ఫేమస్ మాల్ లో అమ్మాయిని వెనుక తాకింది ఎవరంటే ? పాఠాలు చెప్పిన నోటితో ? !

బెంగళూరు: బెంగళూరు నగరంలోని లులు మాల్‌లో ఓ యువతి శరీరంలోని వెనుకభాగాన్ని ఓ వ్యక్తి తాకిన వీడియో ఇటీవల సోషల్ మీడియాలో వైరల్‌గా మారడంతో పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ కేసుకు సంబంధించి బెంగళూరులోని పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు నమోదైంది. ఇప్పుడు వీడియో ఫుటేజీ ఆధారంగా నిందితుడి ఆచూకిని పోలీసులు గుర్తించారు.

బెంగళూరు నగరంలోని బసవేశ్వరనగర్‌కు చెందిన అశ్వత్‌ నారాయణ్‌ (60) అలియాస్ టీచర్ అశ్వత్ అనే నిందితుడు ఇప్పుడు తప్పించుకుని పారిపోయాడు. మూడు రోజుల క్రితం బెంగళూరులోని లులు మాల్‌లో ఓ యవతితో అశ్వత్‌నారాయణ అసభ్యంగా ప్రవర్తించాడు. ఈ సమయంలో యశ్వంత్ అనే యువకుడు యువతితో అశ్వత్ అసభ్యంగా ప్రవర్తిస్తున్న ఆ వీడియో తీశాడు.

 The man who molested a young woman in a popular mall in Bengaluru is a retired head master,

సోషల్ మీడియాలో మాల్ కామపురాణం వీడియో వైరల్ కావడంతో లులూ మాల్ మేనేజర్ ఫిర్యాదు చెయ్యడంతో పోలీసులు కేసు నమోదు చేశారు. వీడియో ఆధారంగా పోలీసులు ఇప్పుడు నిందితుడి ఆచూకీని కనిపెట్టారు. నిందితుడు అశ్వత్ నారాయణ్ ఓ ప్రముఖ మఠానికి చెందిన పాఠశాలలో ప్రధానోపాధ్యాయుడిగా పనిచేసి పదవీ విరమణ పొందాడని పోలీసులు తెలిపారు.

అశ్వత్ నారాయణ్ ఎనిమిది నెలల క్రితం పదవీ విరమణ చేశాడని పోలీసుల విచారణలో వెలుగు చూసింది. అశ్వత్ నారాయణ్ బెంగళూరులోని బసవేశ్వరనగర్ లోని అతని ఇంటికి తాళం వేసి పరారయ్యాడు. అశ్వత్ కోసం బెంగళూరులోని మాగడి రోడ్ పోలీసులు వెతుకుతున్నారు. అక్టోబర్ 29వ తేదీ సాయంత్రం లులు మాల్‌లోని ఫంచర్ గేమ్ ఫ్లోర్‌లోని రెండవ అంతస్తులో ఒక వ్యక్తి యువతి వీపును, ఆమె శరీరంలోని ఇతర భాగాలను తాకుతూ అసభ్యంగా ప్రవర్తించాడు.

సెక్స్ ప్రపోజ్ చేసేందుకు నిందితుడు అశ్వత్ ఆమె శరీరంలోని వెనుక భాగాన్ని అసభ్యంగా తాకాడని పోలీసుల విచారణలో వెలుగు చూసింది. ఆ తర్వాత ఏమీ తెలియనట్లు అక్కడి నుంచి అశ్వత్ పారిపోయాడు. ఈ వీడియో ఒక కస్టమర్ మొబైల్‌లో రికార్డ్ చేశాడు. ఈ వీడియోను ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో అప్‌లోడ్ చెయ్యడంతో అది సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అయ్యింది.

 The man who molested a young woman in a popular mall in Bengaluru is a retired head master,

ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారడంతో మాల్ కు వెళ్లివస్తున్న వాళ్లు షాక్ అయ్యారు. ఆ వీడియోను సోషల్ మీడియాలో అప్‌లోడ్ చేసినట్లు లులు మాల్ అధికారి తెలుసుకుని ఇప్పుడు నిందితుడిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదు మేరకు మాగడి రోడ్డు పోలీసులు ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేసి వీడియో ఆధారంగా నిందితుడు అశ్వత్ ను గుర్తించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+