మహారాష్ట్రలో కుప్పకూలిన హెలికాప్టర్... పైలట్‌తో సహా ముగ్గురు సజీవ దహనం..
మహారాష్ట్రలో ఓ హెలికాప్టర్ కుప్పకూలింది. ఈ ఘటనలో పైలట్‌తో సహా ముగ్గురు వ్యక్తులు సజీవ దహనమయ్యారు. మహారాష్ట్ర లోని పూణె జిల్లాలో బుధవారం ఉదయం ఈ ఘటన జరిగింది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి. జిల్లాకు సమీపంలోని గోల్ఫ్ కోర్స్ వద్ద ఉన్న హెలిప్యాడ్ నుంచి హెలికాప్టర్ ముగ్గురు వ్యక్తులతో బయలుదేరింది. ఈ నేపథ్యంలో చాపర్ బవ్‌ధాన్ ప్రాంతంలోని కొండ ప్రాంతం వద్దకు రాగానే హెలికాఫ్టర్ ఉదయం 6.45కు ఒక్కసారిగా కుప్పకూలిపోయింది. వెంటనే హెలికాప్టర్‌లో మంటలు చెలరేగాయి. దీంతో హెలికాప్టర్‌లో ఉన్న పైలెట్‌తో సహా ముగ్గురు వ్యక్తులు ఆ మంటల్లో చిక్కుకుని సజీవ దహనమయ్యారు. అయితే, ఈ ప్రమాదానికిగల కారణాలు ఇంకా తెలియాల్సి ఉంది. అలాగే, ఆ హెలికాఫ్టర్ ప్రయివేట్‌దా లేక ప్రభుత్వానిదా.? అని తెలియాల్సి ఉంది.
#WATCH | Pune (Maharashtra) helicopter crash | Chief Fire Officer Devendra Prabhakar Potphode says, "...We got the information that there is a chopper crash very close to Oxford helipad. Our fire teams from the nearest fire stations responded...We also summoned PMRDA fire… pic.twitter.com/4ApOZ2Vutm
— ANI (@ANI) October 2, 2024
పుణేలో ఉదయం 6.45 నిమిషాలకు హెలికాఫ్టర్ కుప్పకూలింది. వెంటనే గమనించిన స్థానికులు ఈ విషయాన్ని అధికారులకు చేరవేశారు. సమాచారం అందుకున్న పోలీసులు హుటాహుటినా సంఘటనా స్థలానికి చేరుకున్నారు. హింజేవాడి పోలీస్ స్టేషన్ సీనియర్ ఇన్‌స్పెక్టర్ కన్హయ్య థోరట్ సంఘటనా స్థలాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. ప్రమాదానికి గల కారణాలు ఇంకా తెలియాల్సి ఉందన్నారు.

హెలికాప్టర్ నుంచి వస్తున్న మంటలు అదుపులోకి రాకపోవడంతో పూణే మునిసిపల్ కార్పొరేషన్, పూణే మెట్రోపాలిటన్ రీజియన్ డెవలప్‌మెంట్ అథారిటీ సమాచారం అందజేసినట్లు వివరించారు. నాలుగు ఫైరింజన్ల సంఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తీసుకొచ్చినట్లు అధికారులు తెలిపారు. అయితే, దట్టమైన పొగమంచు కారణంగా ఈ ప్రమాదం జరిగి ఉండవచ్చని పోలీసులు, అధికారులు భావిస్తున్నారు. మృతదేహాలను వెలికితీసే పనిలో పోలీసులు ఉన్నట్లు సమాచారం.
#WATCH | Maharashtra: Visuals from the spot in Pune where a private chopper crashed soon after it took off, claiming 3 lives. Police and Fire Department teams are present at the spot.
— ANI (@ANI) October 2, 2024
DCP Pimpri-Chinchwad says that a private helicopter of Heritage Aviation took off from Oxford… pic.twitter.com/aqvFIn2G47












Click it and Unblock the Notifications