హీరో దర్శన్ కు షాక్, ఇంటి భోజనం, మంచం, పుస్తకాలకు నో, హైకోర్టులో పిటిషన్ !

గత 20 రోజులుగా పరప్ప అగ్రహార సెంట్రల్ జైలులో భోజనం చేస్తున్న శ్యాండిల్ వుడ్ ఛాలెంజింగ్ హీరో దర్శన్‌కు వాంతులు, విరేచనాలు కావడంతో పాటు శరీర బరువు కూడా తగ్గిందని సమాచారం. దీంతో ఇంటి భోజనం కోసం హీరో దర్శన్ కోర్టులో దరఖాస్తు చేయగా ఆ పిటిషన్ విచారణ జూన్ 18వ తేదీకి వాయిదా పడింది. దీంతో నటుడు దర్శన్ మరో వారం రోజులు ఇంట్లో భోజనం చేసే అవకాశం ఉండదు.

కన్నడ

నటుడు దర్శన్ చిత్రదుర్గాకు చెందిన రేణుకాస్వామి హత్య కేసులో బెంగళూరు నగర శివార్లలోని పరప్పన అగ్రహార సెంట్రల్ జైలులో గత 20 రోజుల పాటు అండర్ ట్రయల్ ఖైదీగా ఉన్నారు. అయితే జైలు ఆహారం తిన్న తర్వాత విరేచనాలు, వాంతులు కావడంతో బరువు తగ్గారని, ఇంటి నుంచి భోజనం తెచ్చుకునేందుకు అనుమతి ఇవ్వాలని కోర్టుకు అర్జీ సమర్పించారు. ఈ పిటిషన్‌ను హైకోర్టు బుదవారం విచారణకు స్వీకరించింది.

The High Court adjourned the hearing of the petition filed on the matter of providing home meals to hero Darshan

జైలు మాన్యువల్‌లో ఈ సమాచారాన్ని ఉంచాలని సంబంధిత అధికారులకు నోటీసు జారీ చేసిన కర్ణాటక హైకోర్టు పిటిషన్ విచారణను జూన్ 18వ తేదీకి వాయిదా వేసింది. దీంతో నటుడు దర్శన్ అతని ఇంట్లో భోజనం చేసే అవకాశం మరో రోజు వాయిదా పడింది.

నటుడు దర్శన్‌కు ఇంటి నుంచి ఆహారం, మంచం, పుస్తకాలు ఇవ్వాలని నటుడు దర్శన్‌ తరపు న్యాయవాదులు కర్ణాటక హైకోర్టులో రిట్‌ పిటిషన్‌ దాఖలు చేశారు.

ఈ పిటిషన్‌ను హైకోర్టు విచారించింది. హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఎస్.ఆర్. కృష్ణకుమార్‌తో కూడిన సింగిల్‌ బెంచ్ ధర్మాసనం హీరో దర్శన్‌ పిటిషన్ ను విచారణ చేశారు. హీరో దర్శన్ తరఫున సీనియర్‌ న్యాయవాది కేఎన్‌ ఫణీంద్ర వాదిస్తూ జైలు నిబంధనలలో ఇంటి భోజనం తినడానికి అవకాశం ఉందని అన్నారు. అయితే నటుడు దర్శన్‌కు ఇంటి భోజనానికి అనుమతి లేదని జైలు అధికారులు తెలిపారని దర్శన్ న్యాయవాది కోర్టుకు చెప్పారు.

The High Court adjourned the hearing of the petition filed on the matter of providing home meals to hero Darshan

దర్శన్ తరఫు న్యాయవాది వాదనను విన్న న్యాయమూర్తి జైలు మాన్యువల్‌లో ఇంటి భోజనం గురించి నిబంధన ఉందా? అని జైలు అధికారులను ప్రశ్నించారు. దీనిపై విచారణ అధికారులు, జైలు అధికారులు తగిన సమాధానం ఇవ్వాలని వారికి కర్ణాటక హైకోర్టు నోటీసు జారీ చేసింది. అంతేకాకుండా నటుడు దర్శన్‌కు ఇంటి భోజనం తీసుకురావడంపై మీకు ఏమైనా అభ్యంతరం ఉంటే కోర్టుకు తెలియజేయాలని ఎస్పీపీ ప్రసన్నకుమార్‌ను హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. జైలులో కాలం గడిపేందుకు ఇంట్లో వండిన భోజనం, మెత్తగా శుభ్రంగా ఉండే పడక, తనకు ఇష్టమైన పుస్తకాలు తెచ్చుకుని చదివే అవకాశం వస్తుందని ఆశించిన నటుడు దర్శన్ తీవ్ర నిరాశకు గురయ్యాడు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+