అక్రమ సంబందం, భార్యకు ఆ రెండు కట్ చేస్తే ?, ఐటీ హబ్ రోడ్ల మీద భార్యను వెంటాడి వెంటాడి!
వివాహం చేసుకున్న దంపతులు కొన్ని సంవత్సరాలు సంతోషంగా కాపురం చేశారు. భర్త ఎక్కువగా బయట ఊర్లకు తిరుగుతున్నారు. ఇదే సమయంలో భార్యకు అక్రమ సంబంధం ఉందని భర్త రగిలిపోయాడు. మ్యాటర్ లీక్ అయ్యింది భార్య ఆమె భర్తకు దూరం అయ్యింది. తనను వదిలేసి బయట పీజీలో ఉంటూ ఉద్యోగం చేస్తున్న భార్యకు రెండు కోసేస్తే పీడపోతుందని ఆమెను వెంటాడి వెంటాడి నరికేశాడు.
భార్యను నడిరోడ్డుపై వెంటాడి వెంటాడి కత్తితో దారుణంగా దాడి చేసిన భర్తను బెంగళూరు సిటీలోని జీవన్ భీమా నగర్ పోలీసులు అరెస్ట్ చేశారు. బెంగళూరులోని ఆర్ టీ నగర్‌కు చెందిన నిగర్ (28) అనే భార్య మీద దాడి చేసిన ఆమె భర్త షేక్ ముజీబ్ అలియాస్ ముజీబ్ ను (35)ని అరెస్టు చేశామని బెంగళూరు పోలీసు అధికారులు తెలిపారు. రాత్రి 7 గంటల ప్రాంతంలో మురగేష్‌పాళ్యలోని విండ్ టన్నెల్ రోడ్డులోని ఒమేగా హెల్త్ కేర్ వెనుక భార్య నిగమ్ ను హత్య చెయ్యడానికి ముజీబ్ ప్రయత్నించాడని పోలీసు అధికారులు తెలిపారు.

నిందితులు షేక్ ముజీబ్, నిగర్ లకు ఆరేళ్ల క్రితం వివాహమైంది. ఆర్ టీ నగర్‌లోని ఓ ఇంటిని అద్దెకు తీసుకుని ముజీబ్, నిగర్ దంపతులు నివాసం ఉంటున్నారు. వృత్తిరీత్యా డ్రైవర్ అయిన షేక్ ముజీబ్ ఎక్కువగా బయట ఊర్లలో తిరుగుతున్నాడు. ఉద్యోగం చేస్తున్న ముజీబ్ భార్య నిగర్ బయటకు వెళ్లి వస్తోంది. ఇదే సమయంలో సలీం అనే వ్యక్తితో ముజీబ్ భార్య నిగర్ క్లోజ్ గా ఉండటం మొదలుపెట్టింది. భర్త ముజీబ్ బయట ఊర్లకు వెళ్లిన సమయంలో నిగర్ ఆమె బాయ్ ఫ్రెండ్ సలీంతో బయట తిరగడం మొదలుపెట్టింది.
నాభార్య నిగర్ ఆమె బాయ్ ఫ్రెండ్ సలీంతో అక్రమ సంబంధం పెట్టుకుందని ముజీబ్ అనుమానించాడు. కొంతకాలానికి భార్య నిగర్ కు, సలీంకు అక్రమ సంబంధం ఉందని తెలుసుకున్న ముజీబ రగిలిపోయాడు. ఈ విషయమై ఇంట్లో నిగర్, ముజీబ్ దంపతుల మధ్య తరచూ గొడవలు జరుగుతుండేవి. దీంతో ముజీబ్ భార్య నిగర్ భర్త నుంచి విడిపోయి గత ఆరు నెలలుగా జీవన్ భీమానగర్ లో పేయింగ్ గెస్ట్ (పీజీ)లో నివాసం ఉంటోంది. భర్త ముజీబ్ కు దూరం అయిన నిగర్ బెంగళూరులోనే ఉబర్ కంపెనీలో పని చేస్తోంది.
భర్త ముజీబ్ కు దూరంగా ఉంటూ ఉద్యోగం చేస్తున్న నిగర్ ఆమె బాయ్ ఫ్రెండ్ సలీంతో కలిసి తిరగడం మొదలుపెట్టిందని తెలిసింది. భార్య నిగర్ విడిగా నివసిస్తున్నప్పటికీ ఆమె భర్త షేక్ ముజీబ్ ఆమెపై కోపంగా ఉండటమే కాకుండా ఆమె మీద పగ పెంచుకున్నాడు. తనను వదిలేసిన తన భార్య నిగమ్ ఆమె బాయ్ ఫ్రెండ్ సలీంతో తిరుగుతోందని, ఉద్యోగం చేస్తూ ఆ డబ్బు మొత్తం ప్రియుడికి ఇస్తోందని ముజీబ్ రగిలిపోయాడు.

భార్య నిగర్ ఉంటున్న పేయింగ్ గెస్ట్ వద్దకు రాత్రి ముజీబ్ వెళ్లాడు. తన భార్య నిగర్ లోపల ఉందా అంటూ పీజీ నిర్వహకులను అడిగాడు. భార్య ఇంకా రాకపోవడంతో పేయింగ్ గెస్ట్ బయటకు వచ్చిన ముజీబ్ అక్కడే వేచి ఉన్నాడు. రాత్రి 7 గంటల సమయంలో పేయింగ్ గెస్ట్ వద్దకు వచ్చిన భార్య నిగర్ ను చూసిన షేక్ ముజీబ్ ఒక్కసారిగా ఆమెపై కత్తితో దాడి చేశాడు. భర్త ముజబీ్ దాడి చెయ్యడంతో భయపడిపోయిన నిగర్ రోడ్డు మీద పరుగు తీసింది.
రోడ్డు మీద పరుగు తీస్తున్న నిగర్ మీద దాడి చేసిన ముజీబ్ ఆమెను కిందకు పడేసి ఆమె రెండు చేతులకు ఉన్న వేళ్లు కోసేయాలని ప్రయత్నించాడు. భర్త ముజీబ్ దాడిలో తీవ్రంగా గాయపడిన నిగర్ రక్తపు మడుగులో పడిపోవడంతో స్థానికులు ఆమెను సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. నిగర్ మీద హత్యాయత్నం జరగడంతో జీవన్ భీమా నగర్ పోలీస్ స్టేషన్‌లో బాధితురాలి ఫిర్యాదు మేరకు హత్యాయత్నం కేసు నమోదు చేసి నిందితుడు ముజీబ్ ను అరెస్టు చేసినట్లు బెంగళూరు పోలీసు అధికారులు తెలిపారు.
నేను ఉద్యోగం చేస్తున్నానని, నేను నా స్వంత సంపాదనతో జీవిస్తున్నానని నిగర్ పోలీసులకు చెప్పినట్లు తెలిసింది. దీంతో కోపోద్రిక్తుడైన నిందితుడు ముజీబ్ ఉద్యోగం చేస్తున్న తన బార్య నిగర్ తనను నిర్లక్షం చేస్తోందని, ఆమె చేతి వేళ్లు నరికివేయాలని నిర్ణయించుకున్నాడు. తనకు చేతికి వేళ్లు ఉంటే ఉద్యోగం చెయ్యడానికి వీలు ఉంటుందని, ఆ చేతి వేళ్లు లేకుంటే తాను కంప్యూటర్ ఆపరేట్ చెయ్యలేనని తన భర్త తన రెండు చేతులు వేళ్ల నరికేయడానికి ప్రయత్నించాడని బాధితురాలు పోలీసులకు చెప్పింది.
రెండు చేతులకు వేళ్లు లేకుంటే నేను చెప్పింది విని ఇంట్లోనే ఉండిపోతుందని తన భర్త ముజీబ్ తనకు చాలా సార్లు చెప్పాడని, అందుకే నడిరోడ్డులో తన రెండు చేతుల వేళ్లు నరికేయడానికి అతను ప్రయత్నించాడని, తన చేతుల మీద రాయితో దాడి చేశాడని బాధితురాలు నిగర్ పోలీసులకు చెప్పింది. నిందితుడు ముజీబ్ అతని భార్య చేతులు, చేతి వేళ్లపై దాడి చెయ్యడమే కాకుండా ఆమె శరీరంలోని దాదాపు 20 భాగాలపై దాడి చేశాడని బెంగళూరు పోలీసులు తెలిపారు.
-
'ఆ ఒక్క కండీషన్ తో స్టార్ హీరోతో నిజంగానే శోభనం'.. హీరోయిన్ సంచలనం..!! -
అల్లు అర్జున్ "పుష్ప - 3"లో స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ భార్య.. -
హిట్ కొట్టాడురా సామీ!.. మిస్టరీ థ్రిల్లర్ అదిరిపోయింది..! -
ఓటీటీలోకి పవన్ కల్యాణ్ 'ఉస్తాద్ భగత్ సింగ్'.. ఆ రోజు నుంచే స్ట్రీమింగ్..? -
ఈ సినిమా చూస్తే ఈఎంఐల జోలికే పోరు సామి! -
వంట గ్యాస్ బుక్ చేసినా రావటం లేదా, ఇలా చేయండి.. వెంటనే..!! -
తిరుమలకు వెళ్లేవారికి గుడ్ న్యూస్, ఇక నేరుగా...సులభంగా..!! -
ప్రభాస్ ఫాలో అవుతున్న ఏకైక తెలుగు హీరో ఎవరో తెలుసా..? -
ఆసియాలోనే అతిపెద్ద, ప్రపంచంలో నాలుగో అతిపెద్ద విమానాశ్రయాన్ని ప్రారంభించనున్న ప్రధాని మోదీ -
ఏపీలో పెరగనున్న అసెంబ్లీ సీట్లు, జిల్లాల వారీ జాబితా - కలిసొచ్చేదెవరికి..!! -
కోర్టు బ్యూటీ శ్రీదేవీ "బ్యాండ్ మేళం" తో మళ్లీ హిట్ కొట్టేసిందయ్యో !!! -
Holidays: వరుసగా మూడు రోజులు విద్యాసంస్థలు, బ్యాంకులు క్లోజ్












Click it and Unblock the Notifications