నెల రోజులు ఎంజాయ్ చేసిన గర్ల్ ఫ్రెండ్, కోర్టులో నాకు అన్నతో సమానం అని చెప్పింది !

తిరువనంతపురం: ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్ ద్వారా పరిచయం, వాట్సాప్ నంబర్ షేర్ చేసుకోవడం, పరిచయం ప్రేమగా, ప్రేమ పెళ్లిగా మారిన తరువాత వివాహాలు చేసుకున్న సంఘటనలు మన ముందు ఎన్నో ఉన్నాయి. అదేవిధంగా ఓ జంట ప్రేమలో పడి ఇంటి నుంచి పారిపోయారు. వారు దాదాపు ఒక నెల పాటు కలిసి ఉన్నారు. అయితే తన కుమార్తెను అక్రమంగా అరెస్టు చేశారంటూ తండ్రి హెబియస్ కార్పస్ పిటిషన్ దాఖలు చేశారు.

దీంతో పోలీసులు వారిద్దరినీ గుర్తించి పట్టుకుని కోర్టులో హాజరుపరిచారు. ఈసారి ప్రియురాలి మాటలకు ప్రేమికుడు షాక్ అయ్యాడు. అతను నాకు సోదరుడు లాంటివాడు, నేను అతనిని ఎప్పుడూ ప్రేమించలేదు. అతన్ని తాను పెళ్లి చేసుకోలేనని కోర్టులో తేల్చి చెప్పింది. ప్రియురాలి మాటలు విన్న ప్రేమికుడు కోర్టు ఆవరణంలోనే చేయి కోసుకున్న ఘటన కేరళ హైకోర్టులో చోటుచేసుకుంది.

 boyfriend

త్రిసూర్ జిల్లాకు చెందిన 31 ఏళ్ల విష్ణు అదే జిల్లాకు చెందిన 23 ఏళ్ల యువతితో ప్రేమలో ఉన్నాడు. ఒక్కసారిగా ఈ ఇద్దరు పెళ్లి చేసుకోవాలని ఇంటి నుంచి పారిపోయి అదృశ్యమయ్యారు. యువతిని పట్టుకుని రావాలని ఆమె కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కొద్దిరోజుల తర్వాత తమ కూతురు విష్ణుతో కలిసి పారిపోయిన విషయం వెలుగులోకి వచ్చింది. దీంతో యువతి తండ్రి కోర్టులో హెబియస్ కార్పస్ పిటిషన్ వేశారు.

తమ కుమార్తెను అక్రమంగా నిర్బంధించారు. తన కుమార్తెను వెంటనే విష్ణు చెరలోని విడుదల చేయాలని ఆమె తండ్రి కోర్టును కోరారు. పోలీసులు నెల రోజుల పాటు గాలించి రహస్య ప్రాంతంలో తలదాచుకున్న విష్ణుతో పాటు అతని ప్రియురాలిని పట్టుకుని వచ్చి కేరళ హైకోర్టుముందు హాజరుపరిచారు. కేరళ హైకోర్టు డివిజన్ బెంచ్‌లోని న్యాయమూర్తులు సి జయచంద్రన్, అను శివరామన్ ఈ పిటిషన్‌ను విచారించారు.

కోర్టు విచారణలో యువతి కీలక వాంగ్మూలం ఇచ్చింది. విష్ణువుని తాను పెళ్లి చేసుకోలేను. అతను నాకు సోదరుడు లాంటివాడు. నేనెప్పుడూ విష్ణుని ప్రేమించలేదని అతని ప్రియురాలు కోర్టులో చెప్పింది.
నెల రోజులుగా అతని దగ్గర ఎలా ఉన్నారని ఆమెను కోర్టులో ప్రశ్నించింది. దీనికి ఆ యువతి సమాధానమిస్తూ విష్ణు నన్ను బెదిరించాడని చెప్పింది.

ఇక్కడి నుంచి నువ్వు వెళితే కత్తితో పొడిచి చంపేస్తానని విష్ణు తనను బెదిరించాడని ఆ యువతి కోర్టులో చెప్పింది. నా తల్లిదండ్రులు లేకుండా నేను జీవించలేను. నేను నా తల్లిదండ్రులతో కలిసి వెలుతానని ఆ యువతి కోర్టుకు తెలిపింది. ఇది విని విష్ణు షాక్ అయ్యాడు. అతను ప్రేమించిన యువతి కోర్టులో రివర్స్ తిరగడం, ఆమె వెళ్లిపోతుందని బాధపడ్డాడు. ప్రియురాలిని దక్కించుకోవడానికి విష్ణు అనేక ప్రయత్నాలు చేశాడు.

 boyfriend

ప్రియురాలు మోసం చేసిందని ఆవేశంలొ కోర్టు ఆవరణలోనే విష్ణు చేయ్యి కోసుకున్నాడు. వెంటనే పోలీసులు జోక్యం చేసుకుని తర్వాత విష్ణును ఆసుపత్రిలో చేర్చారు. విష్ణుకు సంబంధించిన మరింత సమాచారం ఇప్పుడు వెల్లడైంది. విష్ణుకు అప్పటికే పెళ్లయింది. మొదటి భార్యకు విడాకులు ఇచ్చి ఆ యువతిని పెళ్లి చేసుకోవాలని అనుకున్నాడు. అయితే మొదటి భార్య విడాకులకు నిరాకరించిందని పోలీసుల విచారణలో వెలుగు చూసింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+