ALH-3: కారుచీకట్లలో ఆపరేషన్.. సముద్రంలోకి వెళ్లి బాధితుడిని కాపాడిన భారత కోస్ట్ గార్డ్..
ప్రతికూల వాతావణంలో ఆపరేషన్ చేపట్టి శభాష్ అనిపించుకున్నారు భారత కోస్ట్ గార్డ్ సిబ్బంది. దేశంతో సంబంధం లేకుండా రిస్క్ తీసుకుని ఈ ఆపరేషన్ నిర్వహించారు. సముద్రంలో ప్రయాణిస్తున్న వ్యక్తికి గుండెపోటు రావడంతో అతడిని రక్షించేందుకు భారత కోస్ట్ గార్డ్ ఈ ఆపరేషన్ చెపట్టింది. కారుచీకట్లలో బాధితుడిని లిఫ్ట్ చేసి ఆస్పత్రికి తరలించింది. బాధితుడు చైనా వ్యక్తి అయినా సాయం చేసి గొప్ప మనస్సు చాటుకుంది.
In a daring operation, @IndiaCoastGuard #ALH MK-III evacuates a #Chinese national from MV Dong Fang Kan Tan No 2 around 200 Km mid-sea amidst challenging night conditions & extreme weather. Patient was reported chest pain &cardiac arrest symptoms.#SAR #ArabianSea#MaritimeSafety pic.twitter.com/THG0nBZjhi
— Indian Coast Guard (@IndiaCoastGuard) August 17, 2023
చైనాకు చెందిన ఎంవీ డాంగ్ ఫాంగ్ కాన్ టాన్ నెంబర్ 2 రీసెర్చ్ నౌక చైనా నుంచి యూఈఏకి వెళ్తోంది. ప్రస్తుతం ఈ నౌక అరేబియా సముద్రం మీదుగా ప్రయాణం చేస్తోంది. కొద్ది రోజుల్లో ఈ నౌక యూఏఈ చేరుకునేది. అయితే బుధవారం రాత్రి ఆ నౌక సిబ్బందిలో ఒకరైన యిన్ వీగ్ యాంగ్ కు గుండె పోటు వచ్చింది. ఆ సమయంలో నౌక ముంబై తీరానికి 200 కిలోమీటర్ల దూరంలో ఉంది.

నౌకలో ఉన్న మిగతా సిబ్బంది సమీప తీర ప్రాంతమైన ముంబై మారిటైమ్ రెస్క్యూ కో ఆర్డినేషన్ సెంటర్ అత్యవసర సందేశం ఇచ్చారు. చైనా నౌక సిబ్బంది సందేశానికి భారత కోస్ట్ గార్డ్ సిబ్బంది ఆపరేషన్ చేపట్టారు. యిన్ వీగ్ యాంగ్ ను ఆస్పత్రిలో చేర్చేందుకు ఏఎల్ హెచ్-3 హెలికాప్టర్ తో ఆపరేషన్ ప్రారంభించారు. ప్రతికూల వాతావరణంలో నౌక వద్దకు చేరుకుని బాధితుడిని రక్షించింది.
బాధితుడి హెలికాప్టర్ లోకి తీసుకుని ప్రథమ చికిత్స నిర్వహించారు. అనంతరం యన్ వీగ్ యాంగ్ ను ఆస్పత్రికి తరలించారు. ఇందుకు సంబంధించి భారత రక్షణ శాఖ ప్రకటన చేసింది. భారత కోస్ట్ గార్డ్ బృందంపై ప్రశంసలు కురుస్తున్నాయి. ఏ దేశమని చూడకుండా బాధితుడిని రక్షించిన వారికి ధన్యవాదాలు చెబుతున్నారు.












Click it and Unblock the Notifications