Wife: భార్య అన్న కొడుకును కిడ్నాప్ చేశాడు, ఇంట్లో కట్టేసి గ్యాస్ సిలిండర్లు లీక్ చేసి ?, హైటెన్షన్ తో ప్రజలు ?

భార్య పుట్టింటికి వెళ్లిపోవడంతో రగిలిపోయిన భర్త అతని భార్య అన్న కొడుకును కిడ్నాప్ చేసి అతని ఇంటికి పిలుచుకుని వెళ్లి లోపల బాలుడిని కట్టేసి డోర్ లాక్ చేసి గ్యాస్ సిలిండర్లు లీక్ చేసి ఇంటిని పేల్చేస్తానని భర్త బెదిరించాడు.

చెన్నై/క్రిష్ణగిరి: దంపతులు కొంతకాలం మాత్రమే సంతోషంగా కాపురం చేశారు. ఓ విషయంలో దంపతుల మధ్య గొడవలు మొదలైనాయి. పెద్దలు పంచాయితీలు చేసినా దంపతుల మధ్య గొడవలు అలాగే జరుగుతున్నాయి. రాత్రి ఇంటికి వెళ్లిన భర్త అతని భార్యను పట్టుకుని చితకబాదేశాడు. భార్యకు తీవ్రగాయాలు కావడంతో ఆసుపత్రిలో చికిత్స చేయించి అటు నుంచి అటే పుట్టింటికి పిలుచుకుని వెళ్లిపోయారు. భార్యను పుట్టింటికి పిలుచుకుని వెళ్లారని రగిలిపోయిన భర్త అతని భార్య అన్న కొడుకును కిడ్నాప్ చేసి అతని ఇంటికి పిలుచుకుని వెళ్లి లోపల బాలుడిని కట్టేసి డోర్ లాక్ చేశాడు. పోలీసులు వెళ్లి తలుపులు తియ్యాలని చెబితే రెండు గ్యాస్ సిలిండర్లు లీక్ చేశాడు. నా భార్యను నాకు అప్పగించకపోతే ఇంటినే పేల్చేస్తానని, అబ్బాయిని చంపేస్తానని సిగరేట్ అంటించే లైటర్ చేతిలో పట్టుకుని బెదిరించాడు. ఐదు గంటల పాటు ఆ ప్రాంతంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.

అందరివాడు

అందరివాడు

తమిళనాడులోని క్రిష్ణగిరి జిల్లాలోని వడమంగళం గ్రామానికి చెందిన రాజా అనే వ్యక్తి మూడు సంవత్సరాల క్రితం అముద అనే యువతిని వివాహం చేసుకున్నాడు. రాజా, అముద దంపతులు కొంతకాలం నివాసం ఉంటున్నారు. కొత్త ఇల్లు కట్టేందుకు రాజా అప్పు తీసుకున్నప్పుడు భార్యాభర్తల మధ్య తరచూ ఇదే విషయంలో గొడవలు జరుగుతున్నాయి. ఎప్పటిలాగానే రాజా, అముదాల మధ్య గొడవ జరగింది.

బావ ఎంట్రీతో సీన్ రివర్స్

బావ ఎంట్రీతో సీన్ రివర్స్

రాజా అతని భార్య అముదను తీవ్రంగా కొట్టాడు. గాయపడిన అముదా ఆమె సోదరుడు కాళీయప్పన్‌కు ఫోన్ చేసి సమాచారం అందించింది. హడావుడిగా వెళ్లిన కాళియప్పన్ అతని సోదరి అముదాను చికిత్స నిమిత్తం ఆస్పత్రిలో చేర్పించాడు. చికిత్స చేయించిన తరువాత అముదాను ఆమె పుట్టింటికి పిలుచుకుని వెళ్లిపోయారు. భార్య కోసం రాజా కాళియప్పన్ ఇంటికి వెళ్ళాడు, నీ భార్య అముదా ఇకపై నీతో జీవించడానికి మీ ఇంటికి రాదని కాళియప్పన్ తేల్చి చెప్పాడు.

బావ కొడుకును కిడ్నాప్ చేసిన రాజా

బావ కొడుకును కిడ్నాప్ చేసిన రాజా

కాళియప్పన్ ఇంట్లో లేడని తెలుసుకున్న రాజా అతని ఇంటికి వెళ్లి కాళీయప్పన్ మూడు సంవత్సరాల కుమారుడు రోహిత్‌ను కిడ్నాప్ చేసి అతని ఇంటికి తీసుకువచ్చాడు. రోహిత్ ను ఇంట్లోనే ఉంచి లోపల తలుపులు లాక్ చేసుకున్నాడు. నా భార్య అముదాను తీసుకువచ్చి నాకు అప్పగిస్తే నీ బిడ్డ రోహితను విడిచిపెడతానని రాజా ఇంట్లో నుంచి బెదిరించాడు. కాళియప్పన్ పోలీసులకు సమాచారం ఇచ్చాడు.

గ్యాస్ సిలిండర్లు ఓపెన్ చేసి సినిమా చూపించాడు

గ్యాస్ సిలిండర్లు ఓపెన్ చేసి సినిమా చూపించాడు

సమాచారం అందుకున్న బరుగూర్ పోలీసులు, బోచంపల్లి అగ్నిమాపక సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకుని చిన్నారి రోహిత్ ను విడిపించేలా రాజా చర్చలు జరిపారు. చర్చలతో సంతృప్తి చెందని రాజా మర్యాదగా నా భార్య ఇక్కడ ఉండాలని డిమాండ్ చేశారు. అముదా రాకపోవడంతో హఠాత్తుగా ఇంట్లో ఉన్న వంటగ్యాస్ సిలిండర్లు ఓపెన్ చేసిన రాజా ఇంటి మొత్తం గ్యాస్ లీక్ చేశాడు. వంటగ్యాస్ వాసన రావడంతో ఆ ప్రాంతంలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. అలాగే సిగరెట్ లైటర్ తీసుకున్న రాజా ఇంటికి నిప్పంటించి పేల్చేస్తానని బెదిరించాడు.

తలుపులు బద్దలు కొట్టిన పోలీసులు

తలుపులు బద్దలు కొట్టిన పోలీసులు

ఆ ప్రాంతంలో గ్యాస్ వాసనతో నిండిపోవడంతో పరిసర ప్రాంతాల్లో నివాసం ఉంటున్న ప్రజలు భయంతో పరుగు తీశారు. ఆలస్యమైతే ప్రమాదం జరుగుతుందని గ్రహించిన పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది రాజా ఇంటి తలుపులు పగులగొట్టి లోపలికి వెళ్లారు. పోలీసుల తీరుతో కంగుతిన్న రాజా లైటర్ వెలిగించడానికి ప్రయత్నించడంతో అతన్ని చితకబాదని పోలీసులు అతని చేతిలో ఉన్న లైటర్‌ని స్వాధీనం చేసుకున్నారు.

కేసు పెట్టకూడదని డిమాండ్

కేసు పెట్టకూడదని డిమాండ్

రాజా బారి నుంచి చిన్నారి రోహిత్ రక్షించిన పోలీసులు బయటకు తీసుకొచ్చి అతని కుటుంబ సభ్యులకు అప్పగించారు. అదే సమయంలో లీకవుతున్న గ్యాస్ సిలిండర్లను అగ్నిమాపక సిబ్బంది బయటకు తెచ్చి ఊరిబయట బహిరంగ ప్రదేశంలోకి విసిరేశారు. తనను మీరు అరెస్టు చేయ్యకూడదని, చక్కగా మాట్లాడుకుని రాజీకి వద్దామని, తన మీద కేసు పెట్టకుండా వదిలేయండి అంటూ రాజా పోలీసులకు చెప్పాడు. అయితే రాజాను పోలీస్ స్టేషన్ కు తీసుకెళ్లారు. పోలీసులు రాజాపై కిడ్నాప్, హత్యాయత్నం కేసులు నమోదు చేశారు. రాజా డ్రామాతో దాదాపు 5 గంటల పాటు ఆ ప్రాంతంలో ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+