంబలూరు జిల్లా వేప్పంతట్ట పక్కన ఉన్న కలత్తూరు ప్రాంతానికి చెందిన యువతిని అని, తన వయసు 21 ఏళ్లు అని, మాది చాలా గొప్ప కుటుంబం అని యువతి పోలీసులకు చెప్పింది. చెన్నైలోని సైదాపేట్ లో తాను నివాసం ఉంటూ ఓ ప్రైవేట్ కంపెనీలో టెలీకాలర్‌గా (ఎంఎన్ సీ కంపెనీ)లో ఉద్యోగం చేస్తున్నానని ఆయువతి పోలీసులకు చెప్పింది.

మేడమ్ కు బాయ్ ఫ్రెండ్ ఉన్నాడు
తనను కిడ్నాప్ చేసి గ్యాంగ్ రేప్ చేసిన నలుగురు యువకుల్లో తన బాయ్ ఫ్రెండ్ సలీమ్ కూడా ఉన్నాడని ఆ యువతి చెప్పడంతో పోలీసులు హడలిపోయారు. పోలీసులు అనేక కోణాల్లో విచారణ చేశారు. ఉత్తర మేరూరు పక్కనే ఉన్న మలయంబాక్కం ప్రాంతానికి చెందిన సలీం, టెలీ కాలర్ గా ఉద్యోగం చేస్తున్న యువతి ప్రేమించుకున్నారని పోలీసుల విచారణలో వెలుగు చూసింది. పోలీసులు ఈ కేసును అనేక కోణాల్లో విచారణ చేశారు.

సీసీటీవీ కెమెరాల్లో
నలుగురు వ్యక్తులు తనను కారులో కిడ్నాప్ చేసి ఇక్కడికి తీసుకు వచ్చి గ్యాంగ్ రేప్ చేశారని యువతి కేసు పెట్టింది. పోలీసులు చెంగల్పట్టు జిల్లాలోని యువతిని గుర్తించిన పరిసర ప్రాంతంలోని సీసీటీవీ కెమెరాలను పరిశీలించారు. ఆ సమయంలో యువతి బాయ్ ఫ్రెండ్ సలీమ్ ద్విచక్రవాహనంపై ఒంటరిగా వెలుతున్నట్లు పోలీసులు గుర్తించారు. యువతి దగ్గర సలీమ్ ఫోన్ నెంబర్ తీసుకున్న పోలీసులు అతనికి ఫోన్ చేసి పోలీస్ స్టేషన్ కు పిలిపించారు. పోలీసులు సలీమ్ ను బెండ్ తీస్తే అసలు విషయం బయటకు వచ్చింది.

ప్రియురాలితో ఎంజాయ్ చెయ్యాలి అంతే... పెళ్లి మాత్రం ?
సలీమ్ ను పెళ్లి చేసుకోవాలని యువతి డిసైడ్ అయ్యింది. అయితే సలీమ్ మాత్రం అతని గర్ల్ ఫ్రెండ్ ను వాడుకుని వదిలేయాలని డిసైడ్ అయ్యారు. ఉద్యోగం పూర్తి అయిన తరువాత సలీమ్ ఆమె ప్రియుడు నిర్జనప్రదేశంలోకి వెళ్లి శారీరకంగా ఏకాంతంగా గడపడానికి అలవాటు చేసుకున్నారని పోలీసుల విచారణలో వెలుగు చూసింది. ప్రియుడు సలీమ్ కూడా పోలీసులు ఇదే మాట చెప్పాడు. ప్రియురాలితో అక్రమ సంబంధం పెట్టుకుని ఆమెతో ఎంజాయ్ చేసి వదిలేయాలని సలీమ్ ముందు నుంచి అనుకుంటున్నాడని వెలుగు చూసింది.

ప్రియురాలు కిలాడీ లేడీ..... ప్రియుడు మాత్రం ?
గర్ల్ ఫ్రెండ్ ను పెళ్లి చేసుకోవడానికి సలీమ్ సిద్దంగా లేడు. తనను పెళ్లి చేసుకోవాలని రెండు నెలల నుంచి ప్రియురాలు సలీమ్ మీద ఒత్తిడి చేస్తోందని పోలీసుల విచారణలో వెలుగు చూసింది. ఎప్పటిలాగే శనివారం రాత్రి ఏకాంతంగా కలుసుకోవడానికి యువతిని ఆమె ప్రియుడు సలీమ్ యథావిధిగా సాలవాక్కం సమీపంలోని మంబక్కం ప్రాంతానికి తీసుకెళ్లాడు. అక్కడ ఇద్దరూ రొమాన్స్ చేశారు. సలీమ్ కోరిక తీర్చిన తరువాత అతని ప్రియురాలు పెళ్లి చేసుకోవాలని ప్రియుడికి చెప్పింది.

ప్రియుడి మీద కోపంతో గ్యాంగ్ రేప్ కేసు పెట్టింది
పెళ్లి విషయంలో మళ్లీ ఇద్దరి మధ్య గొడవ జరిగింది. ప్రియురాలి పై దాడి చేసిన ఆమె ప్రియుడు సలీమ్ అక్కడి నుంచి బైక్ లో పరారయ్యాడు. తనను శారీరకంగా లొంగదీసుకుని ఎంజాయ్ చేసి తన జీవితం నాశనం చేసిన ప్రియుడు సలీమ్ మీద పగ తీర్చుకోవాలని ప్రియురాలు రగిలిపోయింది. వెంటనే కంట్రోల్ రూమ్ కు ఫోన్ చేసిన ప్రియురాలు తనను కిడ్నాప్ చేసి గ్యాంగ్ రేప్ చేశారని తప్పుడు ఫిర్యాదు చేసిందని పోలీసులు అన్నారు. కాంచీపురం, చెంగల్పట్టు పోలీసులు వివిద కోణాల్లో కేసు విచారణ చేస్తున్నారు. పెళ్లి చేసుకుంటానని మోసం చేసిన ప్రియుడిని జైలుకు పంపించాలని ప్రియురాలు గ్యాంగ్ రేప్ నాటకం ఆడిందని వెలుగు చూడటం తమిళనాడులో కలకలం రేపింది.
-
ఎన్టీఆర్ పాటకు స్టెప్పులేసిన సితార.. వైరల్ వీడియో -
నక్కతోక తొక్కిన "అస్సాం బ్యూటీ".. నందమూరి హీరోతో స్టెప్పులేసే ఛాన్స్ !! -
ఏపీలో స్థానిక సంస్థల పునర్విభజన- మారిపోతున్న ముఖచిత్రాలు -
PNGకి మారకపోతే LPG సిలెండర్ కట్..! కేంద్రం డెడ్ లైన్..! -
చమురు, గ్యాస్ పరిస్ధితి ఇదీ- అఖిలపక్ష భేటీలో తేల్చేసిన కేంద్రం..! -
నన్ను ఆ డైరెక్టర్ ఎక్కడెక్కడో పట్టుకున్నాడు.. కానీ అమ్మానాన్న సర్దుకుపోమన్నారు !! -
Iran: ట్రంప్ కు ఇరాన్ దిమ్మతిరిగే షాక్..! సీజ్ ఫైర్ కు కఠిన షరతులివే..! -
ఇంధన కొరత వేళ.. తెలంగాణ ఆర్టీసీ సంచలన నిర్ణయం -
‘దీదీ’ రాజీనామా.. ఎన్నికల వేళ మమత సంచలన నిర్ణయం! -
ఏపీలో తెలంగాణ సీఎం.. లోకేష్ బంపర్ ఆఫర్ -
అంతా అయిపోయింది- డొనాల్డ్ ట్రంప్ -
Red Alert: వడగళ్ల వాన, రాబోయే రెండు గంటల్లో భారీ వర్షం












Click it and Unblock the Notifications