Wife: ప్రియుడితో మస్త్ మజా చేస్తున్న భార్య, ఎంత చెప్పినా వినలేదు, ఇంట్లో మూడు శవాలు లేపిన భర్త !
భర్త మీద మోజు తీరిపోవడంతో భార్య వేరే వ్యక్తితో అక్రమ సంబంధం పెట్టుకుంది. నేను నా ఇష్టం వచ్చినట్లు తిరుగుతా, అడగడానికి నువ్వు ఎవరు అంటూ భార్య ఆమె భర్తతో గొడవపడుతున్నది.
బెంగళూరు/చిక్కబళ్లాపురం: వివాహం చేసుకున్న దంపతులు సంతోషంగా కాపురం చేశారు. దంపతులకు ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. పిల్లలు పుట్టిన తరువాత భార్యకు ఆమె భర్త మీద మోజు తీరిపోవడంతో భార్య వేరే వ్యక్తితో అక్రమ సంబంధం పెట్టుకుంది. అక్రమ సంబంధం విషయంలో దంపతుల మధ్య నిత్యం గొడవలు జరుగుతున్నాయి. నేను నా ఇష్టం వచ్చినట్లు తిరుగుతా, అడగడానికి నువ్వు ఎవరు అంటూ భార్య ఆమె భర్తతో గొడవపడుతున్నది. బార్య తీరుతో విసిగిపోయిన భర్త ఇంట్లో పెట్రోల్ పోసి నిప్పంటించాడు. దెబ్బకు ముగ్గురి ప్రాణాలు గాలిలో కలిసిపోయాయి.

సంతోషంగా కాపురం చేశారు
కర్ణాటకలోని చిక్కబళ్లాపురం జిల్లాలోని చింతామణి సమీపంలోని శిడ్లఘట్ట తాలుకాలోని యణ్ణూరు ప్రాంతంలో సోన్నేగౌడ అనే వ్యక్తి నివాసం ఉంటున్నాడు. 14 సంవత్సరాల క్రితం నేత్రావతి (38) అనే మహిళను సోన్నేగౌడ వివాహం చేసుకున్నాడు. వివాహం చేసుకున్న తరువాత సోన్నగౌడతో అతని భార్య నేత్రావతి చాలా సంతోషంగా కాపురం చేసింది. వివాహం జరిగిన కొత్తలో సోన్నగౌడ, నేత్రావతి దంపతులను చూసి అందరూ మురిసిపోయారు.

కూతుర్లు పుట్టిన తరువాత ?
సోన్నేగౌడ, నేత్రావతి దంపతులకు వర్షితా (12), స్నేహా (9) అనే ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. కుమార్తెలు పుట్టిన తరువాత నేత్రావతి వేరే యువకుడితో అక్రమ సంబంధం పెట్టుకుని అతనితో ఎంజాయ్ చేస్తోంది, వ్యవసాయం, వడ్డీ వ్యాపారం చేస్తున్న సోన్నేగౌడ ఎక్కువగా బయటతిరుగుతున్నాడు. భర్త సోన్నేగౌడ ఎక్కువగా బయట తిరుగుతుండటంతో పిల్లలను స్కూల్ కు పంపించిన తరువాత నేత్రావతి ఆమె ప్రియుడితో కలిసి తిరుగుతూ జల్సా చేస్తోంది.

భార్యను చంపేయాలని డిసైడ్ అయ్యాడు
భార్య నేత్రావతి అక్రమ సంబంధం గురించి తెలుసుకున్న సోన్నేగౌడ ఆమెను నిలదీశాడు, అక్రమ సంబంధం వియషంలోనే సోన్నేగౌడ, నేత్రావతి దంపతుల మధ్య నిత్యం గొడవలు జరుగుతున్నాయి. నేను నా ఇష్టం వచ్చినట్లు తిరుగుతా, అడగడానికి నువ్వు ఎవరు అంటూ నేత్రావతి భర్త సోన్నేగౌడకు ఎదురుతిరిగి నిత్యం గొడవపడుతున్నది. నేత్రావతి తీరుతో విసిగిపోయిన సోన్నేగౌడ అతని భార్యను చంపేయాలని డిసైడ్ అయ్యాడు.

భార్యా పిల్లలకు నిప్పంటించాడు
మంగళవారం రాత్రి ఇంటికి వెళ్లిన సోన్నేగౌడ ఆఖరిసారి అడుగుతున్నానను, నువ్వు పద్దతి మార్చుకుంటావా లేదా అని అతని భార్య నేత్రావతిని అడిగాడు, నేను ఇంతే అని నేత్రావతి తేల్చి చెప్పింది. సహనం కోల్పోయిన సోన్నేగౌడ మొదట అతను విషం తాగేశాడు. తరువాత ఆవేశంతో ఊగిపోయిన సోన్నేగౌడ ముందుగా క్యాన్ లో తీసుకెళ్లిన పెట్రోల్ అతని భార్య నేత్రావతి మీద పోశాడు, ఆ సందర్బంలో అడ్డు వచ్చిన కుమార్తెలు హర్షితా, స్నేహాల మీద పెట్రోల్ పోసిన సోన్నేగౌడ నిప్పంటించాడు. తల్లీ, పిల్లలకు మంటలు వ్యాపించడంతో ఆర్తనాదాలు చేశారు.

తల్లీ అక్రమ సంబందానికి కూతుర్లు సజీవదహనం
గ్రామస్తులు వెళ్లి మంటలు అదుపు చెయ్యడానికి ప్రయత్నించారు. ఆప్పటికే మంటలు వ్యాపించి ముగ్గురు కాలిపోయారు. తీవ్రగాయాలైన నేత్రావతి, ఆమె ఇద్దరు పిల్లలు సజీవదహనం అయ్యారు, విషం తాగిన సోన్నేగౌడ ఆసుపత్రిలో చావుబతుకులతో పోరాడుడుతున్నాడని పోలీసులు అన్నారు. భార్య అక్రమ సంబంధం కారణంగా ఆమె ఇద్దరు పిల్లలు సజీవదహనం కావడం ఆ ప్రాంతంలో కలకలం రేపింది.
-
రేషన్ లబ్దిదారులకు కేంద్రం గుడ్ న్యూస్- మూడు నెలల కోటా ఒకేసారి పంపిణీ -
బంగారం ధరల అంచనాలు తలకిందులు -
మేషరాశి, సింహరాశి, వృశ్చిక రాశి, ధనుస్సు రాశులకు ఏప్రిల్ నెలలో రాజయోగం -
బంగాళాఖాతంపై ఆవర్తనం- ఏపీలోని ఈ జిల్లాల్లో భారీ వర్షాలు -
తులారాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది వీరికి తిరుగేలేదు.. ఈ విషయంలో జాగ్రత్త! -
త్వరలో తిరుపతి, హైదరాబాద్కు నేరుగా రైళ్లు: ఆ జిల్లాకు కేంద్రమంత్రి తీపికబురు! -
రామ్ చరణ్ బర్త్ డేకు బిగ్ సర్ ప్రైజ్: `పెద్ది` నుంచి -
తిరుమలలో సీఎం చంద్రబాబుకు భక్తుల స్పెషల్ రిక్వెస్ట్, అక్కడే ఆదేశాలు..!! -
మహేష్ బాబు కాకుండా ఆ హీరో అంటే చాలా ఇష్టం - కృష్ణ -
ఇరాన్ కు ట్రంప్ డెడ్ లైన్- కౌంట్ డౌన్ బిగిన్స్ -
'ధురంధర్' యలీనా గుట్టురట్టు: నిజమా.. కల్పితమా? -
ఎట్టకేలకు జీవన్ రెడ్డి చేరే పార్టీ ఖరారు, అదే బాటలో..!!












Click it and Unblock the Notifications