క్లోజ్ ఫ్రెండ్ భార్యతో రొమాన్స్, క్లోజ్ అప్ లోకి వెళ్లి కథ క్లోజ్ చేసిన భర్త, రొమ్ము చీల్చి !

చెన్నై: ఒకే ప్రాంతంలో ఇద్దరు యువకులు నివాసం ఉంటున్నారు. ఇద్దరికి దాదాపు ఒకే వయసు. ఇద్దరికి ఇప్పుడిప్పుడే మూతిమీద మీసాలు వస్తున్నాయి. ఓ యువకుడికి వివాహం అయ్యింది. స్నేహితుడికి ఇంటికి వెళ్లి వస్తున్న యువకుడు అతని భార్యను లైన్ లో పెట్టాడు. ఫ్రెండ్ భార్యతో రొమాన్స్ చేస్తున్న యువకుడు పిచ్చపాటిగా ఎంజాయ్ చేశాడు. మొగుడికి మండిపోవడంతో క్లోజప్ లో అతని ఫ్రెండ్ రొమ్ము చీల్చి పైలోకాలకు పంపించేయడం కలకలం రేపింది.

చెన్నై సిటీలోని పల్లవన్ రోడ్ లోని గాంధీనగర్‌ లో లోకేష్ (26) అనే యువకుడు నివాసం ఉంటున్నాడు. లోకేష్ చూడటానికి అమాయకుడిలా ఉంటాడని కాని ఇతని మీద చెన్నైలోని పలు పోలీస్ స్టేషన్లలో గంజాయి విక్రయిస్తున్నాడని, దాడులు చేస్తున్నాడని, రౌడీమామూళ్లు వసూలు చేస్తున్నాడని తదితర క్రిమినల్ కేసులు నమోదు అయ్యాయి. ఇప్పటికే లోకేష్ చాలాసార్లు జైలుకు వెళ్లి వచ్చాడు.

 illeagalaffair

లోకేష్ అతని కంటే వయసులో పెద్దది అయిన సత్యాను లైన్ లో పెట్టి ఆమెను ప్రేమించాడు. తరువాత లోకేష్ కు సత్యాకు వివాహం అయ్యింది. భార్య సత్యా, ఇద్దరు పిల్లలతో కలిసి లోకేష్ నివాసం ఉంటున్నాడు. లోకేష్ నివాసం ఉంటున్న ప్రాంతానికి చెందిన పాల్‌రాజ్‌(25), లోకేష్‌ చిన్నప్పటి నుంచి సన్నిహితులు. ప్రతిరోజు రాత్రి పూట కలుస్తున్న లోకేష్, పాల్ రాజ్ మద్యం తాగడం, గంజాయి సేవించడం చేస్తున్నారు. చిన్పప్పటి నుంచి లోకేష్, పాల్ రాజ్ మంచి స్నేహితులుగా ఆ ప్రాంతంలో గుర్తింపు తెచ్చుకున్నారు.

లోకేష్ ఇంటికి పాల్ రాజ్ తరచూ వెళ్లివస్తుంటాడు. ఇదే సమయంలో లోకేష్ భార్య సత్యా(29)తో పాల్ రాజుకు సన్నిహిత స్నేహం ఏర్పడి అది కాస్తా అక్రమ సంబంధానికి దారితీసింది. లోకేష్ కంటే అతని భార్య సత్యా వయసులో మూడు సంవత్సరాలు పెద్దది. ఇప్పుడు ఇంటికి వచ్చి వెలుతున్న భర్త లోకేష్ స్నేహితుడు పాల్ రాజ్ ను లైన్ లో పెట్టుకున్న సత్యా అతనికి స్వర్గం చూపించడం మొదలుపెట్టింది.

గత ఏడాది కాలంగా లోకేష్ భార్య సత్యా, పాల్ రాజ్ అక్రమ సంబంధం పెట్టుకుని ఎంజాయ్ చేస్తున్నారు. భార్య సత్యా, ఫ్రెండ్ పాల్ రాజ్ రిలేషన్‌షిప్‌లో ఉన్నారనే విషయం తెలుసుకున్న లోకేష్ రగిలిపోయాడు. అసలే నేరాలు చేసి రౌడీషీటర్లతో లింక్ పెట్టుకున్న లోకేష్ అతని భార్య సత్యాను, స్నేహితుడు పాల్ రాజ్ ను ఇప్పటికే పలుమార్లు మందలించి అక్రమ సంబంధం మానుకోవాలని, లేదంటే ఇద్దరిని చంపేస్తానని హెచ్చరించాడు.

 illeagalaffair1

అయితే భార్య సత్యా కాని, స్నేహితుడు పాల్ రాజ్ కాని పద్దతి మార్చుకోకుండా లోకేష్ లేని సమయంలో ఇద్దరూ కలుస్తూ వారి కోరికలు తీర్చుకుంటున్నారు. చెప్పినా మాట వినలేదని కోపోద్రిక్తుడైన లోకేశ్ ఈనెల 7వ తేదీ రాత్రి ఇంటికి వెలుతున్న పాల్ రాజ్ ను కత్తితో పొడిచాడు. పాల్ రాజ్ రొమ్ము చీల్చడానికి ప్రయత్నించడంతో అతను కేకలు వెయ్యడంతో లోకేష్ అక్కడి నుంచి తప్పించుకుని పారిపోయాడు. పాల్ రాజ్ ను కత్తితో పొడిచి హత్య చేసేందుకు ప్రయత్నించిన లోకేష్ ప్లాన్ అప్పుడు రివర్స్ అయ్యింది.

ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన పాల్‌రాజ్‌ను అతని బంధువులు రక్షించి చికిత్స నిమిత్తం చెన్నైలోని రాజీవ్‌గాంధీ ప్రభుత్వాసుపత్రికి తరలించారు. అక్కడ వైద్యులు పాల్‌రాజ్‌కు ఆపరేషన్ చేశారు. పాల్‌రాజ్ సోదరి కనిమొళి తిరువల్లికేణి పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేయడంతో పోలీసులు లోకేష్ మీద హత్యాయత్నం కేసు నమోదు చేసి లోకేష్‌ను అరెస్ట్ చేసి జైలుకు పంపించారు.

ఇంటెన్సివ్‌ కేర్‌ యూనిట్‌లో (ఐసీయూ)లో చికిత్స పొందుతున్న పాల్‌రాజ్‌ చికిత్స విఫలమై బుధవారం రాత్రి మృతి చెందాడు. దీంతో తిరువల్లికేణి పోలీసులు హత్యాయత్నం కేసును హత్య కేసుగా నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. స్నేహితుడి ఇంటికి వెళ్లి వస్తూ అతని భార్యతో అక్రమ సంబంధం పెట్టుకున్న పాల్ రాజ్ హత్యకు గురి కావడంతో ఆ ప్రాంతంలోని ప్రజలు షాక్ అయ్యారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+