భర్త చనిపోయిన 12 ఏళ్లకు భార్యకు బిడ్డ, ప్రియుడితో రొమాన్స్, బిడ్డను ఏంచేసింది !

తిరువనంతపురం: భర్త చనిపోయిన 12 ఏళ్లకు ఓ మహిళ బిడ్డకు జన్మనిచ్చింది. అక్రమ సంబంధం కారణంగానే ఆమెకు బిడ్డపుట్టింది. పుట్టిన బిడ్డను ఆమె చాలా కిరాతకంగా హత్య చేసింది. కేరళలోని తిరువనంతపురం సమీపంలోని తీరంలో అంజుతెంగు అనే గ్రామం ఉంది. కొద్దిరోజుల క్రితం పుట్టిన చిన్నారి మృతదేహం నుంచి చేతులు, కాళ్లు నరికేసి సముద్ర ప్రాంతంలో విసిరేశారు. చిన్నారి కాళ్లు, చేతులు చూసిన ప్రజలు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు.

ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు చిన్నారి మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని పోస్టుమార్టం నిమిత్తం తిరువనంతపురం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ఆ తర్వాత ఆ చిన్నారి ఎవరు, ఎక్కడి నుంచి కాళ్లు, చేతులు తీసుకు వచ్చి విసిరేశారు అంటూ పోలీసులు విచారణ చేపట్టారు. కేరళలోని కొట్టాయం, కొల్లాం, తిరువనంతపురం తదితర ప్రాంతాల్లోని ఆసుపత్రుల్లో పుట్టిన శిశువుల చిరునామాలను పోలీసులు సేకరించారు.

legs

అంజుతెంగు గ్రామానికి చెందిన జూలీ అనే మహిళ పేరు బయటపడింది. దీంతో అనుమానం వచ్చిన పోలీసులు జూలీని విచారించేందుకు ఆమెను పోలీస్ స్టేషన్‌కు పిలిపించారు. ఆ సమయంలో విచారణకు హాజరైన జూలీ తనకు ఎలాంటి బిడ్డ పుట్టలేదని చెప్పింది. దీంతో పోలీసులు జూలీని తిరువనంతపురం ప్రభుత్వాసుపత్రికి తీసుకెళ్లి ప్రసూతి వైద్యులతో పరీక్షలు నిర్వహించారు. జూలీకి ఇటీవల బిడ్డపుట్టిందని వైద్యులు చెప్పారు. తరువాత జూలీ ఇంటికి వెళ్లిపోయింది.

child
ఆ చిన్నారిని ఎందుకు ఊపిరాడకుండా చేసి చంపావని, ఆ బిడ్డను వేరే వారికి ఇచ్చి ఉండవచ్చు కదా అంటూ పోలీసులు జూలీని ఫోన్‌లో ప్రశ్నించారు. అప్పుడు చిన్నారి మెడ విరిగిపోయిందని, పోస్టుమార్టంలో అన్నీ బయటకు వచ్చాయని పోలీసులు చెప్పడంతో జూలీ ఫోన్‌లోనే జరిగిన వాస్తవాలను పోలీసులకు చెప్పింది.

ఇది విన్న పోలీసులు షాక్ అయ్యారు. జూలీ భర్త 12 ఏళ్ల క్రితం చనిపోయాడు. వితంతువు అయిన జూలీకి అదే ప్రాంతానికి చెందిన ఓ యువకుడితో పరిచయం ఏర్పడింది. తరువాత అతనితో జూలీ అక్రమ సంబంధం పెట్టుకుంది. అయితే జూలీని అతను పెళ్లి చేసుకోలేదని, అతని కారణంగానే ఆమెకు బిడ్డ పుట్టిందని పోలీసులు తెలుసుకున్నారు. భర్త చనిపోయిన చాలా సంవత్సరాల తరువాత తనకు బిడ్డపుట్టిందని అందరికి తెలిస్తే పరువు పోతుందని భావించానని జూలీ పోలీసులకు చెప్పింది,

ఎవరికీ తెలియకుండా తాను దాచిపెట్టానని, తరువాత బిడ్డను చంపేశానని జూలీ నేరం అంగీకరించింది. తనకు పుట్టిన బిడ్డ ఏడుపు ఎవ్వరూ వినకుండా ఉండటానికి నోటికి, ముక్కుకు ప్లాస్టర్ వేశానని, తరువాత ఊపిరాడకుండా చేసి చిన్నారి చేతులు, కాళ్లు నరికేశానని, మొండెం ఇంట్లోనే పాతిపెట్టానని, తరువాత చేతులు, కాళ్లు నిర్జనప్రదేశంలో విసిరేశానని జూలీ నేరం అంగీకరించింది.

అనంతరం చిన్నారిని చంపేందుకు ఉపయోగించిన ఆయుధాలను స్వాధీనం చేసుకున్న పోలీసులు జూలీని అరెస్టు చేసి విచారణ చేస్తున్నారు. అక్రమ సంబంధం కారణంగా పుట్టిన బిడ్డను తల్లి అతి కిరాతకంగా హత్య చెయ్యడం కేరళలో కలకలం రేపింది. అక్రమ సంబంధాల కారణంగా తల్లి అయిన వాళ్లు ఇలాంటి హత్యకు పాల్పడటంతో ప్రజలు షాక్ అవుతున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+