హైకోర్టుకు కేరళ స్టోరీ 2 నిర్మాత బిగ్ షాక్..! రివర్స్ లో అఫిడవిట్ ..!
కేరళలో ఎన్నికల వేళ విద్వేషాలను రెచ్చగొట్టేలా "ద కేరళ స్టోరీ 2" (The Kerala Story 2)పేరుతో నిర్మించిన సినిమాకు అనుమతిచ్చే విషయంలో హైకోర్టు నిన్న జారీ చేసిన ఆదేశాలు అమలు కాలేదు. ఈ సినిమాను తమకు చూపించిన తర్వాతే తాము ఏదైనా ఆదేశం ఇస్తామంటూ హైకోర్టు నిన్న చిత్ర నిర్మాతలకు స్పష్టం చేసింది. ఈ నేపథ్యంలో ఇవాళ హైకోర్టు న్యాయమూర్తుల ముందు ఈ సినిమా ప్రదర్శించకుండా నిర్మాత విపుల్ షా మొహం చాటేశాడు. అంతే కాదు కౌంటర్ అఫిడవిట్ కూడా దాఖలు చేశాడు.
ది కేరళ స్టోరీ 2 విడుదల చుట్టూ పెరుగుతున్న వివాదాల నేపథ్యంలో .. చిత్ర నిర్మాత విపుల్ అమృత్‌లాల్ షా, సినిమాను ప్రదర్శించాలని కేరళ హైకోర్టు ఇచ్చిన ఆదేశాలను వ్యతిరేకిస్తూ ఇవాళ కౌంటర్ అఫిడవిట్ దాఖలు చేశారు. సినిమాను వీక్షించడానికి, మూల్యాంకనం చేయడానికి కేరళ హైకోర్టు తన పర్యవేక్షక అధికారాన్ని ఉపయోగించకూడదని షా తెలిపాడు. సినిమాలను పరిశీలించడానికి, సర్టిఫికేషన్ మంజూరు చేయడానికి సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిల్మ్ సర్టిఫికేషన్ (CBFC) మాత్రమే అధికారం కలిగి ఉందని షా తెలిపాడు.

తమ సినిమాలో కథనంతో సంతృప్తి చెందిన నిపుణులు.. దాన్ని వీక్షించిన తర్వాత సినిమాను ప్రదర్శించడానికి గతంలో అనుమతించారని షా వివరించారు. అన్ని రాజ్యాంగ విధానాలను పాటించిన తర్వాత ఈ చిత్రానికి CBFC అనుమతి లభించిందని నిర్మాత తెలిపారు.CBFC నిర్ణయంలో గణనీయమైన లోపాలు ఉంటే తప్ప 'ది కేరళ స్టోరీ 2'ని నిలిపివేయలేమని చెప్పుకొచ్చాడు. ఈ సినిమా విడుదలను నిలిపివేయడం వల్ల భారీ ఆర్థిక నష్టం జరుగుతుందని ఆయన కోర్టుకు వెల్లడించాడు.
ఈ నేపథ్యంలో కేరళ హైకోర్టు దీనిపై ఏ నిర్ణయం తీసుకోబోతోందన్నది ఆసక్తికరంగా మారింది.












Click it and Unblock the Notifications