jewellery: పట్టపగలు జ్యువెలరీ షాప్ లో ఉద్యోగి దారుణ హత్య, మాస్క్, హెల్మెట్ వేసుకుని పక్కా ప్లాన్ !
మంగళూరులోని హోపనకట్టేలో పట్టపగలు నగల దుకాణంలోకి చొరబడి సిబ్బందిని కత్తితో పొడిచి చంపడం కర్ణాటకలో కలకలం రేపింది. మంగళూరు జ్యువెలర్స్ లో ఉద్యోగం చేస్తున్న వ్యక్తిని హత్య చేసి నగలు లూటీ చేసి పరారైనారు.
బెంగళూరు/మంగళూరు: మంగళూరు నగరంలోని హంపనకట్టే సమీపంలో పట్టపగలు నగల దుకాణంలోకి చొరబడి సిబ్బందిని కత్తితో పొడిచి చంపడం కర్ణాటకలో కలకలం రేపింది. మంగళూరు సిటీలోని హంపనకట్టెలోని మంగళూరు జ్యువెలరీ అనే దుకాణంలో దుండుగులు రెచ్చిపోయారు. మంగళూరు జ్యువెలర్స్ లో ఉద్యోగం చేస్తున్న రాఘవేంద్ర (50) అనే వ్యక్తి శుక్రవారం దారుణ హత్యకు గురైనాడు.
మంగళూరు జ్యువెలర్స్ కేశవ ఆచార్యకు చెందినదిని పోలీసు అధికారులు అంటున్నారు. షోరూమ్ యజమాని భోజనం చేసే సమయంలో షాప్ లో రాఘవేంద్ర ఒంటరిగా ఉన్నాడని, ఆ సమయంలో మాస్క్, హెల్మెట్ వేసుకుని వచ్చిన ఓ వ్యక్తి రాఘవేంద్రను హత్య చేశాడని మంగళూరులోని బందరు పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైంది.

మంగళూరు పోలీస్ కమిషనర్ శశికుమార్ ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించి వివరాలు సేకరించారు. అనంతరం శశికుమార్ మీడియాతో మాట్లాడుతూ కేశవ్ ఆచార్యకు చెందిన మంగళూరు జ్యువెలరీస్ లో మధ్యాహ్నం 1.30 గంటలకు కేశవ ఆచార్య భోజనానికి వెళ్లిన తరువాత రాఘవేంద్ర హత్యకు గురైనాడని అన్నారు.
అయితే మద్యాహ్నం 3.45 గంటలకు కేశవ్ ఆచార్య ఆ షాపుకు వచ్చాడని, కారు పార్క్ చేసే చోట ఓ బైక్ ఆగి ఉందని, ఆ బైక్ పక్కకు తియ్యాలని కేశవ్ ఆచార్య రాఘవేంద్రను పిలిపించాడని, ఫోన్ కాల్ రిసీవ్ చెయ్యకపోడంతో కేశవ ఆచార్యా లోపలికి వెళ్లాడని అన్నారు. ఆ సమయంలో రాఘవేంద్రను ఎవరో కత్తితో పొడిచి చంపారని కేశవ ఆచార్య గట్టిగా కేకలు వెయ్యడంతో చుట్టుపక్కల వాళ్లు అక్కడికి వచ్చారని పోలీసులు అంటున్నారు. రాఘవేంద్ర మెడపై కత్తిపోట్లు పడి ఉన్నాయని, రాఘవేంద్ర ఆచార్య ఏడు నెలలుగా ఆచార్య దగ్గర పని చేస్తున్నాడని పోలీసు అధికారులు తెలిపారు.
నగలలోని కొన్ని బంగారు నగలు మాయమైనట్లు యజమాని పోలీసులకు ఫిర్యాదు చేశారు. లెడ్జర్‌ను పరిశీలించి ఎంత విలువైన బంగారం పోయిందో తెలుస్తోందని పోలీసులు అంటున్నారు. నిందితులు హెల్మెట్, మాస్క్ ధరించి వచ్చారని, నిందితుడు దాదాపు అరగంటకు పైగా నగల దుకాణంలోనే ఉన్నాడని, నిందితుడు నగలతో బయటకు వెలుతున్న సమయంలో ఆ దృశ్యాలు సీసీటీవీలో రికార్డు అయ్యాయని పోలీసు అధికారులు తెలిపారు.












Click it and Unblock the Notifications