High Court: ఒంటరిగా ఆ వీడియోలు చూస్తే తప్పులేదట.. తీర్పునిచ్చిన న్యాయస్థానం..

కొంత మంది తమ మొబైల్స్ లో అశ్లీల ఫొటోలు లేదా వీడియోలు చూస్తుంటారు. అయితే ఇది నేరమా కాదా అనే దానికిపై కేరళ హైకోర్టు సంచలన తీర్పు ఇచ్చింది. ప్రైవేట్‌గా అశ్లీల ఫోటోలు లేదా వీడియోలు చూడటం భారతీయ శిక్షాస్మృతిలోని సెక్షన్ 292 ప్రకారం అశ్లీలత నేరంగా పరిగణించబడదని కేరళ హైకోర్టు తీర్పు స్పష్టం చేసింది. 2016 జూలైలో అలువా మున్సిపాలిటీ సమీపంలో రోడ్డు పక్కన నిలబడి ఓ వ్యక్తి తన మొబైల్ లో పోర్న్ వీడియోలు చూస్తున్నాడు. ఇది గమనించిన కొంత మంది వెంటనే పోలీసులు సమాచారం అందించారు.

అక్కడి చేరుకున్న పోలీసులు సదరు వ్యక్తిని అరెస్ట్ చేసి కేసు నమోదు చేశారు. అతనిపై సెక్షన్ 292 కింద కేసు నమోదు చేశారు. ఈ కేసు రద్దు చేయాలని ఆ వ్యక్తి కేరణ హైకోర్టును ఆశ్రయించాడు. నిందితుడి పిటినషన్ విచారించిన కోర్టు పై విధంగా తీర్పు చెప్పింది. "ఒక వ్యక్తి ప్రైవేట్ గా అశ్లీల వీడియోను చూడడం నేరంగా పరిగణిస్తారా అనేది ప్రశ్నగా మిగిలింది. అతను ఒంటరిగా ప్రైవేట్ గా వీడియో చూడడం వ్యక్తిగత ఎంపిక అనే సాధారణ కారణంతో నేరంగా పరిగణించదు. అదే విధంగా ఈ విషయంలో జోక్యం చేసుకోవడం అతని గోప్యతకు భంగం కలిగిస్తుంది" ని జస్టిస్ పివి కున్హికృష్ణన్ పేర్కొన్నరాు.

The Kerala High Court has ruled that watching Porn videos alone is not wrong
పిటిషనర్ వీడియోను బహిరంగంగా ప్రదర్శించినట్లు ప్రాసిక్యూషన్ ఆరోపించలేదని కోర్టు పేర్కొంది. దీంతో ఒంటరిగానే వీడియో చూస్తున్నట్లు పరిగణించాల్సి ఉంటందని అభిప్రాయపడింది. ఒక పర్సన్ పురుషుడు కావొచ్చు లేక స్త్రీ కావొచ్చ ఎవరికీ తెలియకుండా అశ్లీల ఫొటోలు లేదా వీడియోలను చూడటం అనేది సెక్షన్ 292 IPC ప్రకారం నేరం కాదని న్యాయమూర్తి వ్యాఖ్యానించారు.

ఒక వ్యక్తి ఏదైనా అసభ్యకరమైన వీడియోలు లేదా ఫోటోలను ప్రసారం చేయడానికి లేదా పంపిణీ చేయడానికి లేదా బహిరంగంగా ప్రదర్శించడానికి ప్రయత్నిస్తున్నట్లయితే అది నేరమవుతుందని స్పష్టం చేశారు. ఇది సెక్షన్ 292 IPC కింద మాత్రమే నేరంగా పరిగణించాల్సి ఉంటుందని పేర్కొంది. దీంతో నిందితుడిపై నమోదు చేసిన కేసును కోర్టు డిస్మిస్ చేసింది. పిల్లలకు ఫోన్లు ఇవ్వడం, అందులో ఇంటర్నెట్ సదపాయం ఉండడం వాటిపై న్యాయమూర్తి ఆందోళన వ్యక్తం చేశారు. పిల్లలు పక్కదారి పట్టే అవకాశం ఉందని.. వారిని గమనిస్తూ ఉండాలని సూచించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+