మైనర్ అమ్మాయిపై లైంగిక దాడి కేసులో మాజీ సీఎంకు బిగ్ రిలీఫ్, హైకోర్టు ఆదేశం
మైనర్‌పై లైంగిక వేధింపులకు పాల్పడ్డారని ఆరోపణలు ఎదుర్కొంటున్న బీజేపీ సీనియర్ నాయకుడు, కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి బీఎస్. యడ్యూరప్పను అరెస్ట్ చేయరాదంటూ సీఐడీ అధికారులకు మధ్యంతర ఆదేశాలు జారీ చేసిన కర్ణాటక హైకోర్టు ఆ ఆదేశాలను మరో ఒక వారం పాటు పొడిగించింది.హైకోర్టు ఆదేశాలతో బీఎస్. యడియూరప్ప తాత్కాలికంగా ఊపిరిపీల్చుకున్నారు.
ఈ కేసులో తన మీద నమోదు చేసిన ఎఫ్‌ఐఆర్‌ను రద్దు చేసి ముందస్తు బెయిల్ మంజూరు చేయాలని మాజీ సీఎం యాడియూరప్ప దాఖలు చేసిన రెండు వేర్వేరు పిటిషన్లను హైకోర్టు న్యాయమూర్తి శుక్రవారం జస్టిస్ కృష్ణ ఎస్.దీక్షిత్ ధర్మాసనం ముందు విచారణకు వచ్చాయి.సోమవారం నుంచి మరో బెంచ్ (రోస్టర్ మార్పు) ముందు ఈ పిటిషన్లు విచారణకు రానున్నందున బెంచ్ విచారణను వారం రోజులపాటు వాయిదా వేసింది.

అప్పటి వరకు మాజీ సీఎం యడ్యూరప్పను అరెస్టు చేయవద్దని సీఐడీకు కర్ణాటక హైకోర్టు ఆదేశించింది. మాజీ సీఎం యడ్యూరప్ప వ్యక్తిగత సహాయకుడు కోర్టుకు హాజరుకాకుండా మినహాయింపు ఇస్తూ గతంలో ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వులను కోర్టు పొడిగించింది.మైనర్ పై లైంగిక వేధింపుల ఆరోపణపై బెంగళూరు సిటీలోని సదాశివనగర్ పోలీస్ స్టేషన్‌లో ఇదే ఏడాది మార్చి 14వ తేదీన మాజీ సీఎం బీఎస్. యడ్యూరప్పపై పోక్సో (లైంగిక నేరాల నుంచి పిల్లల రక్షణ) చట్టం కింద ఎఫ్‌ఐఆర్ నమోదైంది.
దీంతో కర్ణాటక ప్రభుత్వం ఈ కేసు దర్యాప్తును సీఐడీకి చెందిన సిట్‌కి బదిలీ చేసింది. ప్రత్యేక పోక్సో కోర్టు సమన్లు జారీ చేసిన తర్వాత మాజీ సీఎం బీఎస్. యడ్యూరప్ప ముందస్తు బెయిల్‌ను కోరుతున్నారు. లోక్ సభ ఎన్నికలకు ముందు కర్ణాటక మాజీ సీఎం బీఎస్ యడియూరప్ప మీద కేసు నమోదు అయ్యింది. అయితే రాజకీయ కక్షలతో మాజీ సీఎం యడియూరప్ప మీద కేసు నమోదు అయ్యిందని కొందరు బీజేపీ నాయకులు ఆరోపించారు.












Click it and Unblock the Notifications