భారీగా పెరిగిన సిలిండర్ ధర - వినియోగదారుకు షాక్..!!
సిలిండర్ ధర మరోసారి పెరిగింది. 19 కేజీల ఎల్పీజీ సిలిండర్ ధరను రూ.102.5 మేర పెంచుతూ చమురు సంస్థలు నిర్ణయం తీసుకున్నాయి. దీంతో రూ.2253గా ఉన్న ఈ సిలిండర్ ధర రూ.2355.50కు పెరిగింది. ఐదు కేజీల ఎల్పీజీ సిలిండర్ ధర రూ.655కు పెరిగింది. ప్రతి నెల ఒకటో తేదీన సిలిండర్ ధరలను చమురు సంస్థలు సవరిస్తాయి. దేశంలోని అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో నెలనెలా సిలిండర్ల రేట్లను సవరిస్తుంటాయి చమురు సంస్థలు. ఏప్రిల్‌లోనూ వాణిజ్య ఎల్పీజీ రేట్లను రూ.250 మేర పెంచాయి. అయితే, డొమెస్టిక్ వినియోగదారుల పైన ప్రభావం లేకుండా నిర్ణయం తీసుకున్నారు.
ఇంటి అవసరాలకు వినియోగించే వంట గ్యాస్ ధరలు మాత్రం యధాతధంగా ఉండనున్నాయి. ఇప్పటికే పెరిగిన పెట్రో ఉత్పత్తుల ధరలతో సామాన్యులకు భారంగా మారింది. తాజాగా.. ప్రధాని మోదీ సైతం తాము పెట్రో ఉత్పత్తుల పైన ఎక్సైజ్ పన్ను తగ్గించామని..రాష్ట్రాలు సైతం వ్యాట్ తగ్గింపు నిర్ణయం తీసుకోవాలని కోరుకుంటున్నట్లుగా ప్రధాని సూచించారు. దీని పైన రాజకీయంగా విమర్శలు వెల్లు వెత్తాయి. కేంద్రం వసూలు చేస్తున్న సెస్ మినహాయిస్తే పెట్రోల్ ధరలు తగ్గుముఖం పడతాయని ప్రతిపక్షాలు చెప్పుకొచ్చాయి.

ఇక, తెలుగు రాష్ట్రాల్లో వ్యాట్ తగ్గింపు పైన ప్రధాని సూచనలు చేసారు. దీని పైన తెలంగాణ సీఎం కేసీఆర్ ఓపెన్ గానే తన అభిప్రాయం తేల్చి చెప్పారు. తాము ధరలు పెంచలేదని..తగ్గించాలని తమను ఎలా కోరుతారని ప్రశ్నించారు. ఏపీ ప్రభుత్వం మాత్రం ప్రధాని సూచన పైన అధికారికంగా స్పందించ లేదు. ఇక, ఇప్పుడు వాణిజ్య సిలిండర్ ధర పెంచటం ద్వారా.. కమర్షియల్ వినియోగదారుల పైన భారం పడనుంది.
-
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
ప్రతీ ఇంటికీ రెండు ఫ్రీ గ్యాస్ సిలెండర్లు-ఇరాన్ వార్ వేళ సర్కార్ ఆఫర్..! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
ఏపీలో ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్..! ఇకపై ఈ మార్పు..! -
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..! -
విజయ్‌కు షాకిచ్చిన సర్వే!: ఆ పార్టీకి 180+ సీట్లు -
ధనుస్సు రాశి, మకర రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
తెలంగాణ కేబినెట్ సంచలన నిర్ణయాలు.. ఆ బిల్లులకు ఆమోదం












Click it and Unblock the Notifications