మేడమ్స్ అదుర్స్, పర్సనల్ మ్యాటర్, చెప్పులతో కొట్టుకున్న లేడీ టీచర్స్ !
పాట్నా/ బీహార్: ప్రభుత్వ ఉద్యోగం వస్తే చాలురా దేవుడా అంటూ కోట్లాది మంది భారతీయులు ఆశగా ఎదురు చూస్తున్నారు. ఇక స్కూల్ టీచర్ ఉద్యోగం వస్తే చాలా మంది సంతోషంతో ఎగిరి గంతేస్తారు. స్కూల్ టీచర్లు అంటే సమాజంలో చాలా గౌరవం ఇస్తారు అనే విషయం కొత్తగా చెప్పనవసరం లేదు. సమాజంలో చాలా మంది స్కూల్ కు వెళ్లి చదువుకుని ఏదోఒక విదంగా జీవితంలో సెటిల్ అవుతుంటారు.
అయితే ఈ మధ్య కాలంలో చాలా స్కూల్స్ లో చిన్నచిన్న విషయాలకు టీచర్లు గొడవపడటం, స్కూల్ లోనే లేడీ టీచర్లతో అక్రమ సంబంధాలు పెట్టుని గొడవలు పడటం చాలానే చూస్తున్నాము. ఒకే స్కూల్ లో లేడీ హెడ్ మాస్టర్ తో పాటు మరో ఇద్దరు లేడీ టీచర్ల మధ్య ఇలాంటి వ్యక్తిగత విషయాలతో గొడవులు ఎక్కువ అయ్యాయి. చివరికి రోడ్డు మీదకు వచ్చి చెప్పులతో కొట్టుకునే వరకు విషయం వెళ్లడం, ఆ వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ కావడం కలకలం రేపింది.

బీహార్ లో కక్ష రాజకీయాలకు ప్రతీకారం తీర్చుకోవడం కొత్తకాదు. బీహార్ అంటేనే తుపాకి రాజ్యం అనే పేరు ఉంది. రాజకీయాల్లోనే కాదు ప్రభుత్వ ఉద్యోగుల్లో కూడా బీహార్ రాజకీయాలు వంటపట్టినట్లు ఉన్నాయి. బీహార్ రాజధాని పాట్నాకు కూతవేటు దూరంలోని కూరియా పంచాయితీ ప్రభుత్వ ప్రాథమికోన్నత పాఠశాల ఉంది.
ఈ ప్రభుత్వ స్కూల్ లో శాంతకుమారి హెడ్ మాస్టర్ గా ఉద్యోగం చేస్తున్నారు. ఇదే స్కూల్ లో అనితా కుమారి అలియాస్ అనితా, మీనా బాయ్ అనే మేడమ్ తో పాటు కొంతమంది టీచర్లుగా ఉద్యోగాలు చేస్తున్నారు. కొంతకాలం నుంచి హెడ్ మాస్టర్ శాంత కుమారితో కొంత మంది టీచర్లకు గొడవలు జరుగుతున్నాయని తెలిసింది. లేడీ టీచర్ల వ్యక్తిగత విషయాలు లీక్ కావడంతో గొడవలు ఇంకా ఎక్కువ అయ్యాయని తెలిసింది.
లేడీ టీచర్ అనితా కుమారి స్కూల్ లో పాఠాలు చెబుతున్న సమయంలో హెడ్ మాస్టర్ శాంత కుమారి క్లాస్ రూమ్ లోకి వెళ్లారు. తరువాత హెడ్ మాస్టర్ శాంత కుమారి, లేడీ టీచర్ అనితా కుమారి మధ్య క్లాస్ రూమ్ కిటికీలు మూసే విషయంలో గొడవ జరిగింది. ఆ సమయంలో హెడ్ మాస్టర్ శాంత కుమారి, లేడీ టీచర్ అనితా కుమారిల మధ్య క్లాస్ రూమ్ లో విద్యార్థుల ముందే పెద్ద గొడవ జరిగింది.
ఆ సమయంలో సహనం కోల్పోయిన లేడీ టీచర్ అనితా కుమారి హెడ్ మాస్టర్ శాంత కుమారిని క్లాస్ రూమ్ లో నుంచి బయటకు లాగి చితకబాదేసింది. తరువాత లేడీ హెడ్ మాస్టర్ శాంత కుమారిని స్కూల్ ఆవరణం బయటకు తరిమి అక్కడ ఆమెను చెప్పులతో కొట్టింది. ఇదే సమయంలో అదే స్కూల్ లో పని చేస్తున్న మరో లేడీ టీచర్ మీనా బాయ్ కూడా వెళ్లి చెప్పులు తీసుకుని లేడీ హెడ్ మాస్టర్ శాంత కుమారిని చితకబాదేసింది. ఒకరు హెడ్ మాస్టర్ శాంత కుమారి కాళ్లు పట్టుకుంటే మరో లేడీ టీచర్ ఆమెను చెప్పులతో కొట్టింది.
बिहार पटना बिहटा
— ऋषि रंजन 🇮🇳 (@rishiranja) May 25, 2023
महिला हेड मास्टर और शिक्षिका के बीच जमकर चले लात-घूसे: पटना में शिक्षा का मंदिर बना अखाड़ा, खेत में एक-दूसरे को पटककर पीटा।
पटना के बिहटा स्थित एक सरकारी स्कूल में महिला हेड मास्टर और शिक्षिका आपस में भिड़ गईं। इस दौरान दोनों के बीच जमकर लात-घूसे चले। आलम ऐसा था… pic.twitter.com/WhTTHZHLt3
లేడీ హెడ్ మాస్టర్ శాంత కుమారి, ఇద్దరు లేడీ టీచర్లు వ్యక్తిగత కారణాలతో స్కూల్ లోనే విద్యార్థులు అందరి ముందు చెప్పులతో కొట్టుకుంటున్న సమయంలో స్థానికులు కొందరు వీడియోలు తీసి సోషల్ మీడియాలో అప్ లోడ్ చెయ్యడంతో అవి వైరల్ అయ్యాయి. విషయం తెలుసుకున్న పాట్నా విద్యాశాఖ అధికారులు లేడీ హెడ్ మాస్టర్ శాంత కుమారి, లేడీ టీచర్లు అనితా కుమారి, మీనా బాయ్ కి నోటీసులు ఇచ్చి వివరణ ఇవ్వాలని ఆదేశాలు జారీ చేశారు. తప్పు చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని నితీష్ కుమార్ ప్రభుత్వం హెచ్చరించింది.
-
ఎన్టీఆర్ పాటకు స్టెప్పులేసిన సితార.. వైరల్ వీడియో -
నక్కతోక తొక్కిన "అస్సాం బ్యూటీ".. నందమూరి హీరోతో స్టెప్పులేసే ఛాన్స్ !! -
ఏపీలో స్థానిక సంస్థల పునర్విభజన- మారిపోతున్న ముఖచిత్రాలు -
PNGకి మారకపోతే LPG సిలెండర్ కట్..! కేంద్రం డెడ్ లైన్..! -
చమురు, గ్యాస్ పరిస్ధితి ఇదీ- అఖిలపక్ష భేటీలో తేల్చేసిన కేంద్రం..! -
నన్ను ఆ డైరెక్టర్ ఎక్కడెక్కడో పట్టుకున్నాడు.. కానీ అమ్మానాన్న సర్దుకుపోమన్నారు !! -
Iran: ట్రంప్ కు ఇరాన్ దిమ్మతిరిగే షాక్..! సీజ్ ఫైర్ కు కఠిన షరతులివే..! -
ఇంధన కొరత వేళ.. తెలంగాణ ఆర్టీసీ సంచలన నిర్ణయం -
‘దీదీ’ రాజీనామా.. ఎన్నికల వేళ మమత సంచలన నిర్ణయం! -
ఏపీలో తెలంగాణ సీఎం.. లోకేష్ బంపర్ ఆఫర్ -
అంతా అయిపోయింది- డొనాల్డ్ ట్రంప్ -
Red Alert: వడగళ్ల వాన, రాబోయే రెండు గంటల్లో భారీ వర్షం












Click it and Unblock the Notifications